Bandla Ganesh : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ మధ్య సినిమాలను తగ్గించారు. ఒకప్పుడు వరుసగా సినిమాలను నిర్మించేవాడు. కానీ ఈ మధ్య ఆయన బ్యానర్ లో ఒక్క సినిమా రిలీజ్ అవ్వలేదు. కానీ ఆయన ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంటాడు.. ఇండస్ట్రీలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. అలాగే దేవుడి భక్తి విషయంలోనూ అంతే శ్రద్ధ చూపిస్తారు.. తాజాగా ఈయన ఇంట్లో జరిగిన ఒక శుభకార్యం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాస కళ్యాణంను చాలా గ్రాండ్ గా నిర్వహించారు.. ప్రస్తుతం ఆ కల్యాణ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిర్మాత బండ్ల గణేష్ తాజాగా శ్రీనివాస కళ్యాణం చేయించారు. వేడుక మొత్తాన్ని పెళ్లిలాగే అందంగా ప్లాన్ చేశారు. వేదిక మొత్తం అరటి ఆకులు, పసుపు ఆకుపచ్చ రంగు రిబ్బన్లతో అలంకరించడం చాలా ఫ్రెష్ గా ఉంది.. ఈ కళ్యాణం జరిపించేందుకు బండ్లన్న పట్టు వస్త్రాలను ధరించారు. పసుపు పట్టు కండువా ధరించి, తలపై కలశం పట్టుకుని నడుచుకుంటూ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన భార్య కూడా పట్టు చీరను కట్టుకొని కనిపించారు. అలాగే ఆయన కుమారులు కూడా పంచెకట్టులో అతిథులను ఆహ్వానించారు.. దేవుడి విగ్రహాలను పువ్వులతో, ఆభరణాలతో అలంకరించారు. బండ్ల గణేష్, ఆయన భార్య దంపతులుగా కూర్చుని కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ కల్యాణ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
Also Read :ఈ వారం సుమన్ శెట్టి అవుట్.. బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే..!
బండ్లన్న ఇండస్ట్రీలోని అందరితోనూ సన్నిహితంగా ఉంటారు. అందుకే ఆయన ఇంట్లో ఏదైన వేడుక జరిగితే దానికి ఇండస్ట్రీ లోని ప్రముఖులకు ఆహ్వానం వెళ్తుంది. ఈ కళ్యాణ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ దంపతులు, అలాగే మరికొందరు ప్రముఖ నటులు వచ్చి బండ్ల గణేష్ ను అభినందించారు.. బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన ఈ శ్రీనివాస కల్యాణం, సినీ పరిశ్రమకు ఒక పాజిటివ్ వైబ్ ను తీసుకొచ్చింది. దేవుడి ఆశీస్సులు, ఇండస్ట్రీ పెద్దల దీవెనలు ఆయనకు దక్కాయి. ఎప్పుడూ మీడియాలో, సినీ రంగంలో బిజీగా ఉండే బండ్ల గణేష్, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం సమయం కేటాయిస్తాడు.. గతంలో కూడా ఆయన ఇంట్లో ఎన్నోసార్లు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఎప్పుడు ఏం జరిగిన ఈయన ఇండస్ట్రీలోని అందరిని పిలుస్తారు. ఇకపోతే ఇటీవల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన త్వరలోనే కొత్త ప్రాజెక్టు ను అనౌన్స్ చెయ్యనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తల పై ఆయన త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఏ హీరోతో సినిమా చేస్తారో చూడాలి..
బండ్ల గణేష్ & ఫ్యామిలీ … శ్రీనివాస కళ్యాణం వీడియో.. @ganeshbandla pic.twitter.com/jxu9jjvMJ3
— H A N U (@HanuNews) December 10, 2025