E-Paper
Advertisement

3 నిమిషాల్లో ఆటో స్కూటర్‌ అవుతుంది, ఇదేం టెక్నాలజీ భయ్యా!

3 నిమిషాల్లో ఆటో స్కూటర్‌ అవుతుంది, ఇదేం టెక్నాలజీ భయ్యా!
Advertisement

Hero Surge S32: దేశీ ఆటోమొబైల్ రంగంలో హీరో మోటోకార్ప్ సరికొత్త ఆవిష్కరణ చేసింది. ఈ కంపెనీ సర్జ్ S32 పేరుతో క్రేజీ వెహికల్ ను రూపొందించింది. ఇది సాధారణ ఎలక్ట్రిక్ వెహికల్ లా కాకుండా, ఒకేసారి ఆటో రిక్షా, స్కూటర్‌గా పని చేస్తుంది. 2 ఇన్ 1 కన్వర్టిబుల్ వాహనంగా మార్కెట్ కు పరిచయం చేసింది. దేశంలో ఇలాంటి కాన్సెప్ట్‌ తో తొలి వాహనం ఇదే కావడం విశేషం.

సర్జ్ S32 ప్రత్యేకత ఏమిటంటే?

సర్జ్ S32 కేవలం 3 నిమిషాల్లో 3 చక్రాల ఆటో నుంచి 2 చక్రాల స్కూటర్‌ గా మారిపోతుంది. ఇలా కన్వర్ట్ చేసేందుకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. డ్రైవర్ అవసరానికి అనుగుణంగా వాహనాన్ని సులభంగా మార్చుకోవచ్చు. ఒకవేళ సరుకులు తీసుకెళ్లాలనుకుంటే ఆటో రిక్షా మోడ్‌ లో ఉపయోగించుకోవచ్చు. వ్యక్తిగత ప్రయాణం కోసం అయితే అదే వాహనాన్ని స్కూటర్‌ గా మార్చి యూజ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్కూటర్ ముందు భాగం ఆటో రిక్షా క్యాబిన్‌ గా పని చేస్తుంది. అవసరానికి అనుగుణంగా దీనిని విడదీయడం, కలిపేయడం చెయ్చొచ్చు. ఈ విధమైన కన్వర్టిబుల్ టెక్నాలజీ భారతీయ మార్కెట్‌ లో కొత్తదిగా చెప్పుకోవచ్చు.

సర్జ్ S32 పనితీరు..

Advertisement

ఇక పవర్, పనితీరు విషయానికి వస్తే, ఈ వెహికల్ S32 12 kWh బ్యాటరీ ప్యాక్‌ తో వస్తుంది. ఇది త్రీ వీలర్ గా ఉపయోగించినప్పుడు సుమారు 500 కిలోల వరకు లోడును మోస్తుంది.  ఇది చిన్న వ్యాపారులకు, డెలివరీ అవసరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే సమయంలో స్కూటర్‌ గా మార్చినప్పుడు  ఈజీగా నడిపేలా ఉంటుంది.  ఈ వెహికల్ ను భవిష్యత్ మొబిలిటీకి అనుకూలంగా రూపొందించారు. పెరుగుతున్న కాలుష్యం, ఫ్యూయెల్ ఖర్చుల మాదిరి సమస్యలను దృష్టిలో పెట్టుకుని దీనిని తయారు చేశారు. ఒకే వాహనం రెండు విధాల ఉపయోగం ఉండటం వల్ల ఖర్చు  తగ్గుతుంది, వినియోగం సులభమవుతుంది.

ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?

సర్జ్ S32 చిన్న వ్యాపారులు, డెలివరీ ఏజెన్సీలు, రోజువారీ ప్రయాణికులకు ఉపయోగపడేలా రూపొందించబడింది. ఉదయం సరుకులు రవాణా చేసి, సాయంత్రం వ్యక్తిగత ప్రయాణానికి స్కూటర్‌ గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ ఫ్లెక్సిబిలిటీ వాహనాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.  హీరో సర్జ్ S32 భారతీయ మార్కెట్‌లో ఫ్యూచర్ మొబిలిటీలో కీలక ముందడుగు కాబోతోంది. త్వరలోనే ఈ వెహికల్ మార్కెట్ లోకి అడుగు పెట్టే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

Advertisement

Read Also: ఎలక్ట్రిక్ vs పెట్రోల్ స్కూటర్.. ఏది కొంటే సేవింగ్ ఎక్కువ?

Read Also: ఈవీ కార్లకూ యుద్ధం దెబ్బ.. ఆగిన ఉత్పత్తి, ఇప్పట్లో కొనలేమట.. ఎందుకంటే?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×