Old vs New Tata Punch EV 2026: టాటా మోటార్ తాజాగా సరికొత్త టాటా పంచ్ EV ఫేస్ లిఫ్ట్ మోడల్ ను లాంచ్ చేసింది. పాత వెర్షన్ తో పోలిస్తే ముఖ్యమైన తేడా పెద్ద బ్యాటరీ. 40kWh ప్యాక్ తో వచ్చింది. ఎక్కువ రేంజ్, ఆధునిక డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో వస్తుంది. కొత్త మోడల్ 30kWh, 40kWh బ్యాటరీ ఆప్షన్లతో, 88hp, 129hp మోటార్ సామర్థ్యంతో మెరుగైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. కొత్త డిజైన్, పెద్ద టచ్ స్క్రీన్, ADAS ఫీచర్లతో వచ్చింది.
⦿ కొత్త మోడల్ (2026): 30kWh, 40kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుంది. 40kWh వేరియంట్ ఒకే ఛార్జ్ తో సుమారు 468 కి.మీ ప్రయాణాన్ని అందిస్తుంది.
⦿ పాత మోడల్ (2024-25): 25kWh, 35kWh బ్యాటరీ ప్యాక్‌ల ను కలిగి ఉంటుంది. 265 కి.మీ – 365 కి.మీ రేంజ్ ఇస్తుంది.
⦿ కొత్త మోడల్: 40kWh వేరియంట్ 129hp పవర్, 154Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. కొత్త కాంపాక్ట్ మోటార్ డిజైన్ తో బరువు తగ్గించారు.
⦿ పాత మోడల్: 35kWh వేరియంట్ 118hp పవర్, 190Nm టార్క్ అందిస్తుంది.
⦿ కొత్త మోడల్: రీడిజైన్ చేసిన ఫ్రంట్ ఫాసియా, కొత్త LED లైటింగ్, అప్‌డేటెడ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. లోపల 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.
⦿ పాత మోడల్: పాత డిజైన్ భాషా, చిన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండేది.
⦿ కొత్త మోడల్: అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్(ADAS), 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది.
⦿ పాత మోడల్: ప్రైమరీ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, బేసిక్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
⦿ వారంటీ: 40kWh బ్యాటరీపై అపరిమిత కిలోమీటర్లతో లైఫ్ టైమ్ వారంటీని టాటా అందిస్తుంది.
Read Also: కొత్త బ్యాటరీ, సరికొత్త రేంజ్.. సరికొత్త టాటా పంచ్ EV ఫేస్ లిఫ్ట్ వచ్చేసింది!
కొత్త మోడల్ 40kWh వేరియంట్ లో టార్క్ పాతదాని కంటే కొద్దిగా తగ్గినప్పటికీ, ఓవరాల్ పెర్ఫార్మెన్స్, రేంజ్ మెరుగ్గా ఉన్నాయి. ధరల పరంగా, కొత్త ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లలో కొన్ని రూ. 1.85 లక్షల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది.
Read Also: వచ్చేస్తోంది హ్యుందాయ్ ఎక్స్ టర్ ఫేస్‌లిఫ్ట్, ప్రత్యేకతలు చూస్తే మతిపోవాల్సిందే!