E-Paper
Advertisement

High Court On Akhanda2: అఖండ 2కి తెలంగాణ హైకోర్టు షాక్.. రేట్ల పెంపు జీవో రద్దు.. ఆగిన ప్రీమియర్ షో

High Court On Akhanda2: అఖండ 2కి తెలంగాణ హైకోర్టు షాక్.. రేట్ల పెంపు జీవో రద్దు.. ఆగిన ప్రీమియర్ షో
Advertisement

High Court On Akhanda2: రిలీజ్ కు ముందు అఖండ 2 కు వరుస షాక్ లు తగులుతున్నాయి. అఖండ 2 ప్రీమియర్ షో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ సర్క్యూలర్ ను హైకోర్టు రద్దు చేసింది. ప్రీమియర్ షోకు రేట్ల పెంపుపై జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

ప్రీమియర్ షో ధరలు పెంపు జీవో రద్దు

అఖండ 2 మూవీకి తెలంగాణ హై కోర్టు షాక్ ఇచ్చింది. గతంలో ప్రీమియర్స్ షో టికెట్ల ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసింది. ప్రీమియర్స్ షోలకు టికెట్ ధర రూ.600, 12వ తేదీ నుంచి సింగిల్స్ స్క్రీన్స్ పై టికెట్ పై రూ.50, మల్టిప్లెక్స్‌లో టికెట్ పై 100 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ధరలు మూడు రోజులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. టికెట్ల రేట్లు పెంపు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది.

ఇవాళ్టి ప్రీమియర్ షో రద్దు

Advertisement

హైకోర్టు జీవో సస్పెన్సన్ తో నేడు ప్రీమియర్ షోలు ఆగిపోనున్నాయి. గురువారం సాయంత్రం 8గంటలకు ప్రత్యేక షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ప్రభుత్వ జీవోను హైకోర్టు సస్పెండ్ చేయడంతో ఇవాల్టి షో రద్దు అయింది. ప్రీమియర్ షో రద్దుతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బాలయ్య అభిమానులు రూ.600 పెట్టి టికెట్లు కొనుగోలు చేశారు. 600 రూపాయలు రిఫండ్ అవుతాయా లేదా అనేది ప్రశ్నార్ధకం మారింది.

Also Read: Lock Down Post poned: అఖండ 2 ఖాతాలో మరో మూవీ… అనుపమ సినిమా వాయిదా

కలెక్షన్లపై ప్రభావం

Advertisement

హైకోర్టు ఆదేశాలతో నిర్మాత / డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుపై ఎక్కువ ఎఫెక్ట్ పడనుంది. అఖండ 2 నైజాం రైట్స్ ను దిల్ రాజు రూ.25 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. ఇప్పటికే 20 కోట్లు నిర్మాతలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు టికెట్ల పెంపు జీవోను రద్దు చేయడంతో దిల్ రాజుపై ఎఫెక్ట్ పడనుందని విశ్లేషకులు అంటున్నారు. హై కోర్టు ఉత్వర్వుల వల్ల సినిమా కలెక్షన్స్ దాదాపు 10 నుంచి 15 కోట్ల వరకు తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలుమార్లు అఖండ2 సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×