E-Paper
Advertisement

జస్ట్ 8 నెలల్లో 1 లక్ష అమ్మకాలు.. రికార్డు సృష్టించిన మారుతి విక్టోరిస్!

జస్ట్ 8 నెలల్లో 1 లక్ష అమ్మకాలు.. రికార్డు సృష్టించిన మారుతి విక్టోరిస్!
Advertisement

Maruti Invicto Hits 1 Lakh Sales: మారుతి సుజుకి భారత మార్కెట్లో విడుదల చేసిన విక్టోరిస్ SUVకి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. 2025 సెప్టెంబర్‌ లో మార్కెట్లోకి వచ్చిన ఈ మిడ్ సైజ్ SUV, కేవలం ఎనిమిది నెలల్లోనే 1 లక్ష అమ్మకాల మార్కును దాటింది. కంపెనీ చరిత్రలో అత్యంత వేగంగా అమ్ముడైన యుటిలిటీ వాహనాల్లో ఒకటిగా విక్టోరిస్ నిలిచింది.

ప్రారంభం నుంచే అదిరిపోయే క్రేజ్

ఈ SUV ప్రారంభం నుంచే మంచి డిమాండ్‌ ను కనబరిచింది. విడుదలైన ఐదు నెలల్లోనే 50 వేల యూనిట్ల అమ్మకాలు సాధించింది. 2026 జనవరిలో విక్టోరిస్ బాగా సత్తా చాటింది. ఒక్క నెలలోనే 15,240 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో మారుతి సుజుకి మొత్తం యుటిలిటీ వాహనాల అమ్మకాల్లో దాదాపు 20 శాతం వాటాను ఈ SUV సాధించింది.   ప్రస్తుతం ఎర్టిగా, బ్రెజ్జా తర్వాత కంపెనీకి అత్యధికంగా అమ్ముడవుతున్న యుటిలిటీ వాహనంగా గుర్తింపు తెచ్చుకుంది.

విక్టోరిస్ సక్సెస్ కు కారణం ఏంటంటే?

Advertisement

విక్టోరిస్ సక్సెస్ కు ప్రధాన కారణాల్లో ఒకటి దీని ఫీచర్లు. ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ SUVలో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, 10.01 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి. వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, అలెక్సా వాయిస్ కమాండ్స్, ఓవర్ ది ఎయిర్ అప్‌ డేట్స్ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

అంతేకాకుండా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వై ర్‌లెస్ ఛార్జర్, 64 రంగుల అంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌ గేట్ లాంటి ఫీచర్లు ఈ SUVను మరింత ఆకట్టుకునేలా చేశారు. కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ద్వారా వాహనానికి సంబంధించిన కీలక వివరాలను మొబైల్ ద్వారా తెలుసుకునే అవకాశం కూడా ఉంది.

పనితీరు గురించి..

Advertisement

పనితీరు పరంగా విక్టోరిస్ వినియోగదారులకు మూడు పవర్‌ ట్రెయిన్ ఆప్షన్స్ ను అందిస్తోంది. 1.5 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజిన్ 103 bhp శక్తిని, 139 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ తో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మాన్యువల్ వెర్షన్ 21.18 kmpl, ఆటోమేటిక్ వెర్షన్ 21.06 kmpl మైలేజీని అందిస్తుంది. ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ కావాలనుకునే వారికి స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. 1.5 లీటర్ హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌ తో వచ్చే ఈ మోడల్ గరిష్టంగా 28.65 kmpl మైలేజీని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. CNG వెర్షన్ కూడా మార్కెట్లో లభిస్తోంది. ఇది 27.02 km/kg మైలేజీని అందిస్తుంది.అందుకే ఈ వేరియంట్‌కు ప్రత్యేక డిమాండ్ కనిపిస్తోంది.

భద్రతా ఫీచర్లు, ధర గురించి..

భద్రత పరంగా కూడా విక్టోరిస్ మంచి గుర్తింపు పొందింది. భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో ఈ SUV 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఆరు ఎయిర్‌ బ్యాగులు, ABS, EBD, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి భద్రతా ఫీచర్లు స్టాండర్డ్‌ గా ఉన్నాయి. టాప్ వేరియంట్లలో ADAS, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ లాంటి అధునాతన సాంకేతికతలు  లభిస్తున్నాయి.  ఈ కారు రూ.10.50 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.  28.65 kmpl వరకు మైలేజీ, ఆధునిక ఫీచర్లు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో విక్టోరిస్ ప్రస్తుతం భారత SUV మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా కొనసాగుతోంది.

Read Also: జస్ట్ రూ.4.69 లక్షలకే EV.. BaaS స్కీమ్‌లో అందుబాటులో ఉన్న టాప్ 5 కార్లు ఇవే!

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×