E-Paper
Advertisement

బేయాన్ To క్రెటా హైబ్రిడ్.. సామాన్యుల కోసం హ్యుందాయ్ కార్లు రెడీ!

బేయాన్ To క్రెటా హైబ్రిడ్.. సామాన్యుల కోసం హ్యుందాయ్ కార్లు రెడీ!
Advertisement

Upcoming Hyundai Cars 2026-27: భారత మార్కెట్లో హ్యందాయ్ మోటార్.. అద్భుతమైన ఫీచర్లు ఉన్న కార్లను అందిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే, ఇటీవల టాటా, మహీంద్రా లాంటి కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో హ్యుందాయ్  కొత్త మోడళ్లను తీసుకురావడానికి రెడీ అవుతోంది.  రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో కంపెనీ భారత మార్కెట్లో నాలుగు కొత్త మాస్ మార్కెట్ వెహికల్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. వీటిలో SUVలు, ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ మోడళ్లు, కొత్త హ్యాచ్‌ బ్యాక్‌ లు ఉన్నాయి. ఇంతకీ అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ Hyundai Bayon

హ్యుందాయ్ నుంచి బేయాన్ అనే మోడల్ ముందుగా అందుబాటులోకి రానుంది. ఇది వెన్యూ, క్రెటా మధ్యలో ఉండే కొత్త మిడ్‌ సైజ్ SUVగా రానుంది. ప్రస్తుతం ఉన్న మోడల్‌ తో పోలిస్తే కొత్త బేయాన్ SUV లుక్‌తో, పెద్ద సైజ్‌ తో కనిపించనుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ తో పాటు మాన్యువల్‌, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్లు ఉండొచ్చని సమాచారం. అలాగే హ్యుందాయ్ నుంచి వచ్చే తొలి CNG SUV ఇదే అయ్యే అవకాశముంది. డ్యూయల్ CNG టెక్నాలజీని కూడా కంపెనీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

⦿ Hyundai Compact Electric SUV

Advertisement

మరో ముఖ్యమైన మోడల్ హ్యుందాయ్ కాపంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV. ఇది టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV 3XO EVలకు  పోటీగా రానుంది. భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఈ ఎలక్ట్రిక్ SUVలో 42kWh, 49kWh బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌, ADAS టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, పెద్ద టచ్‌ స్క్రీన్లు లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

⦿ Next-Gen Hyundai Creta

ఇక భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటైన హ్యుందాయ్ క్రెటా కూడా సరికొత్తగా అందుబాటులోకి రానుంది. 2027లో వచ్చే నెక్స్ట్ జెనరేషన్ క్రెటా మరింత పెద్ద సైజ్‌, విశాలమైన క్యాబిన్‌, కొత్త డిజైన్‌ తో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉండొచ్చని సమాచారం. కంపెనీ దాదాపు 25 కిలో మీటర్ల వరకు మైలేజ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్‌, టర్బో పెట్రోల్‌, డీజిల్‌తో పాటు హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లు కూడా అందుబాటులో రావచ్చని తెలుస్తోంది.

⦿ Hyundai i20 హ్యాచ్‌ బ్యాక్

Advertisement

హ్యాచ్‌ బ్యాక్ సెగ్మెంట్‌ లోకి కూడా హ్యుందాయ్ అడుగు పెట్టనుంది. నెక్ట్స్ జెనరేషన్ హ్యుందాయ్ i20 మరింత ఆధునిక ఫీచర్లతో రానుంది. కొత్త డిజైన్‌, పెద్ద 12.3 అంగుళాల స్క్రీన్‌, డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, ADAS ఫీచర్లు ఇందులో ఉండే అవకాశముంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్‌, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉండొచ్చని సమాచారం. ఈ మోడళ్లతో హ్యుందాయ్ భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.

Read Also: ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల లాంచ్ డేట్ ఫిక్స్.. వారెవ్వా.. ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×