E-Paper
Advertisement

సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. పెళ్లి బైక్ ఇవ్వలేదని భార్యను చంపి, భర్త ఆత్మహత్య!

సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. పెళ్లి బైక్ ఇవ్వలేదని భార్యను చంపి, భర్త ఆత్మహత్య!
Advertisement

Sangareddy: కట్నం వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, మరో ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోవడానికి కారణమయ్యాయి. పెళ్లి సమయంలో ఇస్తానన్న బైక్ ఇవ్వలేదనే కక్షతో భార్యను గొంతు నులిమి చంపిన భర్త, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘోర కలియుగ సంఘటన సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

మారేపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు(25) అనే యువకుడికి, యాదమ్మ(21) అనే యువతితో 11 నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో కట్నం కింద మోటార్ సైకిల్ ఇస్తామని యాదమ్మ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. అయితే, పెళ్లయిన తర్వాత కూడా బైక్ ఇవ్వకపోవడంతో ఆంజనేయులు మనస్తాపానికి గురయ్యాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

Advertisement

ఈ క్రమంలోనే బైక్ ఇవ్వట్లేదనే కోపంతో ఊగిపోయిన ఆంజనేయులు, తన భార్య యాదమ్మను చున్నీతో ఉరివేసి దారుణంగా హత్య చేశాడు. భార్య చనిపోయిన తర్వాత.. ఈ ఘోర నేరం నుండి తాను ఎలాగూ తప్పించుకోలేనని, పోలీసులకు దొరికిపోతానని గ్రహించాడు. చట్టం ముందు నేరస్థుడిగా నిలబడటం ఇష్టం లేక, భయంతో ఆంజనేయులు కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Also Read: పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే నాలుక చీరేస్తాం.. దాసరి రాముపై కిరణ్ రాయల్ తీవ్ర ఆగ్రహం!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×