E-Paper
Advertisement

Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఎన్ని కిమీల తిరిగిన కారు బెటర్?

Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఎన్ని కిమీల తిరిగిన కారు బెటర్?
Advertisement

Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా? అయితే ఓసారి ఆ కారు ఎన్ని కిలోమీటర్లు నడిచిందో చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. కిలోమీటర్లు కేవలం సంఖ్య మాత్రమే కాదు.. ఆ కారును ఎంత కాలం ఉపయోగించారు? దాని ఇంజిన్‌ పరిస్థితి ఎలా ఉంది.. వంటి వివరాలు ఇట్టే తెలిసిపోతుంది. అలాగే చాలామంది బడ్జెట్‌ను బట్టి కారును ఎంచుకుంటారు. కానీ బడ్జెట్ కంటే.. మంచి కిలోమీటర్ల రేంజ్‌ ఉన్న కారును ఎంచుకోవడం ఉత్తమం. దీని వల్ల భవిష్యత్తులో ఖర్చులు, రిపేర్ల గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.

అలాగే సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకున్నప్పుడు అందరూ ముందుగా చూసేది ఏమిటంటే.. ఆ కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? ఎన్ని కిలోమీటర్లు తిరిగితే బెస్ట్ కారు? ఎన్ని కిలో మీటర్లు తిరిగితే ఇక పనిచేయదు వంటి అంశాలనే ఎక్కువ గమనిస్తారు. అయితే, ఒక కారు ఎన్ని కిలో మీటర్లు తిరిగితే బెటర్ అనే దాన్ని ఆ కారు తయారైన సంవ్సతరాన్ని బట్టి చెప్పవచ్చు. ఈ వివరాలేంటో ఇప్పుడు  తెలుసుకుందాం.

2021 – 2025 మోడల్ కారు అయితే:

Advertisement

ఒకవేళ మీరు కొనాలనుకుంటున్న సెకండ్ హ్యాండ్ కారు 2021 – 2025 మోడల్అ యితే.. ఆ కారు 10 వేల కి.మీ నుంచి 50 వేల కి.మీ. మధ్య తిరిగి ఉంటే.. ఇంకేం ఆలోచించకుండా కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ ఆ కారు 50 వేల – 80 వేల కి.మీ. తిరిగితే.. ఆ కారును తీసుకోవడానికి కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. అలా కాకుండా.. ఆ కారు లక్ష కి.మీ. కంటే ఎక్కువ తిరిగి ఉంటే మాత్రం.. ఆ కారును అస్సలు కొనకపోవడమే ఉత్తమం.

2018 – 2020 మోడల్ కారు అయితే:

మీరు కొనాలనుకుంటున్న సెకండ్ హ్యాండ్ కారు 2018 – 2020 మోడల్ కారు అయితే.. ఆ కారు 30 వేల కి.మీ – 80 వేల కి. మీ. మధ్య తిరిగి ఉంటే.. నిర్మొహమాటంగా కొనేసుకోవచ్చు. ఒకవేళ ఆ కారు 80 వేల నుంచి లక్ష 20వేల కి.మీ. తిరిగితే.. ఆ కారును ఆచితూచి కొనాల్సి ఉంటుంది. అలాకాకుండా.. ఆ కారు లక్ష 50వేల కి.మీ. కంటే ఎక్కువ తిరిగి ఉంటే మాత్రం..  అలాంటి కారును పక్కన పెట్టేయండి.

2014 – 2017 మోడల్ కారు అయితే:

Advertisement

ఒక వేళ మీరు తీసుకొబోయే సెకండ్ హ్యాండ్ కారు 2014 – 2017 మోడల్ కారు అయితే.. ఆ కారు 50 వేల కిలో మీటర్ల నుంచి లక్షా 20 వేల కిలో మీటర్ల మధ్య తిరిగి ఉంటే.. అసలేం ఆలోచించకుండా కొనేయొచ్చు. ఒక వేళ ఆ కారు లక్షా 20 వేల నుంచి లక్ష 80వేల కిలో మీటర్లు తిరిగితే.. ఆ కారును తీసుకోవడానికి కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. అలా కాకుండా, ఆ కారు రెండు లక్షల కిలో మీటర్ల కంటే ఎక్కువ తిరిగి ఉంటే మాత్రం.. ఏం ఆలోచించకుండా ఆ కారును పక్కన పెట్టడం బెటర్.

