E-Paper
Advertisement

158 కి.మీ రేంజ్‌తో టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

158 కి.మీ రేంజ్‌తో టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!
Advertisement

TVS Orbiter Electric Scooter: టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ను అంతర్జాతీయ మార్కెట్లలోకి విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా నేపాల్‌లో టీవీఎస్ ఆర్బిటర్  ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను అధికారికంగా ఆవిష్కరించింది. అత్యాధునిక  ఫీచర్లు, మంచి రేంజ్, స్మార్ట్ కనెక్టివిటీతో ఈ స్కూటర్ పట్టణ ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

సింగిల్ ఛార్జ్ తో 158 కి.మీ ప్రయాణం

ఈ స్కూటర్‌లో 3.1 kWh లిథియం అయాన్ బ్యాటరీను అందించారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 158 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని టీవీఎస్ వెల్లడించింది. రోజువారీ నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని దీనిని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఆకట్టుకునే సరికొత్త ఫీచర్లు

Advertisement

ఆర్బిటర్‌ లో సౌకర్యవంతమైన రైడింగ్ కోసం క్రూయిజ్ కంట్రోల్, ఎత్తైన ప్రాంతాల్లో సులభంగా స్టార్ట్ అయ్యేలా హిల్ హోల్డ్ అసిస్ట్, అలాగే రీజెనరేటివ్ బ్రేకింగ్ లాంటి ఫీచర్లను అందించారు. రైడర్ అవసరాన్ని బట్టి ఎకో, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ స్కూటర్‌ లోని మరో ప్రత్యేకత 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్. హెల్మెట్‌ తో పాటు ఇతర సామాన్లు కూడా సులభంగా పెట్టుకునేంత స్థలం ఇందులో ఉంటుంది. అంతేకాదు, 845 మిల్లీమీటర్ల పొడవైన ఫ్లాట్ సీటు, 290 మిల్లీమీటర్ల వెడల్పైన ఫుట్‌ బోర్డ్ ఉండటంతో రైడర్‌తో  పాటు పిలియన్ ప్రయాణికుడికి కూడా మంచి సౌకర్యం లభిస్తుంది.

టీవీఎస్ ఆర్బిటర్‌లో 14 అంగుళాల ఫ్రంట్ వీల్ ను తీసుకొచ్చింది. ఈ సెగ్మెంట్‌లో ఇది ప్రత్యేకమైన ఫీచర్. దీని వల్ల రోడ్డుపై మెరుగైన స్థిరత్వం, మంచి గ్రిప్, ఈజీ హ్యాండ్లింగ్, సౌకర్యవంతమైన రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ లభిస్తుంది. అలాగే 169 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో గుంతలు, స్పీడ్ బ్రేకర్లపై కూడా ఈజీగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ పరంగా కూడా ఈ స్కూటర్‌లో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కలర్ LCD డిస్‌ ప్లే, మొబైల్ యాప్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్,  ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్‌ వేర్ అప్‌డేట్స్, USB ఛార్జింగ్ పోర్ట్ లాంటి సౌకర్యాలను అందించారు.

భద్రతకు పెద్దపీట

Advertisement

భద్రత విషయంలో కూడా టీవీఎస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ స్కూటర్‌లో క్రాష్, ఫాల్ అలర్ట్, జియోఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్, టోయింగ్ అలర్ట్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ నోటిఫికేషన్ లాంటి కనెక్టెడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే పార్కింగ్ అసిస్ట్ కూడా అందుబాటులో ఉంది.

టూవీలర్ రవాణాను ప్రోత్సహించే దేశాల్లో తమ ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యాపారాన్ని విస్తరించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు టీవీఎస్ మోటార్ ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రెసిడెంట్ పేయ్‌మాన్ కర్గార్ వెల్లడించారు. నేపాల్‌లో ఆర్బిటర్ స్కూటర్‌ను ప్రవేశపెట్టడం ఆ దిశగా మరో ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. మంచి రేంజ్, ఆధునిక సేఫ్టీ ఫీచర్లు, స్మార్ట్ కనెక్టివిటీ, విశాలమైన స్టోరేజ్, సౌకర్యవంతమైన డిజైన్‌తో టీవీఎస్ ఆర్బిటర్ పట్టణ ప్రయాణాల కోసం ఆకట్టుకునే ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: వోక్స్‌ వ్యాగన్ సూపర్ ఈ-సైకిల్.. కిందపడితే ఇంట్లో వాళ్లకు వెంటనే మెసేజ్!

Related News

స్కూటర్‌పై ఆఫీసులో రౌండ్ కొట్టిన సీఈఓ.. కారణం తెలిస్తే మెచ్చుకుంటారు!

హెల్మెట్ కొంటే సరిపోదు.. 2-2-2 రూల్ పాటించకపోతే ప్రాణాలను రిస్క్ లో పెట్టినట్టే!

వోక్స్‌ వ్యాగన్ సూపర్ ఈ-సైకిల్.. కిందపడితే ఇంట్లో వాళ్లకు వెంటనే మెసేజ్!

తక్కువ సీట్ హైట్ ఉన్న.. బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రైడింగ్ ఇక మరింత ఈజీ..!

మార్కెట్లోకి ఖరీదైన స్పోర్ట్స్ బైక్.. ఒక్కసారి రోడ్డుపైకి వెళ్తే.. రేసింగ్ ప్రియులకు పూనకాలే!

పల్సర్ ప్రేమికులకు తీపి కబురు.. సరికొత్త 125cc, 150cc మోడల్స్ వచ్చేస్తున్నాయ్..!

బైక్ లవర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్‌లోకి బజాజ్ ఫస్ట్ ఈవీ బైక్.. ఎప్పుడో తెలుసా?

Big Stories

Advertisement
×