E-Paper
Advertisement

అల్ట్రావైలెట్ టెసరాక్ట్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!

అల్ట్రావైలెట్ టెసరాక్ట్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Advertisement

అల్ట్రావైలెట్  ఆటోమోటివ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టెసరాక్ట్‌ తో భారత మార్కెట్లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌ లతో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తొలిసారిగా ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ స్కూటర్ 2026 మిడ్ ఇయర్ లో మార్కెట్లో అమ్మకానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యలంలో ఈ స్కూటర్ కు సంబంధించి కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ అల్ట్రావైలెట్ టెసరాక్ట్ ధర

అల్ట్రావైలెట్ టెసరాక్ట్ ప్రారంభ ధర సుమారు రూ.1.45 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. అయితే, కంపెనీ ప్రారంభ ఆఫర్‌ గా కొంతమంది కస్టమర్లకు తక్కువ ధరలో అందించనుంది.  మొదట 10,000 మంది వినియోగదారుల కోసం ప్రత్యేక ధరను ప్రకటించగా, తర్వాత దాన్ని 50,000 మంది వరకు విస్తరించింది.

⦿ అల్ట్రావైలెట్ టెసరాక్ట్ ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ

Advertisement

ఈ స్కూటర్‌ లోపవర్ ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్‌ ను అందిస్తున్నారు. ఇది గరిష్టంగా 21 bhp పవర్‌ ను ఉత్పత్తి చేస్తుంది. పనితీరు పరంగా చూస్తే, కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 261 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ రేంజ్ బ్యాటరీ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. టెసరాక్ట్ మూడు బ్యాటరీ ఆప్షన్‌లలో అందుబాటులోకి రానుంది. ఇందులో 3.5kWh, 5kWh, 6kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. వినియోగదారులు తమ అవసరానికి సరిపడే వేరియంట్‌ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

⦿ అల్ట్రావైలెట్ టెసరాక్ట్ ఫీచర్లు

ఈ స్కూటర్‌ లో  ఆధునిక టెక్నాలజీని ఉపయోగించారు. బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్‌ టేక్ అలర్ట్, కొలిజన్ అలర్ట్ లాంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉంటాయి. డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్స్, పెద్ద TFT టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లే, కనెక్టివిటీ ఫీచర్లు, రైడ్ అనలిటిక్స్ కూడా అందించనున్నారు. దీంట్లో కీలెస్ యాక్సెస్, హిల్ హోల్డ్, పార్క్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్లు సాధారణ స్కూటర్లలో అరుదుగా కనిపిస్తాయి.

⦿ అల్ట్రావైలెట్ టెసరాక్ట్ డిజైన్

Advertisement

డిజైన్ పరంగా కూడా టెసరాక్ట్ చాలా భిన్నంగా కనిపిస్తుంది. యుద్ధ హెలికాప్టర్ల నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌ తో దీనిని రూపొందించారు. షార్ప్ బాడీ లైన్స్, ఏరోడైనమిక్ ఆకారం, స్టైలిష్ LED లైట్లు దీన్ని మరింత స్పోర్టీగా కనిపించేలా చేస్తున్నాయి. డెసర్ట్ సాండ్, సోనిక్ పింక్, స్టెల్త్ బ్లాక్ లాంటి కల్స్ లో అందుబాటులోకి రానుంది. సీటు కింద 34 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంటుంది.

భద్రత విషయంలో కూడా ఈ స్కూటర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోనుంది. ఇంటిగ్రేటెడ్ రాడార్ టెక్నాలజీతో వచ్చే తొలి భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్‌ గా నిలవనుంది. ముందు, వెనుక కెమెరాలు డాష్‌ క్యామ్‌ లా పనిచేసి రికార్డింగ్ ఫీచర్‌ ను అందిస్తాయి.

Read Also: హోండా అడ్వెంచర్ స్కూటర్ వచ్చేస్తోంది.. హీరో జూమ్, ఏరాక్స్‌కు చుక్కలే!

Related News

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×