E-Paper
Advertisement

భువనగిరిలో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం.. ఆ అంశాలపై ప్రత్యేక చర్చ..!

భువనగిరిలో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం.. ఆ అంశాలపై ప్రత్యేక చర్చ..!
Advertisement

Congress Strategy: స్వేచ్ఛ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం భువనగిరి పట్టణంలో విస్తృత స్థాయిలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, నాయకత్వ సమన్వయం వంటి అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి బూత్‌లో పార్టీకి బలమైన నిర్మాణం ఉండాలని, అందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రతి నాయకుడి బాధ్యత అని పేర్కొన్నారు.

భువనగిరి నియోజకవర్గంలో..

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సకాలంలో, సమర్థంగా చేరవేసి వారి విశ్వాసాన్ని గెలుచుకోవాలని ఆయన సూచించారు. పథకాల అమలులో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవడంతో పాటు, లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే పార్టీ కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు విస్తరణ, సంగఠన్ సృజన్ అభియాన్ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, కోఆర్డినేటర్లతో సమన్వయం వంటి కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పార్టీని కేడర్ స్థాయిలో బలపరిచేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని నాయకులు నిర్ణయించారు. అదేవిధంగా భువనగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు కనిపించే విధంగా ఫలితాలు అందించాలని ఎమ్మెల్యే కుంభం సూచించారు. ప్రతి ప్రాజెక్ట్‌ను సమయానికి పూర్తి చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.

Advertisement

Also Read: పాలమూరులో ఇసుక మాఫియా అరాచకం.. దందా అడ్డుకుంటే పై నుంచి ఫోన్లు..?

ఈ సమావేశంలో..

ఈ సమావేశంలో భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ & SSA కో-ఆర్డినేటర్ కె. శంకర్ నాయక్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్, డిసిసి అధ్యక్షులు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే (ప్రభుత్వ విప్) వేముల వీరేశం, తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల శామ్యూల్, డిసిసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, డిసిసి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, డిసిసి జనగాం జిల్లా అధ్యక్షురాలు దమయంతి, జనగాం, భువనగిరి, ఇబ్రహీంపట్నం, మునుగోడు, తుంగతుర్తి తదితర నియోజకవర్గాల కోఆర్డినేటర్లు నూతి శ్రీకాంత్ గౌడ్, ఈ.వి. శ్రీనివాస్ రావు, చైతన్య కృష్ణ రెడ్డి, రుద్ర సంతోష్ కుమార్, కొండేటి మల్లయ్య , ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Also Read: విజయ్ సీఎం అవుతాడని ముందే చెప్పేసిన పూజా హెగ్డే? ఇదిగో వీడియో!

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×