E-Paper
Advertisement

ప్రపంచంలో ఎక్కువ బైక్‌లు ఉన్న దేశం ఏదో తెలుసా? భారత్ ఏ స్థానంలో ఉందంటే?

ప్రపంచంలో ఎక్కువ బైక్‌లు ఉన్న దేశం ఏదో తెలుసా? భారత్ ఏ స్థానంలో ఉందంటే?
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో మోటార్‌ సైకిళ్లు ప్రజల రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. ముఖ్యంగా ఆసియా దేశాల్లో టూవీలర్స్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. సిటీల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు, తక్కువ ఖర్చుతో ప్రయాణం లాంటి కారణాల వల్ల ప్రజలు కార్ల కంటే బైక్‌ లు, స్కూటర్లను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు.

తలసరి మోటార్ సైకిళ్ల వినియోగంలో వియాత్నం టాప్!

Advertisement

తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం, తలసరి మోటార్‌ సైకిళ్ల సంఖ్యలో వియత్నాం ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో ఉంది. అక్కడ దాదాపు ప్రతి కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మోటార్‌ సైకిళ్లు ఉన్నాయి. 2024 నాటికి వియత్నాంలో 7.7 కోట్లకు పైగా రిజిస్టర్డ్ మోటార్‌ సైకిళ్లు ఉన్నాయని అంచనా. అంటే ప్రతి 1,000 మందికి సుమారు 770 మోటార్‌ సైకిళ్లు ఉన్నాయి.

వియత్నాంలో ఎందుకు బైకుల సంఖ్య ఎక్కువ అంటే?

వియత్నాంలో బైక్‌ లు ఇంతగా ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం చౌకగా దొరకడం, తక్కువ ఫ్యూయెల్ వినియోగించడం, ట్రాఫిక్‌ లో సులభంగా ప్రయాణించే అవకాశం ఉండటం. పెద్ద నగరాల్లో కార్ల కంటే మోటార్‌ సైకిళ్లు చాలా వేగంగా ప్రయాణించేందుకు ఉపయోగపడుతాయి. అయితే, టై వీలర్స్ సంఖ్య పెరగడం వల్ల ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం, రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే అక్కడి ప్రభుత్వం భవిష్యత్తులో పెట్రోల్ బైక్‌ లపై పరిమితులు విధించే ఆలోచనలో ఉంది.

Advertisement

ఇక తలసరి మోటార్‌ సైకిళ్ల వాడకంలో తైవాన్ రెండో స్థానంలో ఉంది. అక్కడ ప్రతి 1,000 మందికి దాదాపు 620 మోటార్‌ సైకిళ్లు ఉన్నాయి. తైవాన్ నగరాల్లో స్కూటర్లు చాలా సాధారణంగా కనిపిస్తాయి. తక్కువ ఖర్చు, సులభమైన పార్కింగ్, వేగవంతమైన ప్రయాణం లాంటి కారణాలతో అక్కడ ప్రజలు ద్విచక్ర వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

అత్యధిక మోటార్ సైకిళ్లలో ఇండియా టాప్

ఇక భారత్ తలసరి సంఖ్యలో అగ్రస్థానంలో లేకపోయినా, మొత్తం మోటార్‌ సైకిళ్ల సంఖ్యలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలో సుమారు 22 కోట్లకు పైగా మోటార్‌ సైకిళ్లు ఉన్నాయని అంచనా. ఎక్కువ జనాభా కారణంగా తలసరి సంఖ్య తక్కువగా కనిపించినా,  భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌ గా కొనసాగుతోంది.

హీరో, హోండా, టీవీఎస్, బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి కంపెనీలు భారత మార్కెట్లో పెద్ద సంఖ్యలో టూవీలర్స్ ను అమ్ముతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు బైక్‌లు ప్రజల ప్రధాన రవాణా అవసరాలను తీరుస్తున్నాయి. ప్రస్తుతం వియత్నాం, భారత్, ఇండోనేషియా, థాయ్‌ లాండ్ వంటి దేశాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం, కాలుష్య నియంత్రణ చర్యలు, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా ఎక్కువ మంది ఈవీల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.

Read Also: అల్ట్రావైలెట్ టెసరాక్ట్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×