గత కొంత కాలంగా భారతీయ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. చాలా కంపెనీలు తక్కువ ధరలో మంచి రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. చాలా మంది పెట్రో ధరలను తట్టుకోలేక, గ్రీన్ ఎనర్జీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువ ధరతో కలిగి ఉండటంతో బడ్జెట్ ధరలో లభించే ఈవీల కోసం వినియోగదారులు వెతుకుతున్నాయి. అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఉజాస్ ఎనర్జీ కంపెనీ. తక్కువ ధరలో చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసింది.
బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఉజాస్ పలు ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చింది. ఉజాస్ ఇగో ఎల్ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కేవలం రూ. 34,880 – రూ. 39,880 (ఎక్స్-షోరూమ్)లో అందిస్తోంది. ఆన్ రోడ్ ధర మరికాస్త ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధరలో మంచి రేంజ్ ను అందిస్తుంది రివర్స్ గేర్, డిజిటల్ మీటర్, కీలెస్ రైడింగ్ లాంటి ఫీచర్లతో వస్తుంది.
⦿ ధర: ఉజాస్ ఇగో లా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.34,880 నుంచి రూ. 39,880 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
⦿ రేంజ్: ఈ స్కూటర్ 1.56 kWh బ్యాటరీతో సుమారు 75 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. 1.248 kWh బ్యాటరీతో 60 కి.మీ రేంజ్ ఇస్తుంది.
⦿ టాప్ స్పీడ్: ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 25 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
⦿ బ్యాటరీ, ఛార్జింగ్: 1.56 kWh సామర్థ్యం గల బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది.
⦿ మోటార్ పవర్: ఈ స్కూటర్ 250 W BLDC హబ్ మోటార్‌ను కలిగి ఉంది.
Read Also: ఏథర్ రిజ్టా vs హోండా యాక్టివా ఇ.. వీటిలో ఏది కొంటే బెస్ట్?
ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. వేగం, బ్యాటరీ ఛార్జింగ్ పర్సంటేజ్ ను చూపిస్తుంది. చక్కటి విజుబులిటీ కోసం LED హెడ్ లైట్లు, టైల్ లైట్లు ఉంటాయి. సులభంగా వెనక్కి తిప్పడానికి రివర్స్ గేర్ ఉంటుంది. కీలెస్ స్టార్ట్, వీల్ లాకింగ్ మెకానిజంను కలిగి ఉంటుంది. ప్రయాణ సమయంలో ఫోన్ ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం మొబైల్ ఛార్జింగ్ USB పాయింట్ ఉంటుంది. బ్రేకింగ్, టైర్ల గురించి పరిశీలిస్తే, ముందు, వెనుక డ్రమ్ బ్రేకులు ఉంటాయి. ట్యూబ్ లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. ఈ స్కూటర్ పలు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. ఇక ఈ స్కూటర్ రోజువారీ తక్కువ దూర ప్రయాణాలకు, సిటీలో తిరగడానికి అనుకూలంగా ఉంటుంది.
Read Also: యమహా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్లొచ్చంటే?