Love Incident: ఓ హత్య అనేక ప్రశ్నలు. మరి వాటికి సమాధానాలు లేవా అంటే.. ఉన్నాయి. కానీ ఒక్కొక్కరిది ఒక్కో సమాధానం. కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతున్నకొద్ది.. అనుమానాలు పెరుగుతున్నాయే తప్ప.. ఏమాత్రం తగ్గడం లేదు. అసలు బీరంగూడ లవ్ అండ్ మర్డర్ స్టోరీలు అసలు నిజాలేంటి? బాధితులు, బాధ్యుల కుటుంబ సభ్యులు చెబుతున్నదేంటి? ఇంతకీ ఇది అనుకోకుండా జరిగిన హత్యనా? లేక పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యనా?
పదిహేనేళ్లకే చిగురించిన ప్రేమ..
శ్రవణ్ సాయి.. ఈ బీటెక్ చదివే యువకుడి హత్య ఇప్పుడు అనేక ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చింది. పదిహేనేళ్లకే చిగురించిన ప్రేమ.. ఆ తర్వాత చెట్టపట్టాలు వేసుకొని తిరగడం.. 18 ఏళ్లకే ప్రేమికురాలిని గర్భిణి చేయడం.. ఆ తర్వాత వివాదాలు.. వార్నింగ్‌లు.. చివరికి ఆ యువకుడి ప్రాణం పోయింది. కానీ ఆ రోజు అసలేం జరిగింది? అనేది మాత్రం ఇప్పుడు ఓ మిస్టరీగా మారింది. ఈ హత్య కేసులో అనేక కోణాలు కనిపిస్తున్నాయి. ఈ హత్య తల్లిదండ్రుల ఆవేదనను చెబుతోంది.. సమాజాన్ని ఇంకా కులం అనే పీడ ఎలా వేధిస్తుందో చూపుతోంది.. అన్నింటికంటే ముఖ్యంగా లేత వయసులో చిగురించే పరిణితి లేని ప్రేమ ఎలాంటి అనర్ధాలకు దారి తీస్తుందో చాటి చెబుతోంది.
శ్రవణ్ సాయి, శ్రీజ.. టెన్త్ క్లాస్‌మెట్స్. అప్పటి నుంచే వీరిద్దరి నుంచి ప్రేమ ఉందనేది ప్రస్తుతం ఇరు కుటుంబాలు, వారి ఫ్రెండ్స్ చెబుతున్న మాట. అయితే ఉన్నట్టుండి శ్రీజ ఇంటికి శ్రవణ్ వెళ్లడం.. అక్కడ గొడవ జరగడం.. తీవ్ర గాయాలతో శ్రవణ్ మృతి చెందడం జరిగింది. అయితే ఆ కొద్ది గంటల సమయంలో ఏం జరిగింది? అనేది ఒక మిస్టరీ అయితే.. ఎందుకు జరిగింది? అనేది మరో మిస్టరీ.
ముందుగా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న శ్రీజ తల్లి సిరి వర్షన్ వింటే కాస్త షాకింగ్‌గానే ఉన్నాయి. తన కూతురు గర్భవతి అని.. శ్రవణ్, శ్రీజ గండిమైసమ్మ దగ్గర పార్క్‌లో సెక్స్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆమె. మీకో కూతురు ఉంటే ఆ బాధ మీకు తెలుస్తుంది అంటున్నారు ఆవిడ.
తప్పు చేసిన తన కూతురిని కొడుతుంటే శ్రవణ్‌సాయి అడ్డువచ్చాడని.. అప్పుడే అతడికి దెబ్బలు తగిలి మృతి చెందాడని చెబుతోంది ఆమె. బట్ ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ అనేది శ్రవణ్ ఫ్రెండ్స్ మాట. ఏడాది నుంచి యువతిని శ్రవణ్‌సాయి కలవనే లేదంటున్నారు అతని ఫ్రెండ్స్. ఏడాది నుంచి కలవకపోతే శ్రవణ్‌సాయి వల్ల యువతి గర్భవతి ఎలా అవుతుందనేది వారు వేస్తున్న ప్రశ్న.
