E-Paper
Advertisement

తెగేదాక లాగ‌క‌పోవ‌డ‌మే మేలు..70వేల ఉద్యోగాల‌పై కేటీఆర్ వ్యూహంలో చిక్కుకున్న‌ కాంగ్రెస్!

తెగేదాక లాగ‌క‌పోవ‌డ‌మే మేలు..70వేల ఉద్యోగాల‌పై కేటీఆర్ వ్యూహంలో చిక్కుకున్న‌ కాంగ్రెస్!
Advertisement

తెగ‌దాక లాగ‌క‌పోవ‌డ‌మే మేలు. అవును… ఇప్పుడు ఇదే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. కేటీఆర్ తేనెతుట్టెను కుదిపిన‌ట్టుగా.. మీరిచ్చింది ప‌ది వేల ఉద్యోగాలే.. మిగిలిన‌న్నీ మా హ‌యంలో మేమిచ్చిన‌వే.. అన్నాడు. దీనిపై ఎవ‌రికి వారే కౌంట‌ర్లిచ్చారు. సీఎం రేవంత్ కూడా ప‌లు సంద‌ర్బాల్లో దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

కానీ దీన్ని కేటీఆర్ వ‌దిలేలా లేడు. అదో వ్యూహం. కానీ ఆ వ్యూహంలో త‌న‌కు తెలియ‌కుండానే చిక్కుకుంటున్న‌ది కాంగ్రెస్‌. సీఎం మొన్న దీనికి కౌంట‌ర్‌గా నిరుద్యోగుల‌కు విజ్ఞ‌ప్తి చేశాడు. ద‌య‌చేసి ఎవ‌రూ కేటీఆర్ మాయ‌మాట‌లు న‌మ్మ‌కండి.. ఎన్ని ఖాళీలున్నా.. నేను భ‌ర్తీ చేస్తాను. న‌న్ను న‌మ్మండి..! అని కోర‌డ‌మే కాదు.. కేటీఆర్ అన్న‌ట్టుగా.. మ‌రి వారి హ‌యాంలో ఎందుకు ఇవ‌న్నీ చేయ‌లేక‌పోయారు? అని కూడా క్వ‌శ్చ‌న్ చేశాడు.

Advertisement

ఇది ఇంత‌టితో ఆపితే స‌రిపోతుంది. కానీ కేటీఆర్ వ‌దిలేలా లేడు. నిన్న తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో మ‌ళ్లీ ఉద్యోగాల ప్ర‌స్తావ‌న తెచ్చాడు. ప‌దివేలే ఇచ్చారు. 70వేల‌ని నిరూపిస్తే రాజ‌కీయ స‌న్యాసం చేస్తా..నంటూ మ‌ళ్లీ అదే స‌వాలు ప‌దే ప‌దే విస‌ర‌డం వెనుక‌.. ఇందులో కేటీఆర్ వ్యూహం దాగు0ద‌నే విష‌యం తెలిసిపోతూనే ఉంది. ఆ విష‌యం తెలియ‌క‌.. కౌంట‌ర్ ఇవ్వాలే కాబ‌ట్టి .. మ‌ళ్లీ మ‌ళ్లీ ఆ వ్యూహంలో త‌న‌కు తెలియ‌కుండానే చిక్కుకుంటున్న‌ది కాంగ్రెస్‌.

ఇవాళ తాజాగా ఈ విష‌యంలో జోక్యం చేసుకున్నాడు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌. కేటీఆర్ రాజీనామాకు రెడీగా ఉండాల‌ని, డైబ్బై వేల ఉద్యోగాలు క‌ల్పించిన విష‌యం నిరూపిస్తామ‌న్నాడు. కానీ ఇప్పుడు ఈ ప‌రిస్థితుల్లో అధికార పార్టీ నుంచి రావాల్సిన కామెంట్ ఇది కాదు. నిరుద్యోగులు కోరుకుంటున్న‌ది మీరు ఇద్ద‌రూ బ‌స్తీమే స‌వాల్ అని రోడ్డెక్కి కొట్టుకోవ‌డం కాదు.

Advertisement

ప్ర‌తిప‌క్షం గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తేనైనా.. ప్ర‌భుత్వం దిగివ‌స్తుంద‌ని వారి పంచ‌న చేరారు. మీటింగుకు వెళ్లారు. అంతేగానీ కేసీఆర్ పాల‌న అద్బుత‌మ‌ని చెప్ప‌డానికి కాదు. పొరపాట్లు జ‌రిగాయ‌ని, లోపాలు ఉన్నాయ‌ని కేటీయారే స్వ‌యంగా ఒప్పుకున్నాడు. త‌ప్పుదిద్దుకుంటాన‌ని ప‌శ్చాత్తాపం కూడా ప్ర‌క‌టించాడు. ఇప్పుడు ఇది కాదు ప్ర‌భుత్వం చేయాల్సింది.

సై అంటే సై .. అనుకుంటే కూర్చుంటే బీఆరెస్‌కు పోయేదేమీ లేదు. దానికి కావాల్సింది కూడా ఇదే. ఓ వైపు పోలీసుల నోటిఫికేష‌న్స్‌పై ఆందోళ‌న‌తో ఉన్నారు. దీన్ని స‌ద్దుమ‌ణిగేలా చేయ‌డం.. వారికి ఓ క్లారిటీ ఇవ్వ‌డం.. నిరుద్యోగుల‌కు న్యాయం చేస్తామ‌నే విధంగా స‌ర్కార్ నుంచి ప్ర‌క‌ట‌న రావడాన్ని వారు కోరుకుంటున్నారు. కానీ ఇలా స‌వాళ్ల‌కు ప్ర‌తిస‌వాళ్లు వేసుకుంటూ కూర్చుంటే.. నిరుద్యోగుల ద‌గ్గ‌ర ఏమాత్రం మార్కులు ప‌డ‌వు. పైగా ఇది ప్ర‌తిప‌క్షానికే క‌లిసి వ‌స్తుంది.

Related News

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులకు షాక్!

సురేఖకు సవాళ్ల మీద సవాళ్లు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమరం.. మాటల తూటాలకు రెడీ!

కులాన్ని మార్చేసి మరీ ఏపీ DSC లో ఉద్యోగాలు.. బిగ్ టీవీ ఆపరేషన్‌లో బయటపడ్డ సంచలనాలు

సొంత పార్టీపై సెటైర్లు వేస్తే సీన్ రివర్స్.. కాంగ్రెస్‌లో కొత్త రూల్!

ముఖం బాగ‌లేక అద్దం ప‌గ‌ల గొట్టిన‌ట్టు…! అద్దంలా ఉన్న‌దున్న‌ట్టు చూపితే అంత ఉలుకెందుకు? బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధిస్తే నిజాలు ఆగుతాయా?

ఏపీలో DSC స్కాం ఎఫెక్ట్.. బిగ్ టీవీ సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్!

అసెంబ్లీని బ‌హిష్క‌రించిన మాజీ సీఎంలు.. ప్ర‌తిన‌ బూని మ‌ళ్లీ సీఎంగానే అడుగుపెట్టి.. ! జ‌య‌లలిత ఎపిసోడ్ టోట‌ల్ డిఫ‌రెంట్‌..

Big Stories

Advertisement
×