Actro Sudharshan : టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్లకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే.. ఒకప్పుడు చిన్న సినిమాలలో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరించిన కమెడియన్లు ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు.. అలాంటి కమెడీయన్లలో సుదర్శన్ ఒకడు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో అన్న విషయం గురించి బయటపెట్టాడు. ఇంతకీ అతను ఏం చెప్పాడో ఒకసారి తెలుసుకుందాం..
నటుడు సుదర్శన్ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ బాగా ఫెమస్ అయ్యాడు. చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం తో సినిమాల్లో నటుడుగా ప్రయత్నాలు చేశాడు. తెలుగులో తన తొలి చిత్రం.. శర్వానంద్ హీరోగా సుజీత్ రూపొందించిన రన్ రాజా రన్. అందులో తనది చాలా చిన్న పాత్రే.. ఈయన సినిమాల్లోకి రాకముందు తన తండ్రి చేసే బిజినెస్ లో వ్యాపారాల్లో కొద్దిరోజులు కొనసాగినట్లు చెప్పారు. అంతేకాదు మీసేవ కూడా అప్పుడు చేసినట్లు సుదర్శన్ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. ఇవే కాక పలు వ్యాపారాలు కూడా చేసినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. వాటితో పాటుగా యూట్యూబ్లో చేసిన షార్ట్ ఫిలిమ్స్ తన కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా మారాయని ఆయన అంటున్నాడు. మొత్తానికి రన్ రాజా రన్ చిత్రంతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు..
Also Read :వెంకీ-త్రివిక్రమ్ కాంబోపై పెరుగుతున్న హైప్..రిలీజ్ ఎప్పుడంటే..?
హీరో శర్వానంద్ హీరోగా సుజీత్ రూపొందించిన రన్ రాజా రన్ మూవీలో చిన్న పాత్రలో కనిపించాడు. ఈ మూవీలో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి.. అయితే ఈ సినిమాకు రెమ్యూనికేషన్ ఎంత ఉంటుందో అని మొదట అనుకున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పాడు.. ఫస్ట్ సినిమా కదా ఇవ్వకపోయినా పర్వాలేదు స్క్రీన్ మీద కనిపించాను అని అతను అనుకున్నాడట.. అయితే ఆ తర్వాత ఏ సినిమాకి కూడా రెమ్యూనిరేషన్ ఇవ్వరేమో అని కంగారు పడిపోయి టీం తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక కవర్ ఇచ్చినట్లు చెప్పారు. అందులో ఏ 1000, 2000 ఉంటుందని అనుకున్నాడట. కానీ దాన్ని తీసి చూస్తే 3500 ఉండడంతో చాలా సంతోషంగా ఫీల్ అయినట్లు సుదర్శన్ తెలిపారు. ఆ డబ్బులు గుడిలో హుండీలో వేద్దామా.. ఇంకేమైనా మంచి పని చేద్దామా అని ఆలోచించి.. చివరికి ఫ్రెండ్స్‌తో కలిసి ఖర్చు పెట్టేసినట్లు సుదర్శన్ తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో బాగా టెండ్ అవుతుంది. ఇక ఈయన రీసెంట్ గా చేసిన సినిమాలు విషయానికొస్తే నారి నారి నడుమ మురారి లో నటించారు. ఈ మూవీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో అతనికి మంచి క్రేజ్ వచ్చింది.. ప్రస్తుతం అతని చేతిలో రెండు మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం..