E-Paper
Advertisement

ఏథర్ To ఓలా.. స్మార్ట్ ఫీచర్లతో అదిరిపోయే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

ఏథర్ To ఓలా.. స్మార్ట్ ఫీచర్లతో అదిరిపోయే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Advertisement

Top 5 Smart Electric Scooters: వినియోగదారులు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు కేవలం బ్యాటరీ రేంజ్, స్పీడ్ మాత్రమే చూసి కొనడం లేదు. స్కూటర్‌ లో ఉన్న సాఫ్ట్‌ వేర్ ఫీచర్లను కూడా గమనిస్తున్నారు. నావిగేషన్, స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, యాంటీ థెఫ్ట్ అలర్ట్స్, OTA అప్‌ డేట్లు, రైడ్ డేటా లాంటి ఫీచర్లు ఉన్నాయా? లేదా? అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ఈవీ మార్కెట్లో బెస్ట్ సాఫ్ట్‌ వేర్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తున్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవనేది తెలుసుకుందాం..

⦿ ఏథర్ 450X

భారత EV మార్కెట్లో బెస్ట్ సాఫ్ట్‌ వేర్ ఎక్స్ పీరియెన్స్ అందించే స్కూటర్‌గా ఏథర్ 450X టాప్ లో కొనసాగుతోంది.  ఏథర్ స్టాక్  ప్లాట్‌ ఫారమ్ ద్వారా గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, వాయిస్ అసిస్టెంట్, లైవ్ లొకేషన్ షేరింగ్, కాల్, మ్యూజిక్ కంట్రోల్స్, వాట్సాప్ నోటిఫికేషన్ల లాంటి ఫీచర్లు ఉన్నాయి. OTA అప్‌డేట్ల ద్వారా స్కూటర్ పనితీరు ఎప్పటికప్పుడు మరింత మెరుగవుతుంది. ఆటోహోల్డ్, మ్యాజిక్ ట్విస్ట్ రీజెనరేటివ్ బ్రేకింగ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఫాల్ సేఫ్, థెఫ్ట్ అలర్ట్స్, ఫైండ్ మై స్కూటర్ లాంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Advertisement

⦿ ఓలా S1 ప్రో

సాఫ్ట్‌ వేర్ ఫీచర్ల విషయంలో ఓలా S1 ప్రో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మూవ్‌ ఓఎస్ ప్లాట్‌ ఫారమ్‌ తో ఈ స్కూటర్ టచ్‌ స్క్రీన్ ఎక్స్ పీరయెన్స్ ను అందిస్తుంది. మూవ్‌ ఓఎస్ 5 అప్‌ డేట్‌ తో రోడ్ ట్రిప్ ప్లానింగ్, స్మార్ట్‌ వాచ్ కనెక్టివిటీ, స్మార్ట్ పార్కింగ్, లైవ్ లొకేషన్ షేరింగ్ లాంటి క్రేజీ ఫీచర్లు వచ్చాయి. హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, ప్రాక్సిమిటీ అన్‌ లాక్, ఫైండ్ మై స్కూటర్, జియో ఫెన్సింగ్ లాంటి ఫీచర్లు ఈ స్కూటర్ ను మరింత స్మార్ట్‌ గా మార్చాయి.

Advertisement

⦿ టీవీఎస్ ఐక్యూబ్

దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న EV స్కూటర్లలో TVS ఐక్యూబ్ ఒకటి. దీనిలో వచ్చే స్మార్ట్‌ ఎక్స్‌ కనెక్ట్ ప్లాట్‌ ఫారమ్ పలు క్రేజీ ఫీచర్లను అందిస్తుంది. లైవ్ లొకేషన్ షేరింగ్, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఛార్జింగ్ స్టేషన్ లొకేటర్, కాల్, మ్యూజిక్ కంట్రోల్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.  జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ ప్రొటెక్షన్, క్రాష్ అలర్ట్స్, ఫాల్ అలర్ట్స్, ఓవర్‌ స్పీడ్ వార్నింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

⦿ హీరో విడా

హీరో మోటో కార్ప్‌ కు చెందిన విడా స్కూటర్లు వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. విడా ఎడ్జ్ సాఫ్ట్‌ వేర్ ప్లాట్‌ ఫారమ్ రోజువారీ వినియోగానికి బాగా ఉపయోగపడుతుంది. బ్యాటరీ స్టేటస్ ట్రాకింగ్, నావిగేషన్, రియల్ టైమ్ నోటిఫికేషన్లు, ట్రిప్ డేటా, రిమోట్ సెక్యూరిటీ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. టూ వే థ్రాటిల్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్ లాంటి ఫంక్షన్లు రైడర్లకు మంచి ఎక్స్ పీరియెన్స్ అందిస్తారు.

⦿ బజాజ్ చేతక్

ప్రీమియం డిజైన్‌ తో వచ్చే బజాజ్ చేతక్, సింపుల్ సాఫ్ట్‌ వేర్ ఎక్స్ పీరియెన్స్ అందిస్తుంది. చేతక్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, GPS ట్రాకింగ్, OTA అప్‌ డేట్లు, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, కాల్, మ్యూజిక్ అలర్ట్స్ లాంటి ఫీచర్లు లభిస్తాయి. అంతేకాదు, డాక్యుమెంట్ స్టోరేజ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, యాంటీ థెఫ్ట్ అలర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also: అమ్మకాల్లో దూసుకెళ్తున్న ఏథర్ రిజ్టా, ఏకంగా ఎన్ని లక్షల యూనిట్లు సేల్ అయ్యాయంటే?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×