E-Paper
Advertisement

బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి కొబ్బరి నీళ్లు తాగే సరైన సమయం ఇదే!

బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి కొబ్బరి నీళ్లు తాగే సరైన సమయం ఇదే!
Advertisement

Coconut Water Benefits: కొబ్బరి నీళ్లు ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం. ముఖ్యంగా ఎండకాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి చాలామంది వీటిని తాగుతుంటారు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అయితే, కొబ్బరి నీళ్లను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కొన్ని నిర్దిష్ట సమయాల్లో తాగడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం ఖాళీ కడుపుతో తాగితే..

ఉదయాన్నే పరగడుపున కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీవక్రియలు చురుగ్గా మారుతాయి. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చక్కటి సమయం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.

Advertisement

Also Read: ఈ పిచ్చి ఎండలకు వడదెబ్బ తగలకూడదంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తాగాల్సిందే!

వ్యాయామానికి ముందు, తర్వాత..

కృత్రిమ ఎనర్జీ డ్రింక్స్‌కు బదులు కొబ్బరి నీళ్లను సహజ సిద్ధమైన స్పోర్ట్స్ డ్రింక్‌గా వాడుకోవచ్చు. వర్కవుట్స్‌కు అరగంట ముందు తాగితే శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత తాగడం వల్ల చెమట రూపంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను శరీరం తిరిగి పొందుతుంది. ఇది కండరాల అలసట, నీరసాన్ని త్వరగా తగ్గిస్తుంది.

భోజన సమయాల్లో..

Advertisement

మధ్యాహ్నం లేదా రాత్రి భోజనానికి అరగంట ముందు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగి, ఎక్కువగా తినకుండా ఉంటారు. ఇది క్యాలరీల నియంత్రణకు, బరువు తగ్గడానికి సాయపడుతుంది. అదేవిధంగా.. తిన్న తర్వాత తాగితే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలు దరిచేరవు.

రాత్రి పడుకునే ముందు..

రోజంతా పనులతో అలసిపోయిన వారికి రాత్రి పూట కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులోని ఖనిజాలు రాత్రంతా రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు ప్రశాంతమైన నిద్రకు తోడ్పడతాయి. గర్భిణీలు కూడా వైద్యుల సలహాతో వీటిని తీసుకోవడం వల్ల అలసట, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సూచన మేరకే వీటిని తాగాలి.

Also Read: ఎండల తీవ్రతకు ఐస్ క్రీమ్స్ లాగించేస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×