E-Paper
Advertisement

కొత్త రంగుల్లో TVS జూపిటర్ 125.. ధర పెంపు లేకుండానే లాంచ్!

కొత్త రంగుల్లో TVS జూపిటర్ 125.. ధర పెంపు లేకుండానే లాంచ్!
Advertisement

TVS Jupiter 125 New Colours: భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్ 125 ఒకటి. ప్రతి నెలా లక్షకు పైగా అమ్మకాలతో దూసుకుపోతున్న ఈ స్కూటర్‌ కు ఇప్పుడు కంపెనీ కొత్త లుక్ ఇచ్చింది. ధరను పెంచకుండా రెండు కొత్త మల్టీ టోన్ కలర్ ఆప్షన్లను యాడ్ చేస్తూ జూపిటర్ 125ను అప్‌ డేట్ చేసింది.

రెండు కలర్ ఆప్షన్స్ తో టీవీఎస్ జుపిటర్ 125

కొత్తగా తీసుకొచ్చిన రంగుల్లో ‘ఐవరీ మ్యాట్ కాపర్ బ్రాంజ్’, ‘ఐవరీ ఎలైట్ గ్రీన్’ మరింత ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు కలర్స్‌ ను కంపెనీ కేవలం డీటీ ఎస్‌ఎక్స్‌సీ వేరియంట్‌ లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వేరియంట్ ఎక్స్‌ షోరూమ్ ధర రూ. 86,750గా నిర్ణయించారు. కొత్త కలర్స్ తీసుకొచ్చినా ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం.

Advertisement

కంపెనీ వీటిని డ్యూయల్ టోన్ గా పేర్కొన్నప్పటికీ, వాస్తవానికి ఇవి మల్టీ టోన్ కలర్స్‌ లా కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్కూటర్‌ లో ఇప్పటికే బ్రౌన్ కలర్ సీటు, లైట్ బ్రౌన్ ఫ్లోర్‌ బోర్డ్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన మ్యాట్ కాపర్ బ్రాంజ్, ఎలైట్ గ్రీన్ రంగులు ఫ్రంట్ ఆప్రాన్, హెడ్‌ లైట్ కౌల్, సైడ్ ప్యానెల్స్ లాంటి భాగాలపై కనిపిస్తాయి. మిగతా భాగం మొత్తం ఐవరీ షేడ్‌ లో ఉండటం వల్ల స్కూటర్‌ కు ప్రీమియం లుక్ వచ్చింది.

నాలుగు వేరియంట్లలో జూపిటర్ 125

జూపిటర్ 125 ప్రస్తుతం మొత్తం నాలుగు వేరియంట్లలో అమ్మకానికి ఉంది. ఎంట్రీ లెవల్ డ్రమ్ అల్లాయ్ వేరియంట్ ఇండిబ్లూ, వైట్, టైటానియం గ్రే అనే మూడు సింగిల్ టోన్ రంగుల్లో లభిస్తుంది. దీని ఎక్స్‌ షోరూమ్ ధర రూ. 78,700. డిస్క్ వేరియంట్‌ లో వీటితో పాటు స్పార్క్లింగ్ బ్లాక్ అనే మరో కొత్త కలర్ ఆప్షన్ లో కూడా ఉంది. ఈ వేరియంట్ ధర రూ. 83,900గా ఉంది.

Advertisement

ఇక డీటీ ఎస్‌ఎక్స్‌సీ వేరియంట్ విషయానికి వస్తే, కొత్తగా వచ్చిన రెండు మల్టీ టోన్ రంగులతో పాటు ఐవరీ బ్రౌన్, ఐవరీ గ్రీన్ రంగుల్లో కూడా లభిస్తుంది. టాప్ వేరియంట్ అయిన స్మార్ట్‌ ఎక్స్‌ కనెక్ట్ మోడల్ మాత్రం ఎలైట్ గ్రీన్, మ్యాట్ కాపర్ బ్రాంజ్, ఎలిగెంట్ రెడ్ అనే మూడు మోనో టోన్ రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 89,060 (ఎక్స్‌ షోరూమ్).

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఫీచర్ల పరంగా చూస్తే, జూపిటర్ 125లో 124.8cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఈ ఇంజిన్ 8.45 bhp పవర్, 11.1 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక భాగాల్లో 12 అంగుళాల టైర్లు ఉండగా, ముందు 220 mm డిస్క్ బ్రేక్, వెనుక 130 mm డ్రమ్ బ్రేక్ అందించారు. స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 163 mm కాగా, సీటు ఎత్తు 765 mmగా ఉంది. దీంతో నగర ప్రయాణాలకు ఈ స్కూటర్ సౌకర్యంగా ఉంటుంది.

అమ్మకాల్లో సూపర్ స్పీడ్

అమ్మకాల పరంగా కూడా జూపిటర్ మంచి ఫామ్‌లో ఉంది. 2026 ఏప్రిల్ నెలలో మాత్రమే 1,17,383 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14 శాతం వృద్ధి సాధించింది. 2025 ఏప్రిల్‌ లో 1,02,588 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం టీవీఎస్ కంపెనీ అమ్ముతున్న ప్రతి మూడు వాహనాల్లో ఒకటి జూపిటర్ కావడం విశేషం.

Read Also: ప్రపంచంలో ఎక్కువ బైక్‌లు ఉన్న దేశం ఏదో తెలుసా? భారత్ ఏ స్థానంలో ఉందంటే?

Related News

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×