E-Paper
Advertisement

ఇక కారు స్క్రీన్‌ లోనే యూట్యూబ్ చూసేయొచ్చు.. ఆండ్రాయిడ్ ఆటోలో అదిరిపోయే ఫీచర్!

ఇక కారు స్క్రీన్‌ లోనే యూట్యూబ్ చూసేయొచ్చు..  ఆండ్రాయిడ్ ఆటోలో అదిరిపోయే ఫీచర్!
Advertisement

Android Auto’s Biggest Update: కార్ల వినియోగదారులకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆండ్రాయిడ్ ఆటోకు సంబంధించి క్రేజీ అప్ డేట్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త అప్‌ డేట్‌ తో కార్లలోని ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్ మరింత స్మార్ట్‌ గా, మోడ్రన్ గా మారబోతోంది. ముఖ్యంగా కారు స్క్రీన్ లో యూట్యూబ్ వీడియోలు చూడడం, 3డీ మ్యాప్స్ నావిగేషన్, జెమిని ఏఐ సపోర్ట్ లాంటి సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ అప్ డేట్స్ దశలవారీగా విడుదల అవుతాయని గూగుల్ వెల్లడించింది.

యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ ఫీచర్

తాజా ఆండ్రాయిడ్ ఆటో అప్‌ డేట్‌ లో ఎక్కువగా ఆకట్టుకుంటున్న ఫీచర్ యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్. ఇప్పటి వరకు కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ద్వారా వీడియోలు చూడడం సాధ్యం అయ్యేది కాదు. కానీ, ఇకపై కారు పార్క్ చేసి ఉన్నప్పుడు, ఈవీ ఛార్జింగ్‌ లో ఉన్నప్పుడు యూట్యూబ్ వీడియోలను నేరుగా కారు స్క్రీన్‌ లో చూడొచ్చు. అయితే, భద్రత దృష్ట్యా కారు కదలడం ప్రారంభం కాగానే, వీడియో ఆటోమేటిక్‌ గా ఆడియో మోడ్‌ కు మారిపోతుంది. దీంతో డ్రైవర్ ఫోకస్ రోడ్డుపైనే ఉండేలా గూగుల్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.

మహీంద్రా, టాటా కారు యూజర్లకు గుడ్ న్యూస్

Advertisement

ఈ ఫీచర్ తొలుత ప్రముఖ కార్ బ్రాండ్లలో అందుబాటులోకి రానుంది. ఇందులో మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్, కియా, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, స్కోడా, వోల్వో  లాంటి కంపెనీలు ఉన్నాయి. భారత మార్కెట్లో మహీంద్రా, టాటా కార్లు ఎక్కువగా ఉండటంతో భారతీయ వినియోగదారులకు కూడా ఈ అప్‌ డేట్ త్వరగా అందే అవకాశం కనిపిస్తోంది.

పూర్తిగా మారనున్న ఆండ్రాయిడ్ ఆటో ఇంటర్‌ ఫేస్‌

కొత్త ఆండ్రాయిడ్ ఆటో ఇంటర్‌ ఫేస్‌ ను కూడా గూగుల్ పూర్తిగా మార్చింది. ప్రస్తుతం కార్లలో పలు ఆకారాలు, పరిమాణాల్లో స్క్రీన్లు వస్తున్నాయి. వాటికి సరిపోయేలా కొత్త యూజర్ ఇంటర్‌ ఫేస్‌ ను రూపొందించారు. పెద్ద స్క్రీన్లు, రౌండ్ డిస్‌ ప్లేలు, పెద్ద టచ్‌ స్క్రీన్లలో కూడా ఈ ఇంటర్ ఫేస్ ఈజీగా పని చేస్తుంది. కొత్త డిజైన్‌ లో యానిమేషన్లు, ఫాంట్లు, విజువల్ ఎఫెక్ట్స్ మరింత ఆకట్టుకునేలా ఉంటాయి.

నచ్చినట్లుగా హోమ్ స్క్రీన్ సెట్ చేసుకునే అవకాశం

Advertisement

ఇక వినియోగదారులు హోమ్ స్క్రీన్‌ మీద తమకు కావాల్సిన విడ్జెట్‌ లను యాడ్ చేసుకోవచ్చు. వెదర్ డీటైల్స్, ఫేవరెట్ కాంటాక్ట్స్, మ్యూజిక్ షార్ట్‌ కట్లు, నావిగేషన్ లాంటి ఫీచర్లను నేరుగా హోమ్ స్క్రీన్ లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఆండ్రాయిడ్ ఆటో మరింత ఆకట్టుకోనుంది.

గూగుల్ మ్యాప్స్‌ కు కూడా  గూగుల్ బిగ్ అప్‌గ్రేడ్ ఇవ్వనుంది. కొత్త 3డీ నావిగేషన్ సిస్టమ్ ద్వారా రోడ్లు, బిల్డింగ్స్, ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరింత స్పష్టంగా కనిపిస్తాయి. డ్రైవింగ్ సమయంలో సరైన లేన్ ఎంచుకోవడం ఈజీ అవుతుంది. ముఖ్యంగా హైవేలపై డ్రైవింగ్ చేసే వారికి  చాలా ఉపయోగకరంగా ఉండనుంది.  ఈ అప్‌ డేట్‌ లో జెమిని ఏఐ కూడా రాబోతోంది. డ్రైవింగ్ చేస్తూనే వాయిస్ కమాండ్ల ద్వారా పనులు చేయించుకోవచ్చు. మెసేజ్‌లకు సమాధానాలు ఇవ్వడం, అడ్రస్‌ సూచించడం, ఫుడ్ ఆర్డర్ చేయడం లాంటి పనుల్లో జెమిని సహాయపడుతుంది. రానున్న రోజుల్లో స్విగ్గీ, జొమాటో లాంటి సర్వీసులతో కూడా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఆకట్టుకునే మ్యూజిక్ ఎక్స్ పీరియెన్స్

అటు మ్యూజిక్ ఎక్స్ పీరియెన్స్ ను కూడా అప్ డేట్ చేస్తోంది. యూట్యూబ్ మ్యూజిక్, స్పాటిఫై లాంటి యాప్‌లు కొత్త డిజైన్‌ తో రానున్నాయి. కొన్ని కార్లలో డాల్బీ అట్మోస్ స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది. మొత్తంగా  గూగుల్ తీసుకొచ్చిన ఈ అప్ డేట్స్ కారు రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను మరింత స్మార్ట్‌ గా మార్చనున్నాయి.

Read Also: పెట్రోల్ వినియోగంలో గోవా టాప్.. మరీ తక్కువ వాడే స్టేట్ ఏదో తెలుసా?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×