E-Paper
Advertisement

New Bajaj Bikes Launch: 2026లో 8 కొత్త బైక్స్ లాంచ్.. బజాజ్ ప్లాన్ మామూలుగా లేదుగా!

New Bajaj Bikes Launch: 2026లో 8 కొత్త బైక్స్ లాంచ్.. బజాజ్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Advertisement

బజాజ్ ఆటో చాలా కాలంగా పల్సర్ మోడల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కంపెనీ నుంచి ఎన్ని బైక్స్ వచ్చినప్పటికీ,   అత్యుత్తమ మోటార్ సైకిల్ గా పల్సర్ కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం బజాజ్ తన పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించేందుకు కొత్త మోడల్స్ తో మార్కెట్ లోకి అడుగు పెట్టాలని భావిస్తోంది. బజాజ్ రాబోయే మోటార్‌ సైకిళ్లలో కొన్ని ADVలు, ఆఫ్ రోడ్ మోటార్‌ సైకిళ్లుగా ఉండబోతున్నాయి. 125cc నుంచి 250cc డిస్‌ ప్లేస్‌ మెంట్ కేటగిరీలో కొత్త సబ్ బ్రాండ్‌ లోకి రావచ్చు. బజాజ్ 2026లో మూడు జెనరేషన్స్ లాంచ్‌లతో తన పల్సర్ పోర్ట్‌ ఫోలియోను కూడా బలోపేతం చేస్తోంది.

2026లో 8 కొత్త బజాజ్ బైక్స్ ప్రారంభం

బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ రాబోయే మోడల్స్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఐదు నుంచి ఆరు నెలల్లో భారత్ లోకి 8 కొత్త బజాజ్ బైక్‌లు విడుదల అవుతాయన్నారు. రాబోయే రెండు క్వార్టర్స్ లో ప్రతి నెలా రెండు మోడల్స్ ను పరిచయం చేయనున్నట్లు తెలిపారు.  ఉత్పత్తి పరిచయాలు ఉంటాయన్నారు.  కంపెనీ తన కోర్ పల్సర్ మోడళ్లను అప్‌ డేట్ చేయడంలో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ 2026లో మూడు వేవ్స్ గా తమ కోర్ పల్సర్ అప్‌ గ్రేడ్స్ ను ప్రవేశపెడుతుందన్నారు. ఇందులో పల్సర్ 125, పల్సర్ 160, పల్సర్ 220 తో కూడిన క్లాసిక్ పల్సర్ లైనప్‌ కు సంబంధించినవి ఉంటాయని భావిస్తున్నారు.

Advertisement

Read Also: 2026-27లో ఏకంగా 8 కొత్త మోడల్స్, రాయల్ ఎన్‌ ఫీల్డ్ ప్లాన్ మామూలుగా లేదుగా!

అటు 125cc నుంచి 250cc డిస్‌ ప్లేస్‌ మెంట్ విభాగంలో బజాజ్ పల్సర్, డొమినార్, అవెంజర్ లాంటి కొత్త సబ్ బ్రాండ్‌ ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సబ్ బ్రాండ్ కింద ప్రారంభించబోయే ADV, ఆఫ్ రోడ్ మోటార్‌ సైకిళ్లను కంపెనీ రెడీ చేస్తోంది. ఈ రెండు శైలులు ఇటీవలి మంచి పాపులారిటీ పొందాయి. ఈ ADVలు, ఆఫ్ రోడ్ ఫార్మాట్ మోటార్ సైకిళ్ళు బజాజ్  అంతర్జాతీయ మార్కెట్ లోకి ఎగుమతి చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం బజాజ్ పల్సర్.. డొమినార్, KTM, ట్రయంఫ్ బ్రాండ్లలో 250cc ప్లస్ డిస్ ప్లేస్‌మెంట్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా 108 దేశాలలో పోటీ పడుతోంది.

కొత్త 350cc బైక్‌లు వస్తున్నాయ్!

Advertisement

భారత ప్రభుత్వం GST 2.0 సవరణల నేపథ్యంలో బజాజ్ ప్రస్తుతం ఈ పన్ను సవరణలను ఆస్వాదిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ కు పోటీగా కొత్త 350cc శ్రేణి మోటార్‌ సైకిళ్లను అభివృద్ధి చేయనుంది. 350cc ట్రయంఫ్ మోటార్‌ సైకిళ్ళు 2026 ఏప్రిల్‌ లో భారతీయ రోడ్లపైకి రానున్నట్లు బజాజ్ వెల్లడించారు.

Read Also: ఈవీ మార్కెట్ లో సత్తా చాటుతున్న స్కూటర్స్, బైక్స్ ఎందుకు వెనుకబడుతున్నాయి?

Related News

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

Big Stories

Advertisement
×