ఈ చిక్కుముడి ఇప్పుడు వీడాల్సి ఉంది. అయితే ఈ కేసులో మరో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు సాయి ఫ్రెండ్స్. శ్రీజ అసలు ఆ ఇంట్లో ఉండేందుకు ఇష్టపడలేదని.. చాలా సార్లు బయటికి వచ్చేసిందంటున్నారు ఫ్రెండ్స్. శ్రవణ్, శ్రీజ ఇంట్లో నుంచి గతంలో కూడా బయటికి వెళ్లారు అనేది ఇక్కడ తేలిన అంశం. దీనిపై శ్రీజ తల్లి సిరి పోలీసులకు కూడా గతంలో ఫిర్యాదు చేసింది. అయితే శ్రీజ ఇలా వచ్చేయడానికి కారణం ఆమె పెంపుడు తండ్రి హరిప్రసాద్ అంటూ మరో కొత్త ట్విస్ట్‌ను తెరపైకి తీసుకొచ్చారు శ్రవణ్ ఫ్రెండ్స్.
మరి ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం?. అయితే శ్రీజ, సాయి లవ్‌స్టోరి అనేది ఇరు కుటుంబాలకు చాలా నెలలుగా తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఇరు కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా ఇది ఒక్కరోజులో జరిగిన వ్యవహారం అయితే అస్సలు కాదు. ఎందుకంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. 6 నెలల కిందట శ్రవణ్‌సాయి కుటుంబంతో మాట్లాడేందుకు అమీర్‌పేటలోని అతని పెదనాన్న ఇంటికి వెళ్లారు యువతి తల్లి, పెంపుడు తండ్రి. తమ కూతురు జోలికి రావొద్దని శ్రవణ్‌సాయి పెదనాన్న, పెద్దమ్మకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా మాటామాటా పెరగడంతో యువతి పెంపుడు తండ్రి, శ్రవణ్‌సాయి పెదనాన్నకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ తీవ్ర స్వరంతో తిట్టుకున్నారు.
శ్రీజ నిజంగా ప్రెగ్నెంట్‌గా ఉందా? అసలు తాను శ్రీజను కలవడం లేదంటూ ప్రపంచాన్ని మోసం చేస్తూ.. తన ప్రేమ వ్యవహారాన్ని సాయి కంటిన్యూ చేశాడా? శ్రీజను కొడుతుంటే సాయి అడ్డుగా వెళ్లడం వల్లే చనిపోయాడా? బ్యాట్‌తో కొట్టిన ఒకటి, రెండు దెబ్బలకే సాయి ప్రాణాలు వదిలాడా? లేక పక్కాప్లాన్ ప్రకారం సాయిని హత్య చేశారా? ఇందులో సిరి పాత్ర మాత్రమే ఉందా? లేక ఇంకేవరైనా ఉన్నారా? ఇలా అన్ని ప్రశ్నలే. ఇప్పటికైనా పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి మాటలు వారు చెబుతున్నారు.. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.. వినడానికి అన్నీ నమ్మేలానే ఉన్నా.. అసలు నిజం వేరే ఉందని మాత్రం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది.
కానీ ఈ మొత్తం సినారియాలో కొన్ని మాత్రం నిజాలు ఉన్నాయి. అది శ్రవణ్ సాయి హత్యకు గురవ్వడం.. సాయికి, శ్రీజకు ముందు నుంచే పరిచయం ఉండటం.. ఈ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు ముందే తెలిసి ఉండటం.. ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరగడం.
కౌమరదశ.. బాలురైన, బాలికలైన వారి శరీరంలో, ఆలోచనల్లో మార్పులు వచ్చే సమయం. అలాంటి కౌమర దశలో మనం చేసే పనులే మన ఫ్యూచర్‌ను డిసైడ్ చేస్తాయి. కానీ ఇప్పుడీ ఏజ్ గ్రూప్‌ను ఓ మహమ్మారి వేధిస్తోంది.. తప్పటడుగులు వేసేలా మోటివేట్ చేస్తోంది. మరి ఇలాంటి సమయంలో మనం చేయాల్సిందేంటి? చేస్తుందేంటి? ఈ తప్పులకు బాధ్యత వహించాల్సింది ఎవరు?
