E-Paper
Advertisement

Electric Cars: రోజు వారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు, టాప్ 5లో మీ ఛాయిస్ ఏంటి?

Electric Cars: రోజు వారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు, టాప్ 5లో మీ ఛాయిస్ ఏంటి?
Advertisement

ఎలక్ట్రిక్ కార్ల విషయంలో చాలా మంది ఇబ్బంది ఒక్కటే, ఎక్కువ దూరాలు ప్రయాణించాలన్నప్పుడు ఛార్జింగ్ అయిపోతుంది. తక్కువ దూరాలకు ఎలక్ట్రిక్ కారు ఓకే అయినా, లాంగ్ జర్నీలకు ఇబ్బందికరంగా ఉంటుంది. రోజువారీ ప్రయాణం 100 కి.మీ కంటే తక్కువ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. దూరం పెరిగితే, ఆందోళన కలుగుతుంది. అయితే, తక్కువ దూరాలకు అనుగుణంగా ఉండే, బెస్ట్ ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ టాటా పంచ్ EV  

టాటా పంచ్ EV రీసెంట్ గా అప్ డేటెడ్ డిజైన్, కొత్త టెక్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఇది కొత్త బ్యాటరీ ప్యాక్ తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఒకే ఛార్జ్‌ లో దాదాపు 275 కి.మీ రేంజ్ ను అందిస్తుంది.  ఫీచర్ల వారీగా, ఇది వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.  డోర్లు 90 డిగ్రీస్ వరకు ఓపెన్ అవుతాయి.

⦿ MG విండ్సర్ EV  

Advertisement

MG విండ్సర్ EV సున్నితమైన పనితీరు, సౌకర్యవంతమైన క్యాబిన్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది 38 kWh బ్యాటరీ ప్యాక్‌ ను కలిగి ఉంటుంది. ఇది ఒకే ఛార్జ్‌ పై 332 కి.మీ రేంజ్ ను అందిస్తుంది. క్యాబిన్‌ లో 15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌ మెంట్ డిస్‌ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. ఇది 9 స్పీకర్ ఆడియో సిస్టమ్, పవర్డ్ టెయిల్‌ గేట్, 135 డిగ్రీల వరకు వంగి ఉండే బ్యాక్ సీట్లతో వస్తుంది. ఇది లాంగ్ డ్రైవ్‌ లను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

⦿ VinFast VF6 EV    

VinFast VF6 అనేది వియత్నాం బ్రాండ్. ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ SUV మోడల్. ఇది 59.6 kWh బ్యాటరీ ప్యాక్‌ ను కలిగి ఉంది.  ఇది వేరియంట్లలో విభిన్న శ్రేణి, పవర్ అవుట్‌ పుట్‌ ను అందిస్తుంది. ఇంటీరియర్‌ లో వీగన్ లెదర్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉన్నాయి. 12.9-అంగుళాల ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌ రూఫ్, హెడ్ అప్ డిస్‌ ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

⦿ BMW iX1 LWB EV  

Advertisement

BMW iX1 LWB లగ్జరీ ఎలక్ట్రిక్ SUV ఎక్స్ పీరియెన్స్ ను కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. పొడవైన వీల్‌ బేస్,  వెనుక సీట్లలో ఎక్కువ క్యాబిన్ ప్లేస్ ఉంటుంది.  ఇది 66.4 kWh బ్యాటరీ ప్యాక్‌ తో పవర్ ను అందిస్తుంది. ఇది దాదాపు 531 కి.మీ డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. కర్వ్డ్ డిజిటల్ డిస్‌ ప్లే, 12 స్పీకర్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌ రూఫ్, ఎలక్ట్రికల్‌ గా సర్దుబాటు చేసే సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

⦿ MG సైబర్‌ స్టర్ EV  

MG సైబర్‌ స్టర్ స్పోర్టీ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. దీని సిజర్ స్టైల్ డోర్లు, సాఫ్ట్ టాప్ రూఫ్, ఆకట్టుకంటాయి. ఇది 77 kWh బ్యాటరీ, డ్యూయల్ మోటార్ సెటప్‌ ను కలిగి ఉంది. ఇది మంచి పనితీరును కలిగి ఉంటుంది.  కారు లోపలి భాగంలో డ్రైవర్  సెంట్రల్ డిజైన్ ఉంది. ట్రిపుల్ స్క్రీన్ సెటప్, ప్రీమియం ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎయిర్ ఫిల్టర్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Read Also: మారుతి 800ను లంబోర్గినిగా మార్చేశాడు, ఈ మెకానిక్ క్రియేటిటీ పీక్స్ అంతే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×