E-Paper
Advertisement

Tata Tiago: టాటా టియాగో క్రియేటివ్ vs క్రియేటివ్ ప్లస్.. ఏ వేరియంట్ కొనడం బెస్ట్?

Tata Tiago: టాటా టియాగో క్రియేటివ్ vs క్రియేటివ్ ప్లస్.. ఏ వేరియంట్ కొనడం బెస్ట్?
Advertisement

Tata Tiago Creative vs Creative Plus: టాటా మోటార్స్ ఇటీవల కొత్త టియాగో హ్యాచ్‌ బ్యాక్‌ ను మరింత ఆకట్టుకునే  డిజైన్, ఆధునిక ఫీచర్లు, అప్‌ డేటెడ్ క్యాబిన్‌ తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కారు పలు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, ఎక్కువ మంది కొనుగోలుదారులు క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్ వేరియంట్ల మధ్య ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ రెండు వేరియంట్ల మధ్య ఉన్న తేడాలు, ఫీచర్లు, ధరలను పరిశీలిస్తే, ఎవరికి ఏది సరిపోతుందో అర్థం చేసుకోవచ్చు.

డిజైన్ గురించి..

డిజైన్ పరంగా చూస్తే, రెండు వేరియంట్లు దాదాపు ఒకేలా కనిపిస్తాయి. LED హెడ్‌ ల్యాంప్స్, LED డే టైమ్ రన్నింగ్ లైట్స్,  గ్లాస్ బ్లాక్ ఫినిష్ గ్రిల్, స్పోర్టీ బంపర్ డిజైన్ రెండింటిలోనూ ఉన్నాయి. అయితే, క్రియేటివ్ ప్లస్ వేరియంట్‌ లో మాత్రమే ఫాగ్ ల్యాంప్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ఫీచర్ ద్వారా రెండు వేరియంట్లను ఈజీగా గుర్తించే అవకాశం ఉంది.  సైడ్ ప్రొఫైల్‌ లో కూడా పెద్దగా మార్పులు లేవు. బ్లాక్ B పిల్లర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, సిల్వర్ డోర్ హ్యాండిల్స్, గ్లాస్ బ్లాక్ ORVMలు రెండింటిలోనూ ఉన్నాయి. అలాగే 15 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ కూడా ఈ రెండు టాప్ వేరియంట్లలో లభిస్తాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, స్పోర్టీ బంపర్, రియర్ డిఫాగర్ లాంటి అంశాలు ఒకే విధంగా ఉంటాయి.

కలర్ ఆప్షన్స్ గురించి..

Advertisement

కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, ప్రిస్టీన్ వైట్, డేటోనా గ్రే, ప్యూర్ గ్రే, పాంగోంగ్ పల్స్, సోబో సర్జ్, వారణాసి వైబ్రాన్స్ లాంటి ఆరు రంగుల్లో ఈ రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రీమియం ఇంటీరియర్..

క్యాబిన్‌ లోకి వెళ్లితే, రెండు వేరియంట్లు ప్రీమియం లుక్‌ ను అందిస్తాయి. కొత్త డ్యాష్‌ బోర్డ్ డిజైన్, గ్రే బ్లాక్ కలర్ థీమ్, కొత్త సీట్లు, పియానో బ్లాక్ ఫినిషింగ్‌ తో కూడిన సెంటర్ కన్సోల్ ఆకట్టుకుంటాయి. అలాగే టూ స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ ఆర్మ్‌ రెస్ట్, రియర్ AC వెంట్స్ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్ల గురించి..

Advertisement

క్రియేటివ్ వేరియంట్‌లో 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, కూల్డ్ గ్లోవ్‌ బాక్స్, 4 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. క్రియేటివ్ ప్లస్ వేరియంట్‌ లో వీటికి అదనంగా కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌ లెస్ ఛార్జర్, డ్యూయల్ ఫోన్ డాక్, వెనుక ప్రయాణికుల కోసం 65W USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ లాంటి ఫీచర్లు లభిస్తాయి. ఇక  భద్రత విషయంలో రెండు వేరియంట్లూ దాదాపు సమానంగానే ఉన్నాయి. ఆరు ఎయిర్‌ బ్యాగులు, ABS, EBD, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు లాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్ గురించి..

ఇంజిన్ విషయానికి వస్తే, రెండు వేరియంట్లలోనూ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది. ఇది 86 PS పవర్, 113 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. CNG ఆప్షన్ మాత్రం క్రియేటివ్ వేరియంట్‌ లో మాత్రమే లభించడం ప్రత్యేకత.

ధర గురించి..

టియాగో క్రియేటివ్ ధర రూ.7 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. క్రియేటివ్ ప్లస్ వేరియంట్ ధర సుమారు రూ.30,000 ఎక్కువగా ఉంటుంది.

Read Also: హ్యుందాయ్ నుంచి క్రేజీ ప్లాన్.. క్రెటా హైబ్రిడ్ సహా కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Related News

కొనుగోలుదారులకు ఎంజీ షాక్.. కామెట్ ఈవీ ధరల పెంపు!

బడ్జెట్‌ లో బెస్ట్ రేంజ్.. రూ.15 లక్షల లోపు టాప్ ఈవీ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 200 కిమీ రేంజ్.. భారత్‌ లో బెస్ట్ EV స్కూటర్లు ఇవే!

2026 బ్రెజ్జా Vs హ్యుందాయ్ వెన్యూ.. ఏ SUV కొనడం బెస్ట్?

రైళ్ల భద్రతకు డిజిటల్ టెక్నాలజీ.. మూడు కొత్త యాప్‌లను ప్రారంభించిన ఇండియన్ రైల్వే!

ఒక్కొక్కటి కాదు.. ఒకేసారి 10 కొత్త మోడల్స్.. హోండా దూకుడు మామూలుగా లేదుగా!

హోండా మాస్టర్ స్ట్రోక్.. భారత్‌ లో తొలి E85 మ్యాక్సీ స్కూటర్ లాంచ్!

రూ.1 లక్షలో హీరో కొత్త EV.. మార్కెట్‌ను షేక్ చేయనున్న విడా!

Big Stories

Advertisement
×