E-Paper
Advertisement

జూన్ 5న విన్‌ ఫాస్ట్ ట్యాక్సీ సర్వీసులు షురూ.. ఉబెర్, ఓలాకు తలనొప్పి తప్పదా?

జూన్ 5న విన్‌ ఫాస్ట్ ట్యాక్సీ సర్వీసులు షురూ.. ఉబెర్, ఓలాకు తలనొప్పి తప్పదా?
Advertisement

Green SM EV Launches Taxi Service: వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ గ్రీన్ SM భారత్‌ లో ట్యాక్సీ సేవలను ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. జూన్ 5 నుంచి దేశీయ మార్కెట్లో అధికారికంగా సర్వీసులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థ తొలుత ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ సర్వీసులను ప్రారంభించనుంది. ఆ తర్వాత దశల వారీగా ఇతర ప్రధాన నగరాలకు విస్తరించే ప్రణాళికలు చేస్తోంది.

గ్రీన్ SMకు వియత్నాం దిగ్గజ సంస్థ విన్‌ గ్రూప్ సపోర్ట్ ఉంటుంది. ఇదే సంస్థ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ ఫాస్ట్‌ ను కూడా నిర్వహిస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఉబెర్, ఓలా లాంటి సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలతో సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రీన్ SM రంగంలోకి అడుగుపెడుతోంది.

విన్ ఫాస్ట్ ట్యాక్సీ సర్వీసులు ప్రత్యేకత ఏంటంటే..

Advertisement

ఇతర క్యాబ్ సంస్థల మాదిరిగా వివిధ కంపెనీల వాహనాలను ఉపయోగించకుండా, కేవలం విన్‌ఫాస్ట్ తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాలనే ఉపయోగించనుంది. ప్రయాణికులకు పూర్తిగా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎక్స్ పీరియెన్స్ అందించాలని భావిస్తోంది.  భారత్‌ లో ప్రారంభ దశలో గ్రీన్ SM తన ఫ్లీట్‌ లో లిమో గ్రీన్ అనే ఎలక్ట్రిక్ ఎంపీవీని ఉపయోగించనుంది. ఇది విన్‌ ఫాస్ట్ రూపొందించిన VF MPV 7 ఆధారంగా అభివృద్ధి చేసిన ప్రత్యేక ఫ్లీట్ వెర్షన్. క్యాబ్ సేవల అవసరాలకు అనుగుణంగా ఈ వాహనంలో కొన్ని మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఒకే ఛార్జ్ తో 500 కిలోమీటర్ల ప్రయాణం

లిమో గ్రీన్‌ లో 60.13kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇదే బ్యాటరీని VF MPV 7లో కూడా ఉపయోగిస్తున్నారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం ఈ వాహనానికి ఉంటుంది. వాహనంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 204 హెచ్‌పీ శక్తి, 280 ఎన్‌ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

Advertisement

సాధారణ వినియోగదారుల కోసం విక్రయించే VF MPV 7తో పోలిస్తే, లిమో గ్రీన్‌ లో కొన్ని ఫీచర్లు తగ్గనున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రయాణికుల సౌకర్యం, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సంస్థ చెబుతోంది. ఈ వాహనంలో 7 సీట్లు ఉండే అవకాశం ఉంది. ఇటీవల భారత రోడ్లపై పరీక్షల సమయంలో ఈ వాహనం గ్రీన్ SM బ్రాండింగ్‌ తో కనిపించడం ఆసక్తి కలిగించింది. గ్రీన్ SM వెనుక ఉన్న సంస్థ గ్రీన్ అండ్ స్మార్ట్ మొబిలిటీని 2023లో విన్‌ ఫాస్ట్ ఫౌండర్ ఫామ్ నాట్ వువాంగ్ స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ వియత్నాం, మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో విజయవంతంగా రైడ్ హెయిలింగ్ సేవలను అందిస్తోంది. ప్రయాణికులు ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Read Also: ఒక్క అక్షరం మార్చి చలాన్లు తప్పించుకున్నారు.. కానీ, కెమెరాలకు చిక్కి బుక్కైపోయారు!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×