E-Paper
Advertisement

Car Tyre Codes: టైర్ల మీది నెంబర్ల వెనుక ఇంత కథ ఉందా? ఇన్నాళ్లు తెలియదే!

Car Tyre Codes: టైర్ల మీది నెంబర్ల వెనుక ఇంత కథ ఉందా? ఇన్నాళ్లు తెలియదే!
Advertisement

Car Tyre Codes Explained: కారు, బైక్, ఇతర వెహికల్స్ టైర్ల మీద నెంబర్లు, లెటర్లు కనిపిస్తాయి. అయితే, వాటి గురించి చాలా మందికి తెలియదు. ఆ నెంబర్స్ ఏం చెప్తాయి? అక్షరాలు ఏం వివరిస్తాయి? అనేది ఆలోచించరు. కానీ, నిజానికి అవి చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. టైరు ఎంత వేగాన్ని తట్టుకోగలదు? ఎంత బరువును మోయగలదు? మీ వాహనానికి సరిపోతుందా? లేదా? అనే కీలక వివరాలను వెల్లడిస్తాయి. అందుకే, ప్రతి వాహనదారుడికి ఆ టైర్ల మీద ఉండే అక్షరాలు, నెంబర్ల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఇంతకీ ఆ నెంబర్లు, అక్షరాల వెనుక అసలు కథ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

టైర్ స్పీడ్ గురించి చెప్పే అక్షరాలు ఇవే!

ముందుగా టైరు స్పీడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి టైరు చివర ఒక అక్షరం ఉంటుంది. దాన్నే స్పీడ్ రేటింగ్ అంటారు. ఇది ఆ టైరు ఎంత వేగంతో వెళ్తుందో సూచిస్తుంది. సాధారణంగా టైర్ మీద S అనే అక్షరం ఉంటే, గంటకు 180 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. H అని ఉంటే 210 కి.మీ వరకు వెళ్లొచ్చు. ఒకవేళ V అని ఉంటే 240 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే, కచ్చితంగా అంత వేగంతో వెళ్లాలని కాదు. ఆ పరిధికి మించి వెళ్లకూడదని సూచిస్తాయి.

టైర్ కోడ్ గురించి తెలుసుకుందాం..

Advertisement

ఎగ్జాంఫుల్ గా ఓ టైర్ మీద 195/55 R16 87V అనే కోడ్ ఉందనుకుందాం. పూర్తిగా చూస్తే కాస్త కాంప్లెక్స్‌ గా కనిపించినా, భాగాలుగా విడగొడితే చాలా సులభంగా అరం చేసుకునే అవకాశం ఉంటుంది.

మొదటి సంఖ్య 195 అనేది టైర్ వెడల్పు గురించి చెప్తుంది. అంటే టైర్ ఎన్ని మిల్లీమీటర్లలో ఉందనేవి వివరిస్తుంది. వెడల్పు ఎంత ఎక్కువగా ఉంటే రోడ్డుపై గ్రిప్ అంత బాగుంటుంది. అందుకే స్పోర్ట్స్ కార్లలో ఎక్కువ వెడల్పుగా ఉండే టైర్లు వాడుతారు. ఆ తర్వాత ఉన్న 55 అనే సంఖ్య  యాస్పెక్ట్ రేషియో. అంటే.. టైరు ఎత్తు, దాని వెడల్పుతో పోలిస్తే ఎంత శాతం ఉందో చూపిస్తుంది. ఇది తక్కువగా ఉంటే టైరు సైడ్‌ వాల్ చిన్నగా ఉంటుంది. వెహికల్ హ్యాండ్లింగ్ మెరుగవుతుంది.

Advertisement

ఇక ఆ తర్వాత ఉన్న R  అనేది టైరు నిర్మాణ రకాన్ని సూచిస్తుంది. ఇది రేడియల్ టైరు అని అర్థం. ఇప్పుడు చాలా మంది వీటినే ఎక్కువగా వాడుతున్నారు.  ఎందుకంటే, ఇవి చాలా మన్నికగా, కంఫర్ట్ గా ఉంటున్నాయి. ఆ తర్వాత ఉన్న 16 రిమ్ సైజు. అంటే ఈ టైరు 16 అంగుళాల వీల్‌ కు సరిపోతుంది. ఇది తప్పనిసరిగా వెహికల్  రిమ్‌ కు మ్యాచ్ అవ్వాలి.  87 అనేది లోడ్ ఇండెక్స్. అంటే ఒక్క టైరు ఎంత బరువు మోయగలదో చెబుతుంది. ఉదాహరణకు 87 అంటే సుమారు 545 కిలోల వరకు మోయగలదు. చివరిగా V అంటే స్పీడ్ రేటింగ్. ఇది టైరు గరిష్ట వేగ సామర్థ్యాన్ని  సూచిస్తుంది.

టైర్ల  P, LT, ST లెటర్స్ ఏం చెప్తాయంటే?

టైర్లపై మరికొన్ని గుర్తులు కూడా ఉంటాయి. బాణం గుర్తు ఉంటే అది టైరు ఏ దిశలో అమర్చాలో సూచిస్తుంది.  అలాగే P, LT, ST లాంటి అక్షరాలు వెహికల్ రకాన్ని సూచిస్తాయి. P అంటే ప్యాసింజర్ వాహనాలకు, LT అంటే లైట్ ట్రక్కులకు ఉపయోగిస్తారు.

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×