E-Paper
Advertisement

పెట్రోల్ బండికి గుడ్ బై చెప్పే టైమ్ వచ్చేసింది!ఒక్కసారి ఛార్జ్ చేస్తే 261 కి.మీ. ఓలా, ఏథర్ పునాదులు కదిలిపోవాల్సిందేనా?

పెట్రోల్ బండికి గుడ్ బై చెప్పే టైమ్ వచ్చేసింది!ఒక్కసారి ఛార్జ్ చేస్తే 261 కి.మీ. ఓలా, ఏథర్ పునాదులు కదిలిపోవాల్సిందేనా?
Advertisement

Tesseract Scooter: పెట్రోల్ బంక్‌ ల వైపు చూడాలంటే భయపడిపోయే ఈ రోజుల్లో బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ అల్ట్రావయోలెట్ ఓ క్రేజీ
చార్జింగ్ స్కూటీని మార్కెట్లోకి తెచ్చేసింది.అదే ‘టెసరాక్ట్'(Tesseract)ఎలక్ట్రిక్ స్కూటీ.చూడ్డానికి ‘స్పేస్ షిప్’ లా ఉండే ఈ స్కూటీ ఇపుడు పాతుకుపోయిన ఫేమస్ కంపెనీలనే సవాల్ చేయడం విశేషం.మరి అంతంగా అట్రాక్ట్ చేస్తున్నఈ స్కూటీ యొక్క విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఇప్పటిదాకా ఒక లెక్క ..ఇప్పటి నుండి ఒక లెక్క

Advertisement

మాములుగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అంటే చాలా స్లోగా వెళ్తాయనే సంగతి మనము తెల్సిందే, కాని ఇప్పటిదాకా ఒక లెక్క ..ఇప్పటి నుండి ఒక లెక్క అంటు ఈ చార్జింగ్ స్కూటీ కేవలం 2.9 సెకన్లలోనే 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకోవడం విశేషం. కారణం ఎంటంటారా..ఇందులో అమర్చిన 20 HP ఎలక్ట్రిక్ మోటార్ ఒక బీస్ట్‌లా పనిచేయడమే.అంటే సిగ్నల్ దగ్గర గ్రీన్ లైట్ పడగానే, పక్కన ఉన్న పెట్రోల్ బైక్ స్టార్ట్ అయ్యేలోపే మీ’టెసరాక్ట్’ తో హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళిపోవచ్చన్న మాట.

ఏకంగా 261 కిలోమీటర్ల రేంజ్

Advertisement

ఇక ఎవరైనా స్కూటర్ కొనే ముందు అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా..?ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది అని. ఎందుకంటే చార్జింగ్ స్కూటర్స్ మహా అయితే వంద దాటవు అన్న నమ్మకం ఇప్పటి దాకా ఉండటమే. కానీ ఒక్క సారి నన్ను చార్జ్ చేసే అస్సలు ఆగను అంటూ టెసరాక్ట్ టాప్ వేరియంట్ ఏకంగా 261 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్ళడం విశేషం. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు నాన్ స్టాప్ గా ఒక్క సారి ఛార్జింగ్‌ చేస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చన్న మాట! సో ఛార్జింగ్ కోసం గంటల తరబడి వెయిట్ చేసే పనే లేదు.పైగా ఇది కేవలం 30 నిమిషాల్లో 80% బ్యాటరీ ఫుల్ అయిపోతుంది కూడా.అంటే మీరలా ఒక టీ కొట్టి వచ్చేసరికి మీ బండి రెడీ అయిపొయింది.

also read:ఒకరికి హిట్టు లేదు.. మరొకరికి ఫామ్ లేదు! అయ్యగారికి మళ్లీ ‘ఏజెంట్’ రిపీట్ అవుతుందా ?

ఏకంగా 34 లీటర్ల స్టోరేజ్ స్పేస్

ఇక దీంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటో తెలుసా ..? స్కూటర్ స్టార్ట్ చేయాలన్నా, సీటు ఓపెన్ చేయాలన్నా కీ అసలు అవసరం లేదు. ఇపుడంతా స్మార్ట్ ఫోన్ మయం. మొత్తానికి కనెక్టివిటీ ఓ రేంజ్ లో ఇచ్చారు.ఇక మొబైల్ ఫోన్ చార్జింగ్ పెట్టుకోవాలంటే స్కూటర్లోనే వైర్‌లెస్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారండోయ్. అంటే బండి నడుపుతూనే మీ మొబైల్‌ను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసుకోవచ్చన్న మాట.ఇక సీటు కిందే ఏకంగా 34 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం మరో విశేషం.ఇక ఇదే స్పేస్ లోరెండు హెల్మెట్లు లేదా ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్ ఈజీగా పెట్టేయొచ్చు.పైగా హై స్పీడ్ లో యమా జోరుగా
వెళ్తున్నప్పుడు సడన్ బ్రేక్ వేసినా బండి స్కిడ్ అవ్వకుండా ABS (Anti-lock Braking System) ను అందించడం ఇంకో హైలెట్.

క్రేజీగా పార్కింగ్ అసిస్టెంట్ ఫీచర్

ఇక అప్పుడప్పుడు ఇరుకైన సందుల్లో బండిని పార్క్ చేయాల్సి వస్తుంది కూడా,అందుకోసం ఇందులో క్రేజీగా పార్కింగ్ అసిస్టెంట్ ఫీచర్ ని జోడించింది అల్ట్రావయోలెట్. ఇక ఇంత గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ టెసరాక్ట్ త్వరలో మార్కెట్‌ను ఏలుతున్న ఓలా (Ola), ఏథర్ (Ather) వంటి కంపెనీలకు గట్టి సవాల్ నే ఇస్తుందనడం లో ఆశ్చర్యమే లేదు.మరి ఇన్ని ఫీచర్లతో వస్తున్న ఈ టెసరాక్ట్ ఎన్ని లక్షలుంటుందో అని ఆలోచిస్తున్నారా …అక్కడే మరి అల్ట్రావయోలెట్ అందరికి షాక్ ఇచ్చేది. అవును ..సాలిడ్ టెక్నికల్ సౌండ్ తో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటీ జస్ట్
రూ. 1.2 లక్షల నుండి రూ. 1.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకే అందుబాటులోకి రావడం విశేషం .

ఈ టెసరాక్ట్ మీద ఒక కన్నేసి ఉంచండి

సో ..మేక్ ఇన్ ఇండియా కాన్ సెప్ట్ తో వస్తున్న ఇలాంటి మేడ్ ఇన్ బెంగళూరు స్టార్టప్స్ ని మనమూ ఎంకరేజ్ చేద్దాం. ఇక ఇప్పటికైనా మీరు ఓ సరికొత్త ఈవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఈ టెసరాక్ట్ మీద ఒక కన్నేసి ఉంచండే !

also read:ఫ్రిజ్‌లో ఈ బాటిల్స్ వాడుతున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×