E-Paper
Advertisement

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!
Advertisement

Recharge Plans Under Rs 100: ప్రస్తుతం ప్రతీ స్మార్ట్ ఫోన్ యూజర్ నెల, 3 నెలలు, ఏడాదికి సరిపడ రీఛార్జ్ ప్లాన్స్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఆ ప్లాన్లకు సంబంధించి రోజూవారి డేటా లిమిట్ అయిపోవడం, అదనంగా మరికొంత డేటా అవసరం కావడం వంటివి సాధారణంగా జరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి నెలవారీ ప్యాక్స్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. ఒక రోజు వ్యవధిలో చిన్న చిన్న ప్యాక్స్ ను టెలికాం సంస్థలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. రూ. 100 కంటే తక్కువ ధరలోనే లభిస్తూ డేటా అవసరాలను తీర్చే టాప్ – 5 ప్యాక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

జియో రూ. 21 ప్లాన్

కొత్తగా 4G ఫీచర్ ఫోన్ కొనుగోలు చేసే వారిని దృష్టిలో ఉంచుకుని జియో ఈ ప్యాక్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 0.5GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 15 SMSలు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 4 రోజులు ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ. 49 ప్లాన్

Advertisement

తక్కువ సమయంలో ఎక్కువ డేటా అవసరమైన వారికి ఎయిర్‌టెల్ రూ. 49 ప్లాన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక రోజు వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్‌లో.. ఫెయిర్ యూసేజ్ లిమిట్ ప్రకారం అపరిమిత డేటాను పొందే వెసులుబాటు కల్పించారు. ఫోన్ యాప్స్ అప్‌డేట్ చేసుకోవడానికి, అత్యవసరంగా ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

వీఐ రూ. 22 ప్లాన్

ఇది వీఐ అందిస్తున్న డేటా బూస్టర్ ప్యాక్. ఒక రోజు వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు 1GB డేటా లభించనుంది. రోజువారీ డేటా లిమిట్ త్వరగా అయిపోయినప్పుడు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. బ్రౌజింగ్, చాటింగ్, కాలక్షేపానికి కొద్దిసేపు రీల్స్ చూడటానికి ఇది సరిపోతుంది.

బీఎస్ఎన్ఎల్ రూ. 59 ప్లాన్

Advertisement

డేటాతో పాటు కాలింగ్ కూడా కోరుకునే వారి కోసం BSNL ఈ వీక్లీ కాంబో తీసుకొచ్చింది. 7 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ లో ప్రతిరోజూ 1GB డేటా పొందొచ్చు. దీంతో పాటు అపరిమిత కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఒకరోజు మాత్రమే వచ్చే యాడ్ ఆన్ ప్యాక్ ల కంటే వారం సరిపడా రీఛార్జ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్.

Also Read: BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

వీఐ రూ. 69 ప్లాన్

వీఐ కూడా ఈ ప్లాన్ లో వారం రోజులకు సరిపడ డేటాను అందిస్తోంది. 7 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా మొత్తం 6GB డేటా లభిస్తుంది. ఈ డేటాను మీ అవసరానికి తగినట్లుగా వారమంతా ఉపయోగించుకోవచ్చు. సోషల్ మీడియా, యూట్యూబ్, ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Also Read: హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×