World Car Awards 2026: ఈ ఏడాది ఏప్రిల్ 1న న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో వరల్డ్ కార్ అవార్డ్స్ వేడుక జరగనుంది. ఈ అవార్డుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటో కంపెనీలు తమ మోడల్స్ ను పంపించాయి. జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకు షార్ట్ లిస్ట్ వచ్చేసింది. మొత్తంగా మూడు కార్లను ఫైనల్ కు ఎంపిక చేశారు. ఈ మూడు కార్లు ప్రస్తుతం వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ ఫైనలిస్టులో ఉన్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవి? ఏ కారు విన్నర్ గా నిలిచే అవకాశం ఉంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ ఫైనల్ లిస్టులో BMW iX3, హ్యుందాయ్ పాలిసేడ్, నిస్సాన్ లీఫ్ నిలిచాయి. వీటిని 33 దేశాల నుంచి ఆటోమోటివ్ జర్నలిస్టులతో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. ఈ అవార్డులలో మొత్తం మొత్తం ఆరు విభాగాలు ఉన్నాయి. ఒక్కో విభాగంలో మూడు ఫైనల్ కార్లు ఉంటాయి. విజేతలను ఏప్రిల్ 1 ప్రకటించనున్నారు.
వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ ఫైనలిస్టులో BMW iX3, నిస్సాన్ లీఫ్, హ్యుందాయ్ పాలిసేడ్ లో ఉన్నాయి. iX3 ప్రీమియం ఆఫర్ గా నిలువగా, లీఫ్ EV స్పెక్ట్రం తక్కువ ధరలో లభిస్తుంది. ఈ రెండు ఈవీలు కాగా, పాలిసేడ్ పెట్రోల్ వెర్షన్ కారు. ఇది హ్యుందాయ్ యొ మూడు వరుసల SUV. ఇది ఫ్యామిలీ కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ కలిగి ఉంది.
⦿ వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్: BMW iX3, మెర్సిడెస్ బెంజ్ CLA EV, నిస్సాన్ లీఫ్ పోటీ పడుతున్నాయి. వీటిలో BMW, నిస్సాన్ EVలు కాగా, మెర్సిడెస్ బెంజ్ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా ఉంది. CLA పూర్తిగా ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ మీద తయారు చేశారు. లీఫ్ పెట్రో వెర్షన్ లో అందుబాటులో ఉంది. గ్లోబల్ పోర్ట్ ఫోలియోలో నిస్సాన్ అత్యంత సరసమైన కారుగా గుర్తింపు తెచ్చుకుంది.
⦿ వరల్డ్ లగ్జరీ కార్: కాడిలాక్ విస్టిక్, లూసిడ్ గ్రావిటీ, వోల్వో ES90 కార్లు ఈ విభాగంలో పోటీ పడుతున్నాయి. కాడిలాక్ విస్టిక్, లూసిడ్ గ్రావిటీ రెండూ ప్రపంచ EV మార్కెట్ లో లగ్జరీ కార్లుగా కొనసాగుతున్నాయి. మూడు వరుసల SUVలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. GM 400 వోల్ట్ ఆర్కిటెక్చర్, 102kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. గ్రావిటీ 926 వోల్ట్ ఆర్కిటెక్చర్, 123kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ES90 కారు 800 వోల్ట్ ప్లాట్‌ఫారమ్ వీద వోల్వో ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ సెడాన్ గా రూపొందింది.
⦿ వరల్డ్ పర్ఫార్మెన్స్ కారు: BMW M2 CS, చేవ్రొలెట్ కొర్వెట్ E-రే, హ్యుందాయ్ అయోనిక్ 6 N కార్లు ఈ రేసులో నిలిచాయి. BMW M2 CS 3.0 లీటర్ ట్విన్ టర్బో ఇన్‌లైన్ సిక్స్ తో 530hp పవర్, 650Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. షెవ్రొలెట్ కొర్వెట్ E-రే 6.2-లీటర్ V8ని ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి 655hpని ఉత్పత్తి చేస్తుంది. 2025 గుడ్ వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో ఆవిష్కరించబడిన ప్యూర్ ఎలక్ట్రిక్ హ్యుందాయ్ అయోనిక్ 6 N 84kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 650hp పవర్, 770Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
⦿ వరల్డ్ అర్బన్ కార్: బావోజున్ యెప్ ప్లస్/చెవ్రోలెట్ స్పార్క్ EUV, NIO ఫైర్‌ఫ్లై, హ్యుందాయ్ వెన్యూ పోటీ పడుతున్నాయి. ప్యూర్ ఎలక్ట్రిక్ బావోజున్ యెప్ ప్లస్, షెవ్రొలెట్ స్పార్క్ EUVలు ఒకే మోడల్ అయినా ప్రత్యేక మార్కెట్లలో అమ్ముడవుతున్నాయి. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVలు 42kWh బ్యాటరీ ప్యాక్‌ను పంచుకుంటాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ SUVలతో పాటు NIO Firefly ఉంది. చైనీస్ బ్రాండ్ ద్వారా లైఫ్‌స్టైల్ EVగా మార్కెట్ లో అందుబాటులో ఉంది. 4-మీటర్ల పొడవైన హ్యాచ్ బ్యాక్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2025 చివరిలో భారతదేశంలో ప్రారంభించబడిన హ్యుందాయ్ వెన్యూ కూడా ఈ సంవత్సరం వరల్డ్ అర్బన్ కార్ అవార్డుకు పోటీలో ఉంది.
⦿ వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్: ఈ విభాగంలో కియా PV5, మాజ్డా 6e/EZ-6, వోల్వో ES90 పోటీ పడుతున్నాయి. ఫిబ్రవరి 2025లో ఆవిష్కరించబడిన కియా PV5 అనేది మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ బియాండ్ వెహికల్ (PBV) ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడిన ఎలక్ట్రిక్ MPV. ఇది ప్యాసింజర్, కార్గో వెర్షన్లలో అందుబాటులో ఉంది. మాజ్డా EZ-6/6e సెడాన్ ఎలక్ట్రిక్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్‌ల తో అందించబడుతుంది. వోల్వో ES90 ఎలక్ట్రిక్ సెడాన్ కూడా ‘వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు పోటీ పడుతోంది.
Read Also: మారుతి 800ను లంబోర్గినిగా మార్చేశాడు, ఈ మెకానిక్ క్రియేటిటీ పీక్స్ అంతే!