పాఠాలు వినాల్సిన వయసులో ప్రేమ పాఠాలు చదువుతున్నారు.. చదువు కోవాల్సిన వయసులో ప్రణయ గీతాలు పాడుతున్నారు.. గర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్‌ను మెయింటేన్ చేయకపోతే పరువు పోయినట్టు ఫీల్ కావడం ఇప్పుడు కామన్‌గా మారింది. ఇప్పుడు స్కూల్ స్టేజ్ నుంచే ఇలాంటి సిట్యూవేషన్స్ కనిపిస్తున్నాయి. మరి గతంలో అలా లేదు కదా.. ఇప్పుడీ ట్రెండ్ ఎందుకింత పెరిగింది అంటే.. సమాధానం సింపుల్. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, చేతిలో ఫోన్‌లు, మనం చూసే సినిమాలు.
ఏదైనా సోషల్ మీడియాకు సంబంధించి ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే చాలు.. మనం చూసే పది రీల్స్, వీడియోల్లో సగానికి సగం సెమీ అడల్డ్ కంటెంట్ లేదంటే ఏదైనా లవ్ కోట్ లేదా సీన్ కనిపిస్తుంటోంది. ఇందులో కొన్ని పరిణితి చెందని మెదళ్లు చూసే అవకాశమే ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు అలాంటి కంట్రోల్ బాడీ మన దేశంలో లేదు.
బీరంగూడ మర్డర్ ఎపిసోడ్‌నే చూడండి.. శ్రవణ్ సాయి, శ్రీజ ఎసిపోడ్‌నే చూడండి. టెన్త్ క్లాస్‌లో లవ్వు.. డిగ్రీ చదువుతున్న సమయంలో ఏకంగా ప్రెగ్నెంట్. మనం దీనిని ఎలా చూడాలి అసలు. టెన్త్ క్లాస్ అంటే లైఫ్ గురించి మినిమమ్ నాలెడ్జ్ కూడా ఉండదు. ఇప్పుడున్న యంగ్‌స్టర్స్ అంతా తమ చేతిలో ఉండే సెల్‌ఫోన్‌లోని వీడియోలను చూసో.. సిల్వర్ స్క్రీన్‌పై కనిపించే సీన్స్‌ను చూసో అదే లైఫ్ అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఎదురిస్తే హిరోయిజం.. లవ్ చేయకపోతే పాపం.. ఆ తర్వాత ఎక్సేట్రా ఎక్సేట్రా.. ఇలా సాగిపోతుంది వ్యవహరం.
మనకు ఎక్కువగా కనిపించే రోమాంటిక్ మూవీస్, వెబ్ సిరీస్‌లు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నాయి. తెలీకుండానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, సోల్ మేట్స్ అనే కాన్సెప్ట్‌ను డెవలప్ చేస్తున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో కనిపించే పర్‌ఫెక్ట్‌గా ఎడిట్ చేసిన కపుల్, రిలేషన్‌షిప్ వీడియోలు, ట్విస్ట్ చేసిన ఇంటర్వ్యూలు కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ప్రేమ కోసం ఏమైనా చేయాలి.. ఎంతకైనా తెగించాలి.. అనే ఓ భావనను క్రియేట్ చేస్తున్నాయి. సినిమాలు, సీరియల్స్‌లో ప్రేమ, డేటింగ్ సీన్స్ చాలా కామన్‌గా మారాయి. ఈ ఏజ్‌లో కాకపోతే ఇంకెప్పుడు లవ్‌లో పడతారు అనే సిట్యూవేషన్స్‌ను క్రియేట్ చేస్తున్నాయి ఇవన్నీ.
