E-Paper
Advertisement

తక్కువ ఖర్చుతో ఎక్కువ రేంజ్.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

తక్కువ ఖర్చుతో ఎక్కువ రేంజ్.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Advertisement

Top Trending EV Scooters in India 2026: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ రోజు రోజుకూ మరింత వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ రన్నింగ్ కాస్ట్, కొత్త టెక్నాలజీ ఫీచర్లు కారణంగా చాలా మంది ఇప్పుడు EV స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 2026 మే నాటికి మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈవీ స్కూటర్ల గురించి చూద్దాం..

⦿ Ola S1 Pro, S1 X+

ప్రస్తుతం భారత మార్కెట్‌ లో ట్రెండింగ్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా S1 సిరీస్ టాప్ లో ఉంది. Ola S1 Pro, S1 X+ మోడళ్లు మంచి రేంజ్‌ తో పాటు అత్యాధునిక ఫీచర్ల కారణంగా యువతను ఆకర్షిస్తున్నాయి. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. పెద్ద టచ్‌ స్క్రీన్, కనెక్టెడ్ ఫీచర్లు, మొబైల్ యాప్ సపోర్ట్ లాంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ స్కూటర్ల ధరలు సుమారు రూ.84 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.

⦿ TVS iQube

Advertisement

ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇదీ ఒకటి. నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్, కుటుంబ ప్రయాణానికి అనుకూలమైన డిజైన్ కారణంగా మంచి డిమాండ్ ఉంది. కొత్త మోడళ్లలో పెద్ద బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులోకి రావడంతో రేంజ్ కూడా పెరిగింది. సాఫ్ట్ రైడింగ్ ఎక్స్ పీరియెన్స్, పెద్ద సీటింగ్, సింపుల్ డిజిటల్ డిస్‌ ప్లే లాంటి అంశాలు కుటుంబ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీని ప్రారంభ ధర సుమారు రూ.1.11 లక్షల నుంచి ఉంటుంది.

⦿ Ather 450X

మంచి పర్ఫార్మెన్స్ కోరుకునే రైడర్లకుఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్‌. స్పోర్టీ రైడింగ్ ఎక్స్ పీరియెన్స్, వేగవంతమైన యాక్సిలరేషన్, మంచి హ్యాండ్లింగ్ కారణంగా ఈ స్కూటర్ యువతలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక కుటుంబాల కోసం తీసుకొచ్చిన ఏథర్ రిజ్టా  కూడా మార్కెట్‌ లో బాగా సత్తా చాటుతోంది. పెద్ద సీటు, ఎక్కువ స్టోరేజ్ స్పేస్, సౌకర్యవంతమైన రైడింగ్ యూజర్లను ఆకట్టుకుంటుంది. మ్యాజిక్ ట్విస్ట్ రీజెనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్ కూడా వినియోగదారులను ఆకర్షిస్తుంది.

⦿  Bajaj Chetak

Advertisement

ఇది కూడా మార్కెట్‌ లో టాప్ లో కొనసాగుతోంది. మెటల్ బాడీ నిర్మాణం, క్లాసిక్ డిజైన్, మంచి బిల్డ్ క్వాలిటీ కారణంగా చాలామంది చేతక్‌ ను ఇష్టపడుతున్నారు. పూర్తి ఛార్జ్‌ తో 127 నుంచి 150 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించడం దీనికి మరో ప్లస్ పాయింట్. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువగా ఉండటంతో కుటుంబ వినియోగానికి బెస్ట్ ఆప్ ఇది మంచి ఎంపికగా మారింది.

⦿ Ampere Magnus G Max  

బడ్జెట్‌లో మంచి రేంజ్ కోరుకునే వారికి ఈ స్కూటర్  మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందించడం వల్ల ఈ స్కూటర్ మార్కెట్‌లో ట్రెండ్ అవుతోంది. USB ఛార్జింగ్ లాంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలకు సరిపడే విధంగా దీన్ని రూపొందించారు.

⦿ Honda Activa e

ఇక హోండా కూడా యాక్టివాను ఎలక్ట్రిక్ రూపంలో తీసుకొచ్చింది. మార్కెట్‌లోకి రావడంతో EV విభాగంలో పోటీ మరింత పెరిగింది. యాక్టివాపై ఉన్న నమ్మకం, హోండా బ్రాండ్ కారణంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: రూ. 5 వేల లోపు బెస్ట్ హెల్మెట్లు.. సేఫ్టీతో పాటు స్టైల్ కూడా!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×