2010 – 2013 మోడల్ కారు అయితే:

ఇక 2014 – 2017 లో తయారు చేసిన కారు అయితే.. అది 80 వేల కి. మీ. నుంచి లక్షా 50 వేల కి.మీ. మధ్య తిరిగి ఉంటే.. సులభంగా కొనులోగు చేయవచ్చు. ఒకవేళ ఆ కారు లక్ష 80వేల కి.మీ. తిరిగితే.. ఆ కారును కొనులోగు చేయాలంటే కాస్త ఆలోచించాల్సిందే. అలా కాకుండా.. ఆ కారు రెండు లక్షల 50 వేల కి.మీ. కంటే ఎక్కువ తిరిగి ఉంటే మాత్రం.. అలాంటి కారును కొంటే రిపేర్ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

పెట్రోల్/ డీజిల్:

ఇప్పటి వరకు కారు కిలో మీటర్ల గురించి తెలుసుకున్నాం.. ఇప్పుడు కార్లలోని ఇంజన్ రకం గురించి తెలుసుకుందాం. డీజిల్ కారు ఎన్ని కిలో మీటర్లు తిరుగుతుంది. పెట్రోల్ కారు ఎన్ని కిలో మీటర్లు తిరుగుతుంది.. వాటి జీవిత కాలం ఎంత ఉండవచ్చు వంటి వివరాల్లోకి వెళితే..

పెట్రోల్ కారు.. జీవిత కాలంలో కనిష్టంగా 1.80 లక్షల కి. మీ.. గరిష్టంగా 2.50 లక్షల కి. మీటర్లు తిరగవచ్చు. ఒకవేళ అంతకు మించి దాటితే.. ఆ కారు ఇంజిన్‌కు తరుచుగా రిపేర్లే వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఇకపోతే.. డీజిల్ కారు జీవిత కాలంలో కనిష్టంగా 3 లక్షల కి.మీ.. గరిష్టంగా 5 లక్షల కి. మీటర్లు తిరగవచ్చు. ఈ విషయంలో స్విఫ్ట్, ఇన్నోవా, ఫార్చ్యూనర్, ఎండీవర్ లాంటి కార్లను పరిశీలించవచ్చు. అయితే  టర్బో, ఇంజెక్టర్లను ఒకసారి చూసుకోవాలి.

ఇక టయోటా ఇన్నోవా, టయోటా ఇన్నోవా క్రిస్టా , ఫార్చ్యూనర్, మారుతీ స్విఫ్ట్, మారుతీ డిజైర్, మారుతీలో పెట్రోల్, డీజిల్ కార్లు అయినా.. బాగానే లైఫ్ ఇస్తుంది. అలాగే హోండా సిటీ i-VTEC పెట్రోల్ వేరియెంట్, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ క్రెటా Venue కార్లు కూడా మంచి ఫర్ఫామెన్స్ ఇస్తాయి. వీటితో పాటు మహీంద్రా స్కార్పియో, మహీంద్రా XUV500 కూడా ఎక్కువ రిలయబుల్‌ను ఇస్తాయి. i20, Baleno, Polo, Figo, Jazz, EcoSport లాంటి కార్లు 1.5 లక్షలు దాటితే తరుచూగా రిపేర్లు వచ్చే అవకాశం ఉంది.

ఒడో మీటర్ ట్యాంపరింగ్..

సాధారణంగా సెకండ్ హ్యాండ్ కార్లు అని చెప్పగానే.. కిలో మీటర్లను తగ్గించి చూపిస్తారని, ఫేక్ కిలో మీటర్లు ఉంటాయనే ఊహగనాలు ఉంటాయి. దీన్ని ఒడో మీటర్ ట్యాంపరింగ్ అంటారు. సెకెండ్ హ్యాండ్ కారు కొనేముందు వీటిరి గుర్తు పట్టాలంటే.. కారు స్టీరింగ్, గేర్లు నాబ్, సీట్లు చాలా వాడినట్టు కారులో కనిపిస్తే.. అదే టైంలో అక్కడ ఒడో మీటర్ 40 వేల కి. మీటర్ల చూపిస్తే.. ట్యాంపరింగ్ జరిగిందని అర్థం.

అలాగే బ్రేక్, క్లచ్, యాక్సిలరేటర్ పైన ఉండే రబ్బర్ పూర్తిగా అరిగిపోయి ఉంటే.. ఆ కారు కనీసం 1.50 వేల కి. మీటర్లు తిరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే.. ఆ కారు టైర్లు మార్చకుండా.. ఒరిజినల్‌వి అయితే.. అది 50 వేల కి. మీటర్ల వరకు తిరిగి ఉండవచ్చు. ఒకవేళ ఆ కారు టైర్లు మార్చారంటే.. అది 50 వేల కి.మీటర్లు దాటిందని భావించాలి.

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×