E-Paper
Advertisement

Yamaha EC-06 e-Scooter: యమహా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్లొచ్చంటే?

Yamaha EC-06 e-Scooter: యమహా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్లొచ్చంటే?
Advertisement

యూత్ ను ఆకట్టుకునే బైక్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చే యమహా కంపెనీ తొలిసారి ఇండియన్ మార్కెట్ కు ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది. ఇప్పటికే పలు లీడింగ్ కంపెనీలు ఈవీ విభాగంలోకి అడుగు పెట్టగా తొలిసారి, యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. EC-06 పేరుతో మార్కెట్ కు పరిచయం చేసింది. దీని ధర రూ. 1,67,600 (ఎక్స్-షోరూమ్)గా ప్రకటించింది. బ్లూయిష్ వైట్ సింగిల్ షేడ్‌ లో ఈ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

యమహా EC-06 రేంజ్, టాప్ స్పీడ్

యమహా EC-06  స్కూటర్ ఇంటీరియర్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ తో నడుస్తుంది. ఇది 4kWh ఫిక్స్‌డ్ బ్యాటరీతో యాడ్ చేయబడి ఉంటుంది. 169 కి.మీ సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ 79 కి.మీ గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. 26Nm గరిష్ట టార్క్, 6.7kW పీక్ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. బ్యాటరీ 3 సంవత్సరాలు లేదంటే 30,000 కి.మీ. వారంటీతో వస్తుంది. ఛార్జింగ్‌ ను ప్రామాణిక హోమ్ ప్లగ్ తో చేసుకోవచ్చు. ఫుల్ ఛార్జ్ కు 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

రోజువారీ అవసరాలకు అనుగుణంగా..

Advertisement

యమహా రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఈ స్కూటర్ ను రూపొందించింది. ఎకో, స్టాండర్డ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో పాటు  రివర్స్ మోడ్‌ ను కలిగి ఉంటుంది. సస్పెన్షన్ సాంప్రదాయకంగా ఉంటుంది. ఇండియన్ వీధులకు  అనుకూలంగా ఉంటుంది. హైడ్రాలిక్ డంపర్లతో టెలిస్కోపిక్ ఫ్రంట్ సెటప్, వెనుక కాయిల్ స్ప్రింగ్ ను కలిగి ఉంటుంది. కాంబి బ్రేక్ సిస్టమ్తో రెండు చివర్లలో 200mm డిస్క్‌ బ్రేకింగ్ ను కలిగి ఉంటుంది.

Read Also: హీరో నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే భయ్యా!

మంచి బిల్డ్ క్వాలిటీ

Advertisement

వర్షాల సమయంలో గుంతలు, బురదతో కూడిన ట్రాఫిక్ కారిడార్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లేలా యమహా   మోటార్ బ్యాటరీకి IP67 సర్టిఫికేషన్, ఇతర ఎలక్ట్రానిక్స్‌ కు IP65 సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంటుంది. EC-06 రైడ్ సమాచారం, కనెక్టివిటీ ఫీచర్లతో కలర్ LCD డిస్‌ ప్లేను కలిగి ఉంటుంది.  LED లైటింగ్, Yamaha Motor Connect R అప్లికేషన్ ద్వారా యాప్ ఇంటిగ్రేషన్‌ను కలిగి ఉంటుంది. 24.5 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ రోజువారీ సరుకులను తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది.  యమహా కూడా ఈ స్కూటర్‌ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, ఇండియాలో డెవలప్ చేసింది. త్వరలోనే ఈ స్కూటర్ ను గ్లోబల్ మార్కెట్ లోనూ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Read Also: యమహా నుంచి క్రేజీ స్కూటర్, లాంచింగ్ ఎప్పుడంటే

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×