E-Paper
Advertisement

ప‌రివ‌ర్త‌న.. యాభ‌య్యో వ‌డిలో.. నిర‌స‌న రూపంతో మొద‌లు! వేడుక‌ల‌కు దూరం..

ప‌రివ‌ర్త‌న.. యాభ‌య్యో వ‌డిలో.. నిర‌స‌న రూపంతో మొద‌లు! వేడుక‌ల‌కు దూరం..
Advertisement

కేటీఆర్‌కు రేప‌టితో యాభై ఏళ్లు. ష‌రా మామూలుగానే జ‌న్మ‌దిన వేడుకల‌కు ఈసారి కూడా దూర దూరంగానే ఉంటున్నాడు. క‌రువు ప‌రిస్తితులు, రాష్ట్రంలో జ‌నాలు సంతోషంగా లేని వాతావ‌రణం.. ఇవ‌న్నీ త‌న జ‌న్మ‌దిన వేడుక‌ను సంతోషంగా జ‌రుపుకునే సంద‌ర్భంగా లేద‌ని ఆయ‌న ముందే చెప్పుకున్నాడు.

ఎవ‌రూ వేడుక‌లు చేయొద్ద‌ని, ఫ్లెక్సీలు పెట్టొద్ద‌ని. కానీ తెలంగాణ భ‌వ‌న్‌లో మిగితా చోట్ల కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. కేటీఆర్ ఫ్లెక్సీలు కూడా వెలుస్తున్నాయి. రేపు ఇందిరాపార్క్ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద బీఆరెస్వీ కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రికి నిర‌స‌న‌గా చేప‌డుతున్న ఆందోళ‌న‌లో పాల్గొంటున్నాడు కేటీఆర్‌. జ‌న్మ‌దినం రోజున .. వేడుక‌ల‌కు దూరంగా.. ఆ రోజు నిర‌స‌న రూపంలో త‌న పార్టీ వైఖ‌రి తెలియ‌జెప్పే వేదిక మీద ప్ర‌సంగించ‌నున్నారు.

Advertisement

ఇది కొంత‌లో కొంత ప‌రివ‌ర్త‌నే. తీసుకున్న ఉద్య‌మ‌ రూప‌మే బీజేపీపైన కావ‌డం కూడా ప్ర‌ధాన చ‌ర్చ‌లో భాగ‌మైంది. బీజేపీ, బీఆరెస్ ఒక‌టేన‌ని అధికార ప‌క్షం ఎంత ప్ర‌చారం చేసినా.. ఇలా బీఆరెస్ త‌న‌పై ప‌డ్డ మ‌ర‌క‌ను తుడిచిపెట్టే క్ర‌మంలో ఏదో ఒక‌రూపంలో ఆందోళ‌న చేస్తున్న‌ది. కౌంట‌ర్లిస్తున్న‌ది. తాజాగా ఢిల్లీలో జరిగిన విద్యార్థి లోకంపై జ‌రిగిన దాడి ఘ‌ట‌న త‌రువాత మొద‌ట‌గా స్పందించింది తెలంగాణ నుంచి కేటీయారే.

దీన్ని ఖండించాడు. కేంద్రం వెంటనే జ‌న్‌-జీ డిమాండ్స్ మేర‌కు న‌డుచుకోవాల‌ని, ధ‌ర్మేంద్ర రాజీనామా చేయాల‌ని కూడా డిమాండ్ చేశారు. యువ‌తను స‌పోర్టు చేయ‌క‌పోతే పుట్ట‌గ‌తులుండ‌వ‌నే భ‌యం కావొచ్చు… జాతి యావ‌త్తు దీన్ని ఖండించే క్ర‌మంలో బీజేపీకి వ్య‌తిరేకంగా మాట్లాడ‌క‌పోతే.. ఇప్ప‌టికే త‌మ‌పై ఉన్న ముద్ర ఇంకా ప‌దిలమ‌వుతుంద‌నే కార‌ణం కావొచ్చు. వెంట‌నే కేటీఆర్ స్పందించాడు.

Advertisement

ఇది కూడా రాజ‌కీయ వ్యూహ‌మే. ఒక‌వేళ బీజేపీతో జ‌త‌క‌లిసే ప‌రిస్థితే వ‌స్తే.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత చూసుకోవ‌చ్చు.. కానీ ఇప్ప‌ట్నుంచి మొత్తం ఆ పార్టీకి బెండ్ అయిపోయే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం మూలంగా.. త‌మ స్వ‌శ‌క్తిని సైతం కోల్పోతామ‌నే భ‌యం ఆ పార్టీని వెంటాడుతోంది. అందుకే దీనిపై ఏకంగా ఓ నిర‌స‌న రూపాన్నే తీసుకున్న‌ది పార్టీ.

బీఆరెస్‌వీ ఆధ్వ‌ర్యంలో రేపు ఇందిరాపార్క్ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద నిర‌స‌న తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజ‌రుకానున్నారు. ఓ వైపుకాంగ్రెస్ ఆందోళ‌నలు చేస్తున్న‌ది. బీజేపీపై విరుచుకు ప‌డుతున్న‌ది. ఇది ఈ రెండు పార్టీల ఇష్యూగా చూడ‌టం లేదు బీఆరెస్‌. జెన్‌-జీ ని ఆక‌ర్షించాల‌న్నా.. వారి మ‌ద్ద‌తును కూడా పార్టీ కూడ‌గ‌ట్టుకోవాల‌న్నా.. కేంద్రంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను తమ పార్టీ నుంచి కూడా తెలియ‌జెప్ప‌డం ద్వారా యువ‌త‌ను ఆక‌ట్టుకోవ‌చ్చే కోణంలో కూడా బీఆరెస్ ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే త‌న బ‌ర్త్‌డే అయినా.. అదే రోజున నిర‌స‌న రూపంలో పాల్గొనే చాన్సును వ‌దులుకోలేదు కేటీఆర్‌.

Related News

తెలంగాణ శాసనసభ సమావేశాల వేళ గులాబీ దళంలో ఉత్కంఠ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా..?

కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా? రాడా? ఇది కాదు అసలు సమస్య..! ఏం చర్చిస్తున్నారు.. ఏం చట్టాలు చేస్తున్నారు? అనేదే ముఖ్యం..

శ్రీకాకుళం జిల్లా డీఎస్సీలో మరో బిగ్ స్కామ్ బట్టబయలు.. టాప్ మార్కులు వచ్చినా రాని టీచర్ ఉద్యోగం!

తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనలో ఊహించని ట్విస్ట్.. సీనియర్లకు బిగ్ షాక్!

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరికిందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!

డిప్యూటీ సీఎం ఇస్తేనే కేబినెట్‌లోకి వెళ్తా.. ఏఐసీసీకి మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్‌!

కాంగ్రెస్ పార్టీకి ఉహించని షాక్.. ఆ విషయంలో ఇక అన్ని పార్టీలు అటువైపే..?

రెండేళ్లు చాన్సివ్వండి.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ది..ప‌రీక్ష‌లో మంచి మార్కులు తెచ్చుకుంటా! ఆ త‌రువాత మీ జీత‌భ‌త్యాలు నేను చూసుకుంటా!

Big Stories

Advertisement
×