E-Paper
Advertisement

EV ఛార్జింగ్‌పై ఉన్న 7 అపోహలు.. అసలు నిజం ఏంటంటే?

EV ఛార్జింగ్‌పై ఉన్న 7 అపోహలు.. అసలు నిజం ఏంటంటే?
Advertisement

EV Charging Facts vs Myths: ఎలక్ట్రిక్ వాహనాలు  గురించి ఇప్పటికీ చాలా అపోహలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఛార్జింగ్‌ కు ఎక్కువ సమయం పడుతుంది, వర్షంలో ఛార్జ్ చేయడం ప్రమాదకరం, బ్యాటరీలు తరచూ మార్చాల్సి వస్తుంది లాంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే, వాస్తవాలు చూస్తే, ఈ అభిప్రాయాల్లో చాలా వరకు నిజాలు లేవు. ఆధునిక టెక్నాలజీతో EVలు మరింత సౌకర్యవంతంగా మారాయి. ఇంతకీ ఈవీలకు సంబంధించిన అపోహలు, అసలు నిజాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ఛార్జింగ్‌కు చాలా సమయం పడుతుంది

చాలా మంది ఛార్జింగ్‌కు చాలా సమయం పడుతుందని అపోహ పడుతుంటారు. సాధారణంగా ఇంట్లో 3 పిన్ సాకెట్‌ తో పూర్తిగా ఛార్జ్ కావడానికి 8 నుంచి 12 గంటల సమయం పట్టవచ్చు. కానీ, పెద్ద సమస్య కాదు. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు రాత్రి నిద్రపోయే సమయంలో వాహనాన్ని ఛార్జ్ చేస్తారు. ఉదయం లేవగానే ఫుల్ ఛార్జ్‌ తో కారు సిద్ధంగా ఉంటుంది. ఇక రోడ్ ట్రిప్‌ లకు వస్తే, డీసీ ఫాస్ట్ ఛార్జర్లు కేవలం 30 నుంచి 60 నిమిషాల్లోనే మంచి రేంజ్‌ను అందిస్తాయి.

⦿  వర్షంలో ఛార్జ్ చేయలేం!

Advertisement

ఈ అపోహ కూడా చాలా మందిలో ఉంది. నిజానికి EV ఛార్జర్లు, కేబుల్స్ నీటి నిరోధకతతో తయారు చేయబడతాయి. వీటికి సాధారణంగా IP65, IP67 రేటింగ్ ఉంటుంది. అంటే వర్షం, తడి పరిస్థితుల్లో కూడా సురక్షితంగా ఉపయోగించవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఆందోళన అవసరం లేదు.

⦿ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు లేవు

ఇందులో కూడా నిజం లేదు. దేశంలోనే వేల సంఖ్యలో పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం,  ప్రైవేట్ సంస్థలు కలిసి ఈ నెట్‌ వర్క్‌ ను వేగంగా విస్తరిస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా మెరుగుపడే అవకాశం ఉంది.

⦿ EV బ్యాటరీలు తరచూ మార్చాలి!

Advertisement

ఇక EV బ్యాటరీలు తరచూ మార్చాలని భావిస్తారు. కానీ, వాస్తవానికి, లేటెస్ట్ EV బ్యాటరీలు 8 నుంచి 10 సంవత్సరాల వరకు లేదంటే సుమారు 1.5 లక్షల కిలోమీటర్ల వరకు పనిచేస్తాయి. చాలా కంపెనీలు ఈ బ్యాటరీలపై వారంటీ కూడా ఇస్తాయి. అందువల్ల ఇది పెద్దగా ఆందోళన కలిగించే అంశం కాదు.

⦿ ఎప్పుడూ 80% వరకు మాత్రమే ఛార్జ్ చేయాలి!

తరచుగా ఈ మాట కూడా వినిపిస్తుంది. ఇందులో కూడా పెద్దగా నిజం లేదు. కొన్ని పాత రకం బ్యాటరీలలో ఇది కొంతవరకు వర్తించవచ్చు. కానీ, ప్రస్తుతం చాలా EVలు LFP బ్యాటరీలను ఉపయోగిస్తున్నాయి. ఇవి 100% వరకు ఛార్జ్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.

మొత్తంగా EVలపై ఉన్న చాలా అపోహలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. మెరుగైన టెక్నాలజీ, పెరుగుతున్న సదుపాయాలు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో, ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

Read Also: ఈ డ్యాష్ కామ్ ఉంటే.. యాక్సిడెంట్లే జరగవ్, రికార్డింగే కాదు అలర్ట్ కూడా చేస్తుంది!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×