E-Paper
Advertisement

Mahindra Cars: మార్కెట్ లో అట్టర్ ఫ్లాప్ అయిన మహీంద్రా కార్లు ఇవే, ఎందుకో తెలుసా?

Mahindra Cars: మార్కెట్ లో అట్టర్ ఫ్లాప్ అయిన మహీంద్రా కార్లు ఇవే, ఎందుకో తెలుసా?
Advertisement

మహీంద్రా ఆటో మోబైల్ కంపెనీ ఇప్పుడు దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆటోమేకర్లలో ఒకటిగా కొనసాగుతోంది. కానీ, తన ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఈ కంపెనీ తయారు చేసిన కొన్ని కార్లను కొనుగోలుదారులు కనీసం పట్టించుకోలేదు. ఇంతకీ దేశీయంగా వినియోగదారులు రిజెక్ట్ చేసిన మహీంద్రా కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ వాయేజర్

మహీంద్రా నుంచి విడుదలైన ఒకే ఒక్క వ్యాన్ ఇది. మిత్సుబిషి మోటార్స్‌ తో కలిసి తయారు చేసింది. ఈ 9-సీట్ల వ్యాన్ 70 bhpని ఉత్పత్తి చేసే 2.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ తో వచ్చింది. అదే సమయంలో మార్కెట్ లోకి ఓమ్ని వచ్చింది. ఆ వ్యాన్ మంచి హిట్ కొట్టింది. కానీ, వాయేజర్ పెద్దది, మరింత విశాలమైనది, సౌకర్యవంతమైనది అయినా, అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ కారున ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ 2000లో భారత్ కు వచ్చినప్పుడు తన రవాణా వాహనంగా ఉపయోగించారు.  ఆ రోజుల్లోనే ఈ వ్యాన్ ధర దాదాపు రూ. 5-6 లక్షలు ఉండేది. ఎక్కువ ధర కారణంగా ఈ వ్యాన్ ను పెద్దగా సక్సెస్ కాలేదు.

⦿ వెరిటో వైబ్

Advertisement

ఈ ఆధునిక హ్యాచ్‌ బ్యాక్‌ కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. వైబ్ తో, మహీంద్రా వెరిటో సెడాన్ ను హ్యాచ్ బ్యాక్ గా మార్చింది. టయోటా కూడా ఎటియోస్ లివా తో సెడాన్ ను హ్యాచ్ బ్యాక్ గా మర్చి బాగా సక్సెస్ అయ్యింది. కానీ, వైబ్ పూర్తిగా విఫలమైంది. వైబ్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చింది. హ్యుందాయ్, మారుతి నుంచి మంచి ఫ్యుయెల్ ఎఫిషియెన్సీ కార్లు రావడంతో ఈ కారు ఫెయిల్ అయ్యింది. అంతేకాదు, ఈ కారు ధర కూడా రూ. 7-8 లక్షలు ఉండటంతో ఎక్కువ మంది కొనలేదు. పేలవమైన అమ్మకాల కారణంగా మహీంద్రా 2019లో వెరిటో వైబ్ ను నిలిపివేసింది.

⦿ క్వాంటో , నువో స్పోర్ట్

ఈ 7 సీటర్, సబ్-4m కారు  జైలో షార్ట్ వెర్షన్. ఈ కారు లుక్ అంతగా బాగా లేదు. అదే సమయంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వచ్చింది. ఆ కారు ముందు ఈ కారు తట్టుకోలేకపోయింది. మహీంద్రా నువో స్పోర్ట్‌ తో మళ్లీ ప్రయత్నించింది. కానీ, ఆ కారు కూడా సత్తా చాటలేకపోయింది.

⦿ మహీంద్రా అల్టురాస్ G4

Advertisement

అల్టురాస్ G4 అత్యుత్తమ మహీంద్రా ఉత్పత్తులలో ఒకటి. ఇది ప్రీమియం SUV. స్కార్పియో, బొలెరో, XUV500 లాంటి ఇతర SUVల కంటే బాగుంటుంది. చూడ్డానికి కూడా బాగుంది. లోపలి భాగం 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పనోరమిక్ సన్‌ రూఫ్, 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా సహా పలు ఫీచర్లు ఉన్నాయి.  కానీ, దాని పోటీదారులైన ఫార్చ్యూనర్, ఎండీవర్ లాంటి కార్ల ముందు తట్టుకోలేకపోయింది.

⦿ మరాజ్జో

ప్రస్తుతం ఈ కారు అమ్మకాలు కొనసాగుతున్నాయి. మహీంద్రా దీనిని ప్రారంభించినప్పుడు ధర దాదాపు రూ. 12-15 లక్షలు. మారుతి ఎర్టిగా కంటే ఖరీదైనది. కానీ, మీరు రెండు మూడు లక్షలు ఎక్కువ పెడితే, ఇన్నోవా క్రిస్టాను వస్తుంది. అందుకే, ఈ కారు కొనుగోలుకు ఎక్కువగా వినియోగదారులు ఆసక్తి చూపించలేదు.

Read Also: టాటా లవర్స్ కు పండుగే, లాంచ్ కు ముందే పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ ఆవిష్కరణ!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×