E-Paper
Advertisement

చిన్న తప్పులు.. పెద్ద నష్టం.. కారు యజమానులు ఈ 5 పొరపాట్లు అస్సలు చేయకండి!

చిన్న తప్పులు.. పెద్ద నష్టం.. కారు యజమానులు ఈ 5 పొరపాట్లు అస్సలు చేయకండి!
Advertisement

Common Car Care Mistakes: దేశంలో కార్ల మెయింటెనెన్స్ ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయి. స్పేర్ పార్ట్స్, ఫ్యూయెల్, సర్వీస్ ఛార్జీలు అన్నీ ఎక్కువ అవుతున్న సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఖర్చుకు దారితీస్తుంది. అయితే, చాలా మంది కొత్త వాహనాకులకు కూడా పాతకాలపు మెయింటెనెన్స్ అలవాట్లనే కొనసాగిస్తున్నారు. ఫలితంగా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. కారు యజమానులు ఎక్కువగా చేసే ఐదు ముఖ్యమైన తప్పులు ఏంటి? వాటిని ఎలా అరికట్టాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ఆయిల్ ఛేంజ్

చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్ ఇంజిన్ ఆయిల్ మార్చడంలో ఆలస్యం చేయడం. ట్రాఫిక్, వేడి, దుమ్ము కారణంగా ఇంజిన్ ఆయిల్ త్వరగా పాడవుతుంది. ముఖ్యంగా చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువగా చేసే కార్లలో ఆయిల్ నాణ్యత వేగంగా తగ్గుతుంది. సమయానికి ఆయిల్ మార్చకపోతే ఇంజిన్‌ లో ఘర్షణ పెరిగి, భాగాలు త్వరగా అరిగిపోతాయి. టర్బో పెట్రోల్, డీజిల్ కార్లలో ఇది మరింత ప్రమాదకరం. పాత ఆయిల్ వల్ల బురదలాంటి మలినాలు ఏర్పడి ఇంజిన్ పని తీరు దెబ్బతింటుంది.

⦿ టైర్ ప్రెషర్‌

Advertisement

చాలా మంది చేసే మరో మిస్టేక్ టైర్ ప్రెషర్‌ను పట్టించుకోకపోవడం. కారు యజమానులు లాంగ్ జర్నీకి ముందు మాత్రమే టైర్లను చెక్ చేస్తారు. కానీ, నెలకు కనీసం ఒకసారి గాలి ఉందా? లేదా? అని చెక్ చేయాలి. గాలి తక్కువగా ఉంటే ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. టైర్లు త్వరగా అరిగిపోతాయి. గాలి ఎక్కువగా ఉంటే రోడ్డు మీద గ్రిప్ తగ్గుతుంది. అలాగే టైర్ రొటేషన్ చేయకపోతే ముందు టైర్లు వేగంగా పాడవుతాయి.

⦿ బ్రేక్‌ల నిర్లక్ష్యం

మూడో పెద్ద తప్పు బ్రేక్‌లను నిర్లక్ష్యం చేయడం. బ్రేక్ ప్యాడ్లు నెమ్మదిగా అరిగిపోతాయి. చాలామందికి సమస్య పెద్దదయ్యే వరకు తెలియదు. ప్యాడ్లు పూర్తిగా అరిగిపోతే బ్రేక్ డిస్క్ కూడా దెబ్బతింటుంది. మరింత ఖర్చు అవుతుంది. అలాగే బ్రేక్ ఫ్లూయిడ్ కూడా సమయానికి మార్చాలి. పాతబడితే బ్రేకింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో మరింత త్వరగా ప్రభావం చూపుతుంది.

⦿ బ్యాటరీ హెల్త్

Advertisement

చాలా మంది బ్యాటరీ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. అధిక ఉష్ణోగ్రతలు, చిన్న ప్రయాణాలు, ట్రాఫిక్ కారణంగా బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. బ్యాటరీ బలహీనపడితే కారు స్టార్ట్ అవ్వడం ఆలస్యం అవుతుంది. కొన్ని ఎలక్ట్రికల్ సమస్యలు కూడా వస్తాయి. చాలామంది బ్యాటరీ పూర్తిగా పాడైన తర్వాత మాత్రమే మార్చిస్తారు. కానీ, సర్వీసింగ్ సమయంలో వోల్టేజ్ చెక్ చేయడం చాలా అవసరం.

⦿ ఎయిర్ ఫిల్టర్, క్యాబిన్ ఫిల్టర్

ఎయిర్ ఫిల్టర్, క్యాబిన్ ఫిల్టర్ మార్చకపోవడం కూడా పెద్ద సమస్యలకు కారణం అవుతాయి. దుమ్ము ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇవి త్వరగా మూసుకుపోతాయి. ఇంజిన్‌ కు సరైన గాలి అందకపోతే మైలేజ్ తగ్గుతుంది. క్యాబిన్ ఫిల్టర్ పాడైతే ఏసీ గాలి సరిగా రాదు. బ్లోవర్‌ పై అదనపు ఒత్తిడి పడుతుంది. అందుకే, వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×