E-Paper
Advertisement

Tata Punch EV vs Punch petrol: టాటా పంచ్ EV, టాటా పంచ్ పెట్రోల్, వీటిలో ఏది కొంటే బెస్ట్?

Tata Punch EV vs Punch petrol:  టాటా పంచ్ EV, టాటా పంచ్ పెట్రోల్, వీటిలో ఏది కొంటే బెస్ట్?
Advertisement

టాటా మోటార్స్ ఎప్పటికప్పడు తన మోడల్స్ ను వినియోగదారులకు నచ్చేలా అప్ డేట్ చేస్తుంది. పాత వెర్షన్లను సరికొత్తగా అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా 2026 టాటా పంచ్ ఫేస్‌ లిఫ్ట్ సబ్ కాంపాక్ట్ SUVగా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. పాత కారుతో పోల్చితే కొత్త ఫీచర్లతో రెడీ అయ్యింది. అయితే, టాటా పంచ్ పెట్రోల్, ఎలక్ట్రిక్ ఫేస్ లిఫ్ట్ లో ఏ కారు కొంటే బెస్ట్ అనేది ఇప్పడు తెలుసుకుందాం..

టాటా పంచ్ ICE vs EV డిజైన్

రెండు కార్ల డిజైన్ ఒకేలా ఉంటుంది. LED హెడ్‌ లైట్లు, టర్న్ ఇండికేటర్లతో కూడిన గ్లాస్ బ్లాక్ ఫినిష్డ్ ORVMలు, చుట్టూ ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్, పుల్ టైప్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్, C పిల్లర్‌పై అమర్చబడిన వెనుక భాగాలు ఒకేలా ఉంటాయి. అయితే, జీరో ఎమిషన్, పంచ్ ముందు భాగంలో కనెక్ట్ చేయబడిన DRLలు, LED టెయిల్ లైట్ల కోసం యారో, వెనుక ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ కోసం వేర్వేరు డిజైన్‌ లతో భిన్నంగా ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ వెనుక భాగంలో కనెక్ట్ చేయబడిన లైట్ బార్,  కొద్దిగా సర్దుబాటు చేయబడిన DRLలు, టెయిల్ లైట్లు, బంపర్లను కలిగి ఉంటుంది.

టాటా పంచ్ ICE vs EV ఇంటీరియర్

Advertisement

2026 ఫేస్‌ లిఫ్ట్‌  చాలా అప్ డేట్ అయ్యింది. వీటిలో ఎక్కువ భాగం 10.25-అంగుళాల టచ్‌ స్క్రీన్, మంచి  టాటా లోగోతో 2-స్పోక్ స్టీరింగ్ వీల్, ఆటో డిమ్మింగ్ IRVM, 360 డిగ్రీ కెమెరా సెటప్ను రెండు కార్లు పంచుకున్నాయి. అయితే, పంచ్ EV.. పెట్రోల్ వెర్షన్ లో 7-అంగుళాల పార్ట్ డిజిటల్ యూనిట్‌తో పోలిస్తే పెద్దగా, పూర్తిగా డిజిటల్ 10.25 అంగుళాల డ్రైవర్ డిస్‌ ప్లేను కలిగి ఉంటుంది. ముందు సీట్ల కోసం వెంటిలేషన్ ఫంక్షన్‌ ను కలిగి ఉంటుంది. EV  సెంటర్ కన్సోల్‌ లో రోటరీ డ్రైవ్ మోడ్ సెలెక్టర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ స్విచ్ ఉన్నాయి. అయితే ICE మోడల్‌ లో సాంప్రదాయ గేర్ షిఫ్టర్, హ్యాండ్‌ బ్రేక్ లివర్ అందుబాటులో ఉన్నాయి. ఆడియో కోసం, రెండు వెర్షన్‌ లలో నాలుగు స్పీకర్లు ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్ లో నాలుగు ట్వీటర్లను కలిగి ఉండగా, EVలో రెండు ఉంటాయి.

టాటా పంచ్ ICE vs EV, ఇంజిన్, ధరలు

టాటా పంచ్ పెట్రోల్ వెర్షన్ తో పోల్చితే ఎలక్ట్రిక్ SUV ధర చాలా ఎక్కువగా ఉంటుంది. పంచ్ ICE ధర రూ.5.59 లక్షల నుంచి రూ. 10.54 లక్షల వరకు ఉంటుంది. పంచ్ EV ధర రూ.9.99 లక్షల నుంచి రూ. 14.44 లక్షలు ఉంటుంది.  పంచ్ పెట్రోల్ వెర్షన్ లో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (MT/ AMT) పవర్ ట్రెయిన్ ను కలిగి ఉంటుంది. పంచ్ EV  25kWh, 35kWh ప్యాక్‌ తో వస్తుంది. ఈ కారు 315 కి.మీ నుంచి 421 కి.మీ రేంజ్ ను అందిస్తుంది.

టాటా పంచ్ ICE vs EVలో ఏది బెస్ట్ అంటే?

Advertisement

పంచ్ EV ధర ICE SUV కంటే చాలా ఎక్కువ. కానీ, రన్నింగ్ ఖర్చులు తక్కువగా ఉంటాయి.

Read Also: కొత్త, పాత టాటా పంచ్ ఈవీలో ఎది బెస్ట్? ఎందుకు?

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×