E-Paper
Advertisement

Scooters For Women: హోండా To యమహా.. మహిళలకు సూటయ్యే బెస్ట్ స్కూటర్లు ఇవే!

Scooters For Women: హోండా To యమహా.. మహిళలకు సూటయ్యే బెస్ట్ స్కూటర్లు ఇవే!
Advertisement

Best Scooters for Women 2026: మహిళలకు సంబంధించిన స్కూటర్లను కొనుగోలు చేసే సమయంలో చక్కటి సౌకర్యం, మంచి ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ, మెయింటెనెన్స్ గురించి ఆలోచించాయి. ప్రస్తుతం ఇండియాలో మహిళలకు అనుకూలమైన బోలెడు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. తేలికైన డిజైన్ తో సిటీ ట్రాఫిక్‌ లో ఈజీగా నడిపేలా ఉండేలా వీటిని తయారు చేశారు. మంచి ఇంధన సామర్థ్యంతో పాటు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఇంతకీ ఆ బైక్స్ ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ హోండా యాక్టివా 6G: ధర రూ. 78,684.

ఈ స్కూటర్ ఆరు పెప్పీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం సిక్త్ జెనరేషన్ యాక్టివా మార్కెట్ లో కొనసాగుతంది. ఇది మహిళలకు చాలా అనుకూలంగా ఉంటుంది. స్టాండర్డ్, డీలక్స్, H-స్మార్ట్ ఎడిషన్లలో లభిస్తుంది. 106 కిలోల కెర్బ్ బరువుతో పాటు, డ్యూయల్ ఫంక్షన్ స్విచ్, సైలెంట్ స్టార్టర్ కిట్, LED హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. ఇది 55 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

⦿ సుజుకి యాక్సెస్ 125: ధర రూ. 80,700

Advertisement

ఎక్కువ ఇంజిన్ పవర్ కోసం చూస్తున్నట్లయితే.. సుజుకి యాక్సెస్ 125 బెస్ట్. BS6 కంప్లైంట్ స్కూటర్ 1160 mm ఎత్తులో ఉంటుంది. తక్కువ ఎత్తు ఉన్న మహిళలకు కూడా సులభమైన రైడింగ్ అందిస్తుంది. యాక్సెస్ 125 పెద్ద ఫ్లోర్‌ బోర్డ్,  క్లాస్-లీడింగ్ 21.8-లీటర్ బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. 64 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

⦿ యమహా ఫాసినో 125 హైబ్రిడ్: ధర రూ. 79,950

అల్ట్రా లైట్ వెయిట్ స్కూటర్ గా యమహా ఫాసినో 125 హైబ్రిడ్ అందుబాటులో ఉంది. కేవలం 99 కిలోల బరువుతో, ఫాసినో 125 అత్యంత తేలికైన 125cc స్కూటర్లలో ఒకటిగా కొనసాగుతోంది. 110cc మోడళ్ల కంటే కూడా తేలికైనది. ఈ రెట్రో స్టైల్ స్కూటర్ కాల్, SMS అలర్ట్, పార్కింగ్ సమాచారాన్ని అందించేలా Y కనెక్ట్ ఎనేబుల్డ్ కన్సోల్ ను కలిగి ఉంటుంది. 60 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

⦿ హీరో ప్లెజర్ ప్లస్: ధర రూ. 71,763

Advertisement

హీరో ప్లెజర్ ప్లస్ పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మంచి స్టైల్ తో పాటు ప్రాక్టికాలిటీని కలిగి ఉంటుంది. తేలికైన బాడీ, మంచి హ్యాండిల్ డిజైన్‌తో ఉంటుంది. 110.9cc ఇంజిన్‌ను కలిగి ఉంది. డిజిటల్ స్పీడోమీటర్, USB ఛార్జింగ్, పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. 52 కిలో మీటర్ల మైలేజ్ ను అందిస్తుంది.

⦿ హోండా డియో: ధర రూ. 73,212

హోండా డియో స్కూటర్ మహిళలకు బెస్ట్ స్కూటీగా చెప్పుకోవచ్చు. ఈ స్పోర్టీ స్కూటర్ ఏరోడైనమిక్ ఫ్రంట్ ఫాసియా, యాక్టివ్ ఛాసిస్‌ ను కలిగి ఉంది.  ఈ BS6  స్కూటర్ స్మార్ట్ కీ యాక్సెస్, చక్కటి ఫుట్ పెగ్‌లను కలిగి ఉంటుంది. ఇది 55 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

⦿ వెస్పా VXL 125: ధర రూ. 1,30,950

వెస్పా స్కూటర్ల రెట్రో లుక్ లో ఆకట్టుకుంటుంది. కాస్త ధర ఎక్కువగా ఉంటుంది. 115 కిలోల కెర్బ్ బరువు ఉంటుంది. మహిళలకు హ్యాండిల్ చేయడం సులభంగా ఉంటుంది. 40 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Read Also:  2026లో 8 కొత్త బైక్స్ లాంచ్.. బజాజ్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×