E-Paper
Advertisement

ఏపీలో ‘జనసేన’.. తెలంగాణలో ‘భజనసేన’.. పవన్ కళ్యాణ్ వైఖరిపై సామ నిప్పులు!

ఏపీలో ‘జనసేన’.. తెలంగాణలో ‘భజనసేన’.. పవన్ కళ్యాణ్ వైఖరిపై సామ నిప్పులు!
Advertisement

Sama Rammohan Reddy: తెలంగాణ కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘జనసేన’ పార్టీ పెట్టిన పవన్, తెలంగాణకు వచ్చేసరికి బీజేపీకి వంగిపోతూ ‘భజనసేన’గా మారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రాల సరిహద్దులు మారగానే పవన్ సిద్ధాంతాలు కూడా ఎలా మారిపోతాయని రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై పోరాడుతానని చెబుతున్న పవన్ కళ్యాణ్‌కు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల పెరుగుతున్న ధరలు, దేశవ్యాప్తంగా వస్తున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు ఎందుకు కనిపించడం లేదని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్నా, వాటిపై ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్‌కు కాళ్లు లేవడం లేదా అని ఘాటుగా విమర్శించారు. పొరుగు రాష్ట్రంలో ఒకలా, ఇక్కడ ఇంకోలా వ్యవహరించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.

Advertisement

తెలంగాణ సమాజం అమాయకమైనది కాదని, తప్పుడు రాజకీయాలను ఉపేక్షించదని ఆయన హెచ్చరించారు. ‘ఇది తెలంగాణ జాతి.. ప్రేమగా చూస్తే అమ్మలా ఆదరించడం తెలుసు.. అదే సమయంలో కుట్రలతో వస్తే అమ్మోరులా దహించివేయడమూ తెలుసు’ అంటూ పవన్ కళ్యాణ్ తీరుపై సామ రామ్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Also Read: ఆక్రమణ నిరూపిస్తే ప్రభుత్వానికే రాసిచ్చేస్తా.. రేవంత్ సర్కార్‌కు పవన్ కళ్యాణ్ సవాల్!

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×