Akhil Maruthi:‘తాను దూర సందులేదు మెడకేమో డోలా ‘అన్నట్టుగా ఉంది అఖిల్ వ్యవహారం. అవును..అక్కినేని లాంటి సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన అఖిల్ ఒకటి , రెండు కాదు.. ..అఖిల్(2015),హలో(2017),మిస్టర్ మజ్ను(2019),మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్(2021),ఏజెంట్(2023) అంటూ ఏకంగా దాదాపు అరడజను సినిమాలు చేసినా ఒక్కటి సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోయింది.ఇక ఇప్పుడు మురళీ కృష్ణ అబ్బురు డైరెక్షన్ లో తన ఆరో సినిమాగా ‘లెనిన్’ ని పట్టాలెక్కించాడు. చూస్తుంటే ఇదేదో హిట్ అయ్యేలానే కనిపిస్తుంది కూడా.
అఖిల్ – మారుతి కాంబోలో సినిమా
ఇదిలా ఉంటె తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న ఓ క్రేజీ న్యూస్ అక్కినేని అభిమానుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తుంది. అదే అఖిల్ – మారుతి కాంబోలో ఒక సినిమా వస్తుందని.నిజానికి మారుతి ఒకప్పుడు ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ అంటూ చిన్న సినిమాలైనా సాలిడ్ హిట్స్ డెలివర్ చేసినవాడే.కానీ పెద్ద హీరోల దగ్గరికి వచ్చేసరికే ఆ మ్యాజిక్ చూపించలేకపోయాడు.ముఖ్యంగా ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ తో ‘ది రాజాసాబ్’లాంటి కిచిడీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడి మీమర్స్ కి మంచి స్టఫ్ అయిపోయాడు.
అయ్యగారి కెరీర్ అసలే ఐసీయూలో
ఈ టైంలో అసలే హిట్స్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న అఖిల్ తో ‘మారుతి సినిమా’ అన్న న్యూస్ రాగానే మా అయ్యగారి కెరీర్ అసలే ఐసీయూలో ఉంది..ఈ టైంలో సినిమా వద్దు బాబోయ్ అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.గతంలో ఇదే అక్కినేని హీరో నాగచైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే సినిమా తీస్తే కమర్షియల్‌గా యావరేజ్ అనిపించుకున్నా, అక్కినేని ఫ్యాన్స్‌కు మాత్రం అది ఒక ‘నైట్ మేర్’ లా అయిపొయింది.దీంతోమారుతి మార్కు కామెడీ అక్కినేని హీరోల క్లాస్ ఇమేజ్‌కి అస్సలు సెట్ కావని అప్పట్లోనే ప్రూవ్ అయ్యింది.ఇపుడు మరో సారి అఖిల్ తో సినిమా అంటే అంతకు మించిన అట్టర్ ప్లాప్ పక్కా అంటూ భయపడిపోతున్నారంతా.
మారుతి చెప్పిన ఒక లైన్ అఖిల్‌కు నచ్చిందా..
అయితే ఇప్పటికే వీరిద్దరి మధ్య రెండు మూడు సార్లు సిట్టింగ్స్ జరిగాయని, మారుతి చెప్పిన ఒక లైన్ అఖిల్‌కు నచ్చిందని ,దీనిపై త్వరలో అనౌన్స్ మెంట్ కూడా రానుందన్న టాక్ వినిపిస్తుంది.మన అయ్యగారు గతంలో ఇలాగే సురేందర్ రెడ్డి, విక్రమ్ కుమార్ లాంటి స్టైలిష్ డైరెక్టర్లను నమ్మి బొక్కబోర్లా పడ్డాడు,. ఇక ఇప్పుడు మాస్ అండ్ కామెడీ డైరెక్టర్ అయిన మారుతిని నమ్మడం అంటే కెరీర్ కి ఎండ్ కార్డ్ వేసుకున్నట్టే అన్న టాక్ వినిపిస్తుంది .
అయ్యగారు కోలుకోవడం ఇప్పట్లో కష్టమే..
ఏది ఏమైనా అఖిల్ కెరీర్ ఇపుడు డిసైడింగ్ స్టేజ్ లో ఉంది, లెనిన్ ఏ మాత్రం హిట్ అయినా తర్వాత వచ్చే సినిమా అతన్ని తిరుగులేని హీరోగా నిలబెట్టాలి. అలా కాకుండా ఏ మాత్రం బాక్సాఫీస్ వద్ద తేడా కొట్టినా అయ్యగారు కోలుకోవడం ఇప్పట్లో కష్టమే. మరి ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగానే పట్టాలెక్కుతుందా? లేక ఫ్యాన్స్ గోల చూసి అయ్యగారు వెనక్కి తగ్గుతాడా? వేచి చూడాల్సిందే !
also read:కిరణ్ అబ్బవరం..’నెక్స్ట్ లెవల్’ ప్లానా లేక కెరీర్ క్లోజింగ్ సీనా?