E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్‌కు గంటసేపు సెలవు ఇస్తే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!

స్మార్ట్‌ఫోన్‌కు గంటసేపు సెలవు ఇస్తే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
Advertisement

One hour Digital Detox: డిజిటల్ విప్లవం పుణ్యమా అని ప్రస్తుతం మన జీవితాలు స్మార్ట్‌ఫోన్‌లు,ల్యాప్‌ టాప్‌లతో ముడిపడిపోయాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక స్క్రీన్ చూస్తూనే ఉంటున్నాం.దీని వల్ల మానసిక ఒత్తిడి, కంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ’60 నిమిషాల డిజిటల్ డిటాక్స్’ ఒక అద్భుతమైన పరిష్కారంగా మారుతోంది. రోజులో కేవలం ఒక గంట పాటు గ్యాడ్జెట్లకు దూరంగా ఉండటం వల్ల మన మెదడుకు కలిగే ప్రశాంతత, శారీరక మార్పులు ఊహించని విధంగా ఉంటాయి. ఆ 60 నిమిషాల ప్రయాణం మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

60 నిమిషాల డిజిటల్ డిటాక్స్- అద్భుతమైన ప్రయోజనాలు:

Advertisement

నేటి కాలంలో ‘డిజిటల్ డిటాక్స్’ అనేది ఒక విలాసం కాదు. అది ఒక అవసరం. కేవలం 60 నిమిషాల పాటు ఇంటర్నెట్ , ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

1. మానసిక ప్రశాంతత , ఒత్తిడి తగ్గింపు:
మనం ఫోన్ చూస్తున్నప్పుడు సోషల్ మీడియా నోటిఫికేషన్లు, వార్తలు మన మెదడుపై నిరంతరం ఒత్తిడిని కలిగిస్తాయి. గంట సేపు వీటికి దూరంగా ఉన్నప్పుడు, మెదడులోని ‘కార్టిసాల్’ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలు తగ్గుతాయి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచి, ఆందోళనను తగ్గిస్తుంది.

Advertisement

2. ఏకాగ్రత పెరుగుదల:
నిరంతరం ఫోన్ చెక్ చేయడం వల్ల మన ఏకాగ్రత దెబ్బతింటుంది. దీనినే ‘డిజిటల్ డిస్ట్రాక్షన్’ అంటారు. రోజులో ఒక గంట పాటు డిజిటల్ పరికరాలను పక్కన పెడితే.. మెదడు తన ఆలోచనా శక్తిని తిరిగి పుంజుకుంటుంది. దీనివల్ల మీరు చేసే పనుల్లో.. నాణ్యత పెరుగుతుంది. అంతే కాకుండా సృజనాత్మకత మెరుగుపడుతుంది.

3. కంటి ఆరోగ్యానికి మేలు:
స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ కంటిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గంట సేపు స్క్రీన్ చూడకపోవడం వల్ల కంటి కండరాలు విశ్రాంతి పొందుతాయి. ఇది తలనొప్పి, కళ్లు పొడిబారడం వంటి సమస్యలను నివారిస్తుంది.

4. మెరుగైన నిద్ర :
చాలా మంది పడుకునే ముందు ఫోన్ వాడుతుంటారు. దీని వల్ల నిద్రకు కారణమయ్యే ‘మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది. రాత్రి పడుకోవడానికి గంట ముందు డిజిటల్ డిటాక్స్ పాటిస్తే.. మీకు గాఢ నిద్ర పడుతుంది. ఉదయాన్నే ఎంతో ఉత్సాహంగా నిద్రలేస్తారు.

5. నిజమైన సామాజిక సంబంధాలు:
ఫోన్ లో చాటింగ్ చేయడం కంటే.. పక్కన ఉన్న వారితో గంట సేపు మాట్లాడటం వల్ల బంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతో గడపడం లేదా ప్రకృతిలో నడవడం వల్ల మీకు తెలియని ఒక కొత్త శక్తి లభిస్తుంది.

ఈ 60 నిమిషాల్లో ఏం చేయాలి?
డిజిటల్ డిటాక్స్ సమయంలో బోర్ కొట్టకుండా ఉండటానికి ఈ కింది పనులు చేయవచ్చు.

పుస్తక పఠనం: మీకు నచ్చిన కథల పుస్తకం లేదా నవల చదవండి.

మెడిటేషన్: 15-20 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మనసు అదుపులోకి వస్తుంది.

జర్నలింగ్: మీ ఆలోచనలను ఒక డైరీలో రాయండి.

నడక: గాడ్జెట్లు లేకుండా ఆరుబయట ప్రకృతిలో కాసేపు నడవండి.

హాబీలు: పెయింటింగ్, వంట చేయడం లేదా మొక్కలకు నీళ్లు పోయడం వంటివి చేయండి.

Related News

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×