E-Paper
Advertisement

PSL 2026 : పాకిస్తాన్ ఇచ్చే డ‌బ్బులు డైప‌ర్ల‌కు కూడా స‌రిపోవు.. PSL నుంచి త‌ప్పుకున్న‌ విదేశీ ప్లేయ‌ర్లు

PSL 2026 : పాకిస్తాన్ ఇచ్చే డ‌బ్బులు డైప‌ర్ల‌కు కూడా స‌రిపోవు.. PSL నుంచి త‌ప్పుకున్న‌ విదేశీ ప్లేయ‌ర్లు
Advertisement

PSL 2026 :  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ మెగా టోర్నమెంటులో విదేశీ ప్లేయర్లు ( No overseas players ) ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదట. ముగ్గురు కీలక ప్లేయర్లు ఈ టోర్నమెంట్ ఆడతారని మొదటి నుంచి ప్రచారం చేసింది పాకిస్తాన్. అయితే, ఆ ముగ్గురు తోపు ప్లేయర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆక్షన్ కోసం దరఖాస్తు చేసుకోలేదట. ఇందులో మ్యాక్సీ మామ ( Glenn Maxwell), హ్యారీ బ్రూక్ ( Harry Brook ), ఫ్లాప్ డూప్లిసిస్ ( Faf du Plessis) ఉన్నట్లు తెలుస్తోంది. మొదట ఈ టోర్నమెంట్ ఆడతామని చెప్పిన ఈ ముగ్గురు క్రికెటర్లు, ఇప్పుడు మనసు మార్చుకున్నారట. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్టు చెబుతున్నారు.

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

PSL 2026 టోర్నమెంట్ నుంచి ముగ్గురు క్రికెటర్లు ఔట్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి మ్యాక్సీ మామ, హ్యారీ బ్రూక్, ఫ్లాప్ డూప్లిసిస్ దూరమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు ఫ్లాప్ డూప్లిసిస్. కానీ తాజాగా విత్ డ్రా చేసుకున్నట్లు వెల్లడించాడట‌. అటు మ్యాక్సీ మామకు కోటిన్నర ఇచ్చేందుకు ఓ జట్టు ముందుకు వచ్చిందట. ముందుగా ఓకే చెప్పిన మ్యాక్సీ మామ, ఇప్పుడు ప్లేట్ మార్చాడు అంటున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో ఆడబోనని, దరఖాస్తు కూడా చేసుకోలేదట. ఇక హ్యారీ బ్రూక్ ఈ టోర్నమెంట్ లో ఆడేందుకు ససేమిరా అంటున్నారట.

అయితే ఈ ముగ్గురు విదేశీ క్రికెటర్లతో పాటు మరి కొంత మంది కూడా ఈ టోర్నమెంట్ కు దూరమయ్యేందుకు సిద్ధమయ్యారట. పాకిస్తాన్ లో ఆడితే, ఒక్క‌ రూపాయి కూడా రాదని.. ముఖం మీదే చెప్పేస్తున్నారట. అయితే ఈ విదేశీ క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో ఆడకపోతే, వ్యూయ‌ర్‌ షిప్ భారీగా తగ్గనుంది. దానివల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది. ఏ టోర్నమెంట్ లోనైనా తోపు క్రికెటర్లు ఉంటేనే జనాలు చూస్తారు. అలాంటిది మాక్సీ మామ లాంటి డేంజర్ ఆటగాళ్లు దూరమైతే.. ఆ టోర్నమెంట్ కు కల అస్సలు ఉండదు. విదేశీ అభిమానులు ఈ టోర్నమెంట్ చూసేందుకు ఆసక్తి చూపించబోరు. ఐపీఎల్ తరహాలో వ్యాల్యూ రాదు. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు టెన్ష‌న్ మొద‌లైంది.  ఇది ఇలా ఉండ‌గా, PSL లో వ‌చ్చే డ‌బ్బులు డైప‌ర్ల‌కు కూడా స‌రిపోవనే ఒక్క కార‌ణంతో..ఈ టోర్నీ నుంచి విదేశీ ప్లేయ‌ర్లు త‌ప్పుకున్న‌ట్లు ఇండియ‌న్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

 

Related News

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

Big Stories

Advertisement
×