E-Paper
Advertisement

ఐఫోన్ లవర్స్‌కు ఊహించని షాక్.. ఈ ఏడాది iPhone 18 లాంచ్ లేనట్టేనా? యాపిల్ అసలు ప్లాన్ లీక్!

ఐఫోన్ లవర్స్‌కు ఊహించని షాక్.. ఈ ఏడాది iPhone 18 లాంచ్ లేనట్టేనా? యాపిల్ అసలు ప్లాన్ లీక్!
Advertisement

iPhone 18 Delayed: ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్ ప్రియుల కోసం కంపెనీ ప్రతి ఏటా సెప్టెంబర్‌లో కొత్త ఫోన్లను పరిచయం చేయడం ఒక అలవాటు. అయితే ఈసారి 2026లో యాపిల్ తమ సంప్రదాయానికి భిన్నంగా సరికొత్త వ్యూహంతో ముందుకు రాబోతున్నట్లు టెక్ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది రెగ్యులర్ మోడల్ అయిన iPhone 18 విడుదలను కంపెనీ వాయిదా వేసే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. దీనికి బదులుగా మరింత అడ్వాన్స్‌డ్ మోడళ్లపై కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈసారి వచ్చే మోడళ్లు ఇవేనా?

సాధారణ iPhone 18 లాంచ్‌ను కాస్త పక్కన పెట్టి, ఈ సెప్టెంబర్‌లో యాపిల్ కేవలం మూడు ప్రీమియం మోడళ్లను మాత్రమే మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉంది. అందులో iPhone 18 Pro, iPhone 18 Pro Max లతో పాటు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న యాపిల్ తొలి Foldable iPhone కూడా ఉండే ఛాన్స్ ఉంది. డిజైన్ పరంగా, డిస్‌ప్లే కటౌట్ పరంగా ఈ ఫోన్లలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయబోతున్నట్లు సమాచారం.

ప్రో సిరీస్ ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి?

Advertisement

తాజా లీక్స్ ప్రకారం చూస్తే.. ఐఫోన్ 18 ప్రో మోడల్ 6.3 అంగుళాల డిస్‌ప్లేతో, ప్రో మాక్స్ మోడల్ 6.9 అంగుళాల డిస్‌ప్లేతో రానున్నాయి. ఇవి రెండూ అత్యంత నాణ్యమైన ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంటాయి. పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్ కోసం ఇందులో నెక్ట్స్ జనరేషన్ ‘ఏ20 ప్రో’ చిప్‌సెట్‌ను వాడుతున్నారు. దీనికి తోడు 12GB RAM, అలాగే 256GB నుండి 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రో మాక్స్ మోడల్‌లో బ్యాటరీ సైజును స్వల్పంగా తగ్గించవచ్చనే టాక్ నడుస్తోంది.

Also Read: శాంసంగ్ ఫోన్ స్క్రీన్‌పై ఆ చిన్న చుక్క ఎందుకు మెరుస్తుంది? హ్యాకర్ల పనేనా.. అసలు నిజం ఇదీ!

కెమెరా, శాటిలైట్ కనెక్టివిటీ అప్‌డేట్స్:

Advertisement

ఈ కొత్త ఫోన్లలో కెమెరా విభాగంపై యాపిల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ముఖ్యంగా మెయిన్ కెమెరాకు ‘వేరియబుల్ అపెర్చర్ లెన్స్’ టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల కాంతి తీవ్రతను బట్టి కెమెరా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. ఫలితంగా ఫొటోలు మరింత స్పష్టంగా వస్తాయి. అలాగే మొబైల్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా నేరుగా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ వాడుకునేలా సరికొత్త NR-NTN టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక కలర్స్ విషయానికొస్తే.. గతంలో వచ్చిన ఆరెంజ్ కలర్ సక్సెస్ కావడంతో, ఈసారి సరికొత్త డీప్ రెడ్ కలర్‌ను ఆపిల్ పరీక్షిస్తోంది.

యాపిల్ సరికొత్త సేల్స్ స్ట్రాటజీ:

ఏటా ఒకేసారి అన్ని మోడళ్లను విడుదల చేసే పద్ధతిని మార్చడం ద్వారా మార్కెట్లో తమ పట్టును మరింత పెంచుకోవాలని యాపిల్ భావిస్తోంది. విడతల వారీగా ఫోన్లను లాంచ్ చేయడం వల్ల ప్రతి ప్రొడక్ట్‌పై కస్టమర్లలో ఆసక్తి పెరుగుతుందని, ఏడాది పొడవునా అమ్మకాలు నిలకడగా సాగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. అయితే కంపెనీ అధికారికంగా ప్రకటించే వరకు వీటిని కేవలం అంచనాలుగానే భావించాల్సి ఉంటుంది.

Also Read: షాకింగ్ ప్రైస్.. రూ.20 వేల లోపే OnePlus కొత్త ఫోన్.. Nord కంటే తక్కువ ధరకే!

Related News

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. భారత్‌లో OxygenOS శకం ముగిసినట్లేనా?

బెడ్‌టైమ్ స్టోరీస్ కోసం మెటా కొత్త ప్రయత్నం.. ఈ StoryKit యాప్ ఎలా పనిచేస్తుందంటే?

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్.. Vi రూ.479 రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్ ఇవే!

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

ఆన్‌లైన్‌లో మీ డేటా సేఫ్ ఉండాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వండి!

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

Big Stories

Advertisement
×