E-Paper
Advertisement

సూపర్ లుక్, టాప్ ఫీచర్స్.. రూ. 10 లక్షల్లోపు 5 బెస్ట్ SUVలు!

సూపర్ లుక్, టాప్ ఫీచర్స్.. రూ. 10 లక్షల్లోపు 5 బెస్ట్ SUVలు!
Advertisement

Affordable SUVs with Premium Features: బడ్జెట్ ఎక్కువ కాకపోయినా, కారు డ్రైవ్ చేస్తూ ప్రీమియం ఫీల్ పొందాలని చాలా మంది భావిస్తారు. గతంలో మంచి ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, భద్రతతో కూడిన కార్లు కావాలంటే రూ. 15 లక్షలకు పైగా ధర ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. తక్కువ ధరలోనే మంచి లుక్, లేటెస్ట్ టెక్నాలజీ, చక్కటి పనితీరుతో కూడిన SUVలు లభిస్తున్నాయి. వాటిలో బెస్ట్ 5 కార్ల గురించి ఇప్పుడు చూద్దాం..

⦿ టాటా పంచ్

మంచి సేఫ్టీ కావాలనుకునే వారికి టాటా పంచ్ బెస్ట్ ఆప్షన్. సుమారు రూ.5.60 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులో ఉంటుంది. ఈ సెగ్మెంట్‌ లో అరుదుగా కనిపించే 5 స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ ను కలిగి ఉంటుంది. రోడ్లు బాగోలేకపోయినా  సులభంగా నడపడానికి సరిపడే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. పెట్రోల్, CNG ఆప్షన్లు ఉన్నాయి. పవర్ విషయంలో చాలా ఎక్కువగా కాకపోయినా, భద్రత, బిల్డ్ క్వాలిటీ విషయంలో స్ట్రాంగ్ గా ఉంటుంది.

⦿ హ్యుందాయ్ ఎక్స్టర్

Advertisement

ఈ కారు ధర రూ. 5.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఫీచర్ల విషయంలో ముందుంటుంది. టచ్‌ స్క్రీన్, డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌ రూఫ్ లాంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. కొన్ని వేరియంట్లలో డాష్‌ క్యామ్ కూడా ఉంటుంది. సిటీ డ్రైవింగ్ కు అనుకూలంగా ఉంటుంది. రోజువారీ వినియోగానికి బాగా సరిపోతుంది. పెట్రోల్, CNGతో పాటు AMT ఆప్షన్ కూడా ఉంది.

⦿ నిస్సాన్ మాగ్నైట్

పవర్, స్టైల్ కావాలంటే నిస్సాన్ మాగ్నైట్ మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. దీని ధర రూ. 6 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ ధరలో టర్బో పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. 360 డిగ్రీ కెమెరా, వైర్‌ లెస్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు దీనిని ప్రీమియం ఫీల్ ఇచ్చేలా చేస్తాయి. స్టైలింగ్ కూడా బోల్డ్‌ గా ఉంటుంది. తక్కువ ధరలో మంచి పనితీరు కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ మారుతి ఫ్రాంక్స్

Advertisement

మారుతి ఫ్రాంక్స్ ప్రారంభ ధర రూ. 6.85 లక్షలు. SUV లుక్‌ తో పాటు హ్యాచ్‌ బ్యాక్ లా సౌకర్యవంతమైన డ్రైవింగ్ ఇస్తుంది.  మైలేజ్ విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మారుతి సర్వీస్ నెట్‌ వర్క్ విస్తృతంగా ఉండటం వల్ల మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది.

⦿ కియా సోనెట్

కియా సోనెట్ ధర రూ.7.32 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ SUVలో ప్రీమియం ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి. పెద్ద టచ్‌ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్ లాంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. లోపలి డిజైన్ కూడా చాలా స్టైలిష్‌ గా ఉంటుంది. ధరకు మించి విలువ ఇచ్చే ఫీల్ ఈ కారులో ఉంటుంది.

Read Also: తక్కువ ఫ్యూయెల్ తో ఎక్కువ ప్రయాణం.. సింపుల్ గా ఇలా చేయండి!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×