E-Paper
Advertisement

స్కూటర్‌ లో ఎయిర్‌ బ్యాగ్.. యమహా టెక్నాలజీ అదిరింది గురూ!

స్కూటర్‌ లో ఎయిర్‌ బ్యాగ్.. యమహా టెక్నాలజీ అదిరింది గురూ!
Advertisement

Yamaha Tricity 300 Launched with Airbag: యమహా నుంచి క్రేజీ స్కూటర్ రాబోతోంది. భద్రతకు సంబంధించి ఇప్పటికే పలు ఫీచర్లు రాగా, ఇకపై ఈ కంపెనీకి చెందిన బైక్ ఏకంగా ఎయిర్ బ్యాగ్ విడుదలకానుంది. స్కూటర్లలో భద్రతను మరో స్థాయికి తీసుకెళ్లేలా కొత్త మోడల్ వచ్చేసింది. యమహా మోటార్ కంపెనీ విడుదల చేసిన, యమహా ట్రైసిటీ 300 మోడల్ ఇప్పుడు ఎయిర్‌ బ్యాగ్ సిస్టమ్‌ తో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఎయిర్‌ బ్యాగ్ టెక్నాలజీ ఎక్కువగా ప్రీమియం బైక్‌ లలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు అదే ఫీచర్ స్కూటర్‌ లో రావడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రైడర్ ను రక్షించడమే లక్ష్యంగా..

ఈ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ ప్రమాద సమయంలో రైడర్‌ను రక్షించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ముందు నుంచి ఢీకొన్నప్పుడు, వెంటనే తెరుచుకుని రైడర్ ముందుకు పడిపోకుండా సాయపడుతుంది. ఈ టెక్నాలజీని ఆటోలివ్ సహకారంతో అభివృద్ధి చేశారు. భద్రత విషయంలో ఇదో కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు.  ఈ స్కూటర్‌ లో భద్రత మాత్రమే కాదు, డిజైన్, టెక్నాలజీ పరంగా అనేక మార్పులు చేశారు. కొత్తగా మరింత స్పోర్టీ లుక్ ఇచ్చారు. దీంతో ఇది రోడ్లపై ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే ఇందులో డ్యూయల్ డిస్‌ ప్లే సెటప్ ఉంది. ఒకటి TFT, మరొకటి LCD. ఇవి రైడర్‌ కు చక్కగా కనిపించేలా వివరాలు అందిస్తాయి. నావిగేషన్, మొబైల్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని వల్ల రైడింగ్ మరింత స్మార్ట్‌ గా మారుతుంది.  IMU ఆధారిత బ్రేకింగ్ సిస్టమ్ తో మంచి కంట్రోల్ లభిస్తుంది.

హైలెట్ గా 3-వీల్ డిజైన్..

Advertisement

ఈ స్కూటర్ ప్రత్యేకతల్లో ఒకటి 3 వీల్ డిజైన్. ముందు భాగంలో రెండు వీల్స్ ఉండటం వల్ల మలుపుల్లో, తడిగా ఉన్న రోడ్లపై కూడా ఎక్కువ గ్రిప్ ఉంటుంది. ఇది కొత్త రైడర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇది 292cc ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ సుమారు 28 PS పవర్, 28.9 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగర ప్రయాణాలకు మాత్రమే కాకుండా, లాంగ్ జర్నీలకు సరిపడేలా పనితీరు ఉంటుంది. నిజానికి ఇలాంటి ఫీచర్లు హైఎండ్ బైక్‌లలో మాత్రమే ఉంటాయి. కానీ, ఇప్పుడు స్కూటర్ సెగ్మెంట్‌ లో కూడా ఈ స్థాయి టెక్నాలజీ అందుబాటులోకి రావడం విశేషం.

భారత్ లో ఈ స్కూటర్ విడుదల అవుతుందా?

ఇక ఈ యమహా మోడల్ భారత్ లో విడుదల అవుతుందా? లేదా? అనే ఇంకా తెలియదు. ఇక్కడి మార్కెట్‌ లో కూడా ఎలక్ట్రిక్, ప్రీమియం వాహనాలపై ఆసక్తి పెరుగుతున్నందున, భవిష్యత్తులో ఇలాంటి మోడళ్లను మరిన్ని అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Read Also: బ్యాటరీ అయిపోయినా ప్రయాణం ఆగదు, విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×