E-Paper
Advertisement

Best 5 Bikes: ప్రతి నెలా లక్షల మంది కొనుగోలు చేస్తున్న టాప్ 5 బైకులు ఇవే

Best 5 Bikes: ప్రతి నెలా లక్షల మంది కొనుగోలు చేస్తున్న టాప్ 5 బైకులు ఇవే
Advertisement

మనదేశంలో రోజువారీ ప్రయాణాలకు బైకులే ముఖ్యమైనవి. ట్రాఫిక్ సమస్యలు తప్పించుకోవాలంటే బైకుల మీదే వెళ్లాలి. కార్లు ఉన్నవారు కూడా వాటిని పక్కన పెట్టి మరి బైకులు వాడుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులనే ఇప్పుడు ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు.. బైకులు పైనే ఆధారపడుతున్నారు. ప్రతి నెలా లక్షలాది బైకులు మనదేశంలో అమ్మడవుతున్నాయి. అయితే తాజాగా బైకుల అమ్మకాల గణాంకాలు విడుదలయ్యాయి. భారత మార్కెట్లో ఏ బైకులు ఎక్కువగా అమ్ముడవుతున్నాయో బయటపడింది. తక్కువ ధర, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఉన్న కారణంగా ఐదు బైకులకు విపరీతంగా డిమాండ్ ఉంది.

హీరో స్ప్లెండర్
మనదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైకులలో హీరో స్ప్లెండర్ మొదటి స్థానంలో ఉంది. ఇది ఎన్నో ఏళ్లుగా మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ గా కొనసాగుతూనే ఉంది. గత నెలలో దాదాపు 2.8 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే ఏ స్థాయిలో ప్రజలకు ఈ బైక్ నచ్చిందో తెలుసుకోండి. దీని ధర 72,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. మంచి మైలేజ్ ఇవ్వడంతో, మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఈ బైక్ కు ఆదరణ అధికంగానే ఉంది.

Advertisement

హోండా షైన్
హీరో స్ప్లెండర్ బైక్ తర్వాత హోండ షైన్ కొనే వారి సంఖ్య అధికంగా ఉంది. గత నెలలో సుమారు 1.4 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. హోండా షైన్ బైక్ మైలేజ్ బాగుంటుంది. అలాగే ఇంజిన్ కూడా నమ్మకంగా పనిచేస్తుంది. దీని ధర 65 వేల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. రోజు ఆఫీసుకి వెళ్లే ఉద్యోగులు ఎక్కువగా ఈ బైకును కొనేందుకు ఇష్టపడుతున్నారు.

బజాజ్ పల్సర్
ఇక మూడో స్థానంలో నిలుస్తుంది బజాజ్ పల్సర్. యువతలో ఎక్కువ క్రేజ్ ఉన్న బైక్ ఇది. దీని లుక్, మంచి స్పీడ్, స్టైల్ గా యూత్ కు నచ్చుతుంది. అందుకే పల్సర్ కు అభిమానులు ఎక్కువ. గత నెలలో 79 వేల యూనిట్ల వరకు పల్సర్ బైకులు అమ్ముడయ్యాయి. దీనిలో అనేక వేరియంట్లు కూడా ఉన్నాయి. ఇక దీని ధర 90 వేల రూపాయల నుంచి మొదలై రెండు లక్షల రూపాయలు వరకు సాగుతుంది. కాలేజీ విద్యార్థులు యువకులే ఎక్కువగా ఈ బైకును కొంటున్నారు.

Advertisement

హీరో HF డీలక్స్
ఇక నాలుగో స్థానంలో నిలిచింది హీరో సంస్థకు చెందిన HF డీలక్స్ బండి. ఇది తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది. కానీ మంచి మైలేజ్ ఇస్తుంది. గత నెలలో 49 వేల యూనిట్లు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. ఇక ఈ బైక్ ధర కేవలం 60 వేల రూపాయల్లోనే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో జీవించేవారు ఎక్కువగా ఈ బైకును కొంటున్నారు. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటే ఈ బైక్ ను వాడవచ్చు.

ఇక టీవీఎస్ అపాచీ
ఇక ఐదో స్థానంలో నిలుస్తుంది టీవీఎస్ అపాచీ బైక్. ఈ బైక్ అంటే యువతలో మంచి క్రేజ్ ఉంది. గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అపాచీ బైకులు స్టైలిష్ లుక్ తో ఉంటాయి. ఇంజిన్ పవర్ కూడా ఎక్కువ. దీని ధర ఒక 1.2 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని మోడల్స్ స్పోర్ట్స్ బైక్ లాగా ఉంటుంది. అందుకే ఎక్కువగా యువకులు కొనేందుకు ఇష్టపడతారు.

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×