ఇవే కాదు.. లోన్లీనెస్, డిప్రెషన్, ఎమోషన్ కోట్స్ కూడా మెల్లిమెల్లిగా చూపించే ఇంపాక్ట్‌ను అర్థం చేసుకోలేము. ఎమోషనల్‌గా వీక్ అవ్వడం.. చిన్న చిన్న వాటికే డిప్రెషన్‌లోకి వెళ్లడం, ఒత్తిడి, అసంతృప్తి వంటి మానసిక సమస్యలు పెరగడం ఇప్పుడు కామన్‌గా మారాయి.
మాములుగానే కౌమార దశలో పిల్లల్లో సహజంగానే శారీరక, మానసిక మార్పులు వస్తాయి. ఈ టైమ్‌లో సరైన గైడెన్స్ లేకపోతే సోషల్ మీడియానే వారికి ఒక వేదికగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్.. శ్రీజ, శ్రవణ్ ఎపిసోడ్. ఇంట్లో ఏదో సమస్యలు ఉన్నాయని శ్రీజ చెప్పేదని శ్రవణ్ ఫ్రెండ్స్ చెబుతున్నారు. అదే నిజమైతే శ్రీజతో ఇంట్లో వాళ్లు సరిగా మాట్లాడి సమస్యను పరిష్కరించి ఉంటే.. అసలు విషయం ఇక్కడి వరకు వచ్చేదే కాదు.. శ్రవణ్ తో క్లోజ్ రిలేషన్ పెంచుకునేదే కాదు. వయస్సుకొచ్చిన పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో.. వాళ్లేం చేస్తున్నారో ఎప్పటికప్పుడు గమనించడం ఎంత అవసరమే చెప్పడానికి ఈ కేసే ఒక పెద్ద ఎగ్జాంపుల్. చినప్పుడ తప్పటడుగులు వేసేటప్పుడు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. వయస్సోలకి వచ్చాక కూడా వాళ్లు తప్పటడుగులు వేయకుండా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దోళ్లయ్యారు కదా అని వదిలేస్తే, శ్రీజ-శ్రవణ్ లాంటి పరిస్థితే ఏ కుటుంబమైనా ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏం చూస్తున్నారు.. అనే దానిపై పెరేంట్స్ కాస్త ఫోకస్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ప్రేమ పేరుతో తప్పుడు మార్గంలో వెళ్తున్న యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలంటున్నారు. యువత తాము చూస్తున్న కంటెంట్‌ను మైండ్‌లెస్‌గా కాకుండా, నిజ జీవితానికి, సినిమాకు తేడాను గుర్తించేలా వారిలో అవెర్‌నెస్‌ను పెంచాలంటున్నారు.
Also Read: డాలర్ డ్రీమ్స్‌కు బ్రేక్స్ వేస్తున్న సోషల్ మీడియా.. పోస్టులతో రెచ్చిపోయే వారికి నో వీసా..
ఈ మధ్యే ఆస్ట్రేలియా ఈ కఠినమైన చట్టాన్ని తయారు చేసింది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ విధించింది. సోషల్ మీడియాకు బానిసలుగా మారి,పక్కదారి పడుతున్న వారిని కంట్రోల్ చేయడానికి ఈ డేరింగ్ డెసిషన్ తీసుకుంది. కానీ, మన దగ్గర అలాంటిది సాధ్యమవుతుందా.. ప్రభుత్వం బ్యాన్ చేస్తుందా లేదా అన్నది పక్కన పెడితే.. మీ ఇంట్లో మీరు ఆ బ్యాన్ చేయగలరా.. పిల్లల చేతికి ఫోన్లు అందకుండా చేయగలరా.. మన ఇంట్లోనుంచే కంట్రోల్ మొదలైతే… సమాజం మొత్తం మన దారిలోనే నడుస్తుంది. ఏది ఎంతవరకు అవసరమో.. అంతవరకే ఇచ్చినప్పుడే అన్నీ మన కంట్రోల్‌లో ఉంటాయి. మీ పిల్లలు మీ చేజారక ముందే జాగ్రత్త పడండి. చేజారాక విచారిస్తే ఎలాంటి లాభం ఉండదు. చివరకు మిగిలేది చేదు జ్ఞాపకాలే.
Story By Vamshi Krishna, Bigtv