E-Paper
Advertisement

ట్రయంఫ్ అభిమానులకు షాక్.. 350cc మోడల్స్ ధర పెంపు!

ట్రయంఫ్ అభిమానులకు షాక్.. 350cc మోడల్స్ ధర పెంపు!
Advertisement

Triumph Price Updates: భారత మార్కెట్లో ట్రయంఫ్ బైక్స్ కు మంచి ఆదరణ లభిస్తున్న సమయంలో వినియోగదారులకు కంపెనీ షాకింగ్ న్యూస్ చెప్పింది. 350cc శ్రేణికి సంబంధించి బైక్‌ల ధరలను పెంచింది. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో స్పీడ్ 400, స్పీడ్ T4, స్క్రాంబ్లర్ 400 XC, థ్రక్స్‌ టన్ 400 మోడళ్ల ధరలు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు పెరిగాయి.

తాజా పెంపుతో ఏ బైక్ ధర ఎంత ఉందంటే?

కొత్త ధరల ప్రకారం ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ.2.34 లక్షలకు చేరుకుంది. గత ధరతో పోలిస్తే రూ.2,000 ఎక్కువ. అలాగే స్పీడ్ T4 ధర రూ.1.95 లక్షల నుంచి రూ.1.99 లక్షలకు పెరిగింది. ఈ మోడల్‌ పై రూ.4,000 ధర పెంచింది. ఇక స్క్రాంబ్లర్ 400 XC,  థ్రక్స్‌ టన్ 400 మోడళ్లపై అత్యధికంగా రూ.5,000 పెంచింది. ప్రస్తుతం స్క్రాంబ్లర్ 400 XC ధర రూ.2.94 లక్షలు కాగా, థ్రక్స్‌ టన్ 400 ధర రూ.2.70 లక్షలుగా ఉంది.

Advertisement

గతంలో ట్రయంఫ్ 398cc ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించేది. అయితే కొత్త నిబంధనలు, మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీ 350cc ప్లాట్‌ఫామ్‌కు మారింది. ఈ మార్పు తర్వాత స్పీడ్ T4 ధరలో ఇదే తొలి పెంపు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న 350cc స్పీడ్ T4 ధర, కొన్ని నెలల క్రితం విక్రయించిన 399cc వెర్షన్ కంటే ఎక్కువగా ఉన్నాయి.

పనితీరు ఎలా ఉందంటే?

స్పీడ్ T4 ఇప్పుడు 29 హెచ్‌పీ పవర్, 31 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తోంది. పాత వెర్షన్ 31 హెచ్‌పీ పవర్, 36 ఎన్ఎం టార్క్‌ ను అందించేది. స్పీడ్ 400,  స్క్రాంబ్లర్ 400 XC మోడళ్లు ప్రస్తుతం 37 హెచ్‌పీ పవర్, 32 ఎన్ఎం టార్క్‌ ను అందిస్తున్నాయి. గతంలో ఇవి 40 హెచ్‌పీ పవర్, 37.5 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేసేవి. థ్రక్స్‌ టన్ 400 మాత్రం ఈ శ్రేణిలో అత్యంత పవర్ ఫుల్ మోడల్‌గా నిలుస్తోంది. ఈ బైక్ 40 హెచ్‌పీ పవర్, 32 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్ ట్యూనింగ్‌ ను ట్రయంఫ్ ఇటీవల విడుదల చేసిన ట్రాకర్ 400లో కూడా ఉపయోగించింది.

Advertisement

ప్రస్తుతం ట్రయంఫ్ ట్రాకర్ 400, స్క్రాంబ్లర్ 400 X మోడళ్ల ధరలను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా అప్‌డేట్ చేయలేదు. త్వరలో వాటి కొత్త ధరలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ధరలు పెరిగినా ట్రయంఫ్ 350cc శ్రేణి బైక్‌లు ప్రీమియం మిడిల్‌ వెయిట్ సెగ్మెంట్‌ లో తమ ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్నాయి.

Read Also: వచ్చే 12 నెలల్లో 5 కొత్త కార్లు లాంచ్.. మారుతి ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×