E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్ తో 830 కి.మీ రేంజ్.. ఇది ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు!

సింగిల్ ఛార్జ్ తో 830 కి.మీ రేంజ్.. ఇది ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు!
Advertisement

World’s Longest-Range Electric Car: ప్రపంచ వ్యాప్తంగాఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ రోజు రోజుకు వేగంగా విస్తరిస్తోంది. చాలా కంపెనీలు ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్ల మీద ఫోకస్ పెట్టాయి. ఇంచుమించు ఒకే ఛార్జ్ తో 600 కిలో మీటర్ల వరకు రేంజ్ ఇచ్చే ఈవీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు ఏది? అనే ప్రశ్న ఎప్పుడైనా తలెత్తిందా? అయితే, ఇప్పుడు దానికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఒకే ఛార్జ్ తో 830 కి.మీ రేంజ్  

ప్రపంచంలో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారుగా గ్రాండ్ టూరింగ్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 830 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఎక్కువ రేంజ్, అత్యధిక వేగం, లగ్జరీ ఫీచర్లతో ఈ కారు ప్రపంచ వ్యాప్తంగా EV మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది.

Advertisement

ధర ఎంత?

అమెరికా మార్కెట్లో ఈ కార్ ప్రారంభ ధర సుమారు 1.1 లక్షల డాలర్లు. అంటే భారత  కరెన్సీలో దాదాపు రూ. 92 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఉంటుంది. దిగుమతి పన్నులు, కస్టమ్స్ ఛార్జీలు కలిస్తే భారత్‌ లో ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కారు భారత మార్కెట్లో అధికారికంగా అందుబాటులో లేదు.

అంత రేంజ్ ఎలా సాధ్యమైంది?

Advertisement

లూసిడ్ ఎయిర్ గ్రాండ్ టూరింగ్ లో 112 kWh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. అత్యంత పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ టెక్నాలజీ, తక్కువ ఎయిర్ రెసిస్టెన్స్ కలిగిన ఏరోడైనమిక్ డిజైన్ కారణంగా ఈ కారు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. దీని డ్రాగ్ కోఎఫిషియెంట్ చాలా తక్కువగా ఉండటం కూడా రేంజ్ పెరగడానికి కారణం. ఈ కారు 900V ఆర్కిటెక్చర్ ఆధారంగా పనిచేస్తుంది. ఫాస్ట్ DC ఛార్జర్ ఉపయోగిస్తే కేవలం 20 నిమిషాల్లోనే వందల కిలోమీటర్ల రేంజ్ పొందే అవకాశం ఉంటుంది. దీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

వేగం, పనితీరు గురించి..

ఈ లగ్జరీ EV  కేవలం 3 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠ వేగం గంటకు 270 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. డ్యూయల్ మోటార్ AWD వ్యవస్థ వల్ల హైవేపై అద్భుతమైన స్టెబిలిటీ, వేగవంతమైన యాక్సిలరేషన్ లభిస్తాయి.

ఈ కారు ప్రత్యేక ఫీచర్లు

ఈ కారులో 34 ఇంచుల భారీ కర్వ్డ్ డిజిటల్ డిస్‌ ప్లే ఉంటుంది. ప్రీమియం లగ్జరీ ఇంటీరియర్, అడ్వాన్స్‌ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, OTA సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్స్, గ్లాస్ కానోపీ రూఫ్, బెస్ట్ సౌండ్ సిస్టమ్ తో పాటు కారు లోపల స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ముందు, వెనుక ప్రయాణికులకు ప్రీమియం సెడాన్ అనుభూతిని అందించేలా డిజైన్ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా EV కంపెనీలు ఎక్కువ రేంజ్ కోసం పోటీ పడుతున్న సమయంలో లూసిడ్ ఎయిర్ గ్రాండ్ టూరింగ్ అత్యధిక దూరం ప్రయాణించే కార్లలో ఒకటిగా నిలిచింది.  ఈకారు ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూపించే మోడల్‌ గా లూసిడ్ ఎయిర్ గ్రాండ్ టూరింగ్ ఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు చెప్తున్నారు.

Read Also: బేయాన్ To క్రెటా హైబ్రిడ్.. సామాన్యుల కోసం హ్యుందాయ్ కార్లు రెడీ!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×