E-Paper
Advertisement

Telangana Gram Panchayat polls: సర్పంచ్ ఎన్నికలంటే తినుడు, తాగుడేనా? ఈ సారి గ్రామీణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది?

Telangana Gram Panchayat polls: సర్పంచ్ ఎన్నికలంటే తినుడు, తాగుడేనా? ఈ సారి గ్రామీణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది?

Telangana Gram Panchayat polls: ఆరు నెలలు అయిపోయింది. ఏడాది ఎప్పుడో దాటిపోయింది. ఏడాదిన్నర కూడా ముగిసింది. దాదాపు రెండేళ్లు కావొస్తోంది. ఎట్టకేలకు.. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు నగారా మోగింది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా? అని ఎదురుచూస్తున్న ఊళ్లకు.. ఎడతెగని ఉత్కంఠకు తెరదించే ప్రకటన వచ్చేసింది. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజైంది. అయితే.. ఈసారి గ్రామీణ ఓటర్ల ఆలోచన ఎలా ఉంది? వారి తీర్పు ఎలా ఉండబోతోంది? సర్పంచ్ ఎన్నికల గురించి.. ఊరంతా ఏమనుకుంటున్నారు?

ఊళ్లు మొత్తం ఎలక్షన్ ఫీవర్‌తో ఊగిపోయే టైమ్
ఊళ్లు మొత్తం ఎలక్షన్ ఫీవర్‌తో ఊగిపోయే టైం వచ్చేసింది. తెలంగాణ మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. మొత్తం మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే.. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వడంతో.. పంచాయతీరాజ్ శాఖ, ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టాయి. ఈసారి దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల తీర్పు ఎలా ఉండబోతోందనే చర్చ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకుంటామంటూ సవాళ్లు విసురుకుంటున్న సమయంలో.. నువ్వా-నేనా అంటూ ఊళ్లలో లీడర్లు తొడలు కొడుతున్న టైమ్‌లో.. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజైంది. ఈసారి కనిపించబోయే రాజకీయం.. ఊరు జనం ఆలోచనలకు అద్దం పట్టేలా ఉండబోతోంది.

ఊరు జనం ఏం చూసి ఓటేస్తారు?
గ్రామీణ ఓటర్లు ఇచ్చే తీర్పు.. ఈ పరిస్థితుల్లో పబ్లిక్ మూడ్ ఎలా ఉందో తేల్చబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఊరు జనం ఏం చూసి ఓటేస్తారు? ఎలాంటి నాయకుడిని.. తమ ఊరి సర్పంచ్‌గా ఎన్నుకుంటారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీలుండవు.. పార్టీల గుర్తులుండవు.. కానీ.. ఊళ్లలో రాజకీయం మాత్రం ఫుల్ స్వింగ్‌లో ఉంటుంది. సర్పంచ్‌గా పోటీ చేసే నాయకుడికి.. ఏ పార్టీ మద్దతు ఉందనేది కూడా గ్రామీణ ఓటర్లపై ప్రభావం చూపుతుంది. ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలొచ్చినా.. పార్టీలు, పగలు, రాజకీయ కక్షలు మాత్రమే కనిపిస్తుంటాయ్. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే.. ఇప్పుడు ఊళ్లలో సీన్ మారింది. రాజకీయం తీరు మారింది. ఈసారి.. గ్రామాల్లో గల్లాలు పట్టుకునే దాకా పరిస్థితులు వెళ్లొచ్చంటున్నారు. ఈ క్రమంలో.. ఊరు తీర్పు ఎలా ఉండబోతోంది అనేదానిమీద ఆసక్తి అంతటా నెలకొంది.

సర్పంచ్ ఎన్నికలొస్తే ఊళ్లలో పండగ వాతావరణం..
సర్పంచ్ ఎన్నికలొస్తే చాలు.. నెలరోజుల పాటు ఊళ్లలో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎన్నికల ప్రణాళికలు, ప్రచార ఆర్భాటాలు, ప్రత్యర్థుల్ని పడగొట్టేందుకు వ్యూహాలు.. ఇలా ఉంటాయ్. ఊరు మొత్తం.. ఒకరకమైన సందడిగా కనిపిస్తుంది. ఇంతటి చలిలోనూ.. ఎన్నికల హీట్ ఇంటింటికీ తగులుతుంది. ఇదే సమయంలో.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొత్త చర్చ మొదలైంది. సర్పంచ్ ఎలక్షన్లు అంటే.. కేవలం తినుడు, తాగుడేనా? ఊరు గురించి ఆలోచించేదేమైనా ఉందా? లేదా? ఇప్పుడు కూడా.. కులాలు, బలాలు చూసే ఓట్లేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ప్రజాస్వామ్య వ్యవస్థలో.. ఎన్నో ఎన్నికలు జరుగుతుంటాయ్. కానీ.. ప్రజలకు చాలా దగ్గరగా జరిగే ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు మాత్రమే. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్ని ఉన్నా.. జనానికి చాలా దగ్గరి సంబంధం ఉండే ఎన్నికలు ఇవి మాత్రమే! ప్రజా ప్రతినిధుల ఎన్నిక ప్రక్రియలో.. స్థానిక సంస్థలే తొలి మెట్టు. ఇక్కడి నుంచి వచ్చే తీర్పే.. ఆ పైస్థాయిలో జరిగే ఎన్నికలని, రాజకీయాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు ఇచ్చే తీర్పు ఎంతో కీలకంగా కనిపిస్తోంది. రాజకీయం మొత్తం.. ఇప్పుడు ఊళ్ల చుట్టే తిరుగుతోంది.

స్థానిక అంశాలు అభ్యర్థి వ్యక్తిగత సామర్థ్యం..
దాదాపు రెండేళ్లుగా పాలకవర్గం లేకుండా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న గ్రామాలకు.. మళ్లీ ప్రజాప్రతినిధుల పాలన రాబోతోంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే స్థానిక రాజకీయాల దిశను, రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుపై గ్రామీణ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించనున్నాయి. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో.. ఓటర్ల నిర్ణయం స్థానిక అంశాలు, అభ్యర్థి వ్యక్తిగత సామర్థ్యంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కానీ.. ఈసారి ఓటర్ల ఆలోచన.. నాయకులను, రాజకీయాలను ప్రభావితం చేసే ఉండాలి. మీరు ఎన్నుకోబోయే నాయకుడు.. వ్యక్తిగతంగా గ్రామాభివృద్ధి కోసం ఎంతవరకు కృషి చేయగలరని ఆలోచించండి. పార్టీ రంగుల కంటే.. ఊరి అవసరాలు తీర్చగలిగే సామర్థ్యం ఉన్న వారికే మద్దతుగా నిలవండి. జనానికి అందుబాటులో ఉంటూ.. నిజాయితీ గల నేతనే ఎన్నుకోవడం దృష్టి పెట్టండి. పార్టీకతీతంగా.. ఊరుకు మంచి జరిగేలా మీ తీర్పు ఉండాలి. ఏ పార్టీకి చెందిన నాయకుడు ఉంటే.. మీ ఊరుకు మంచి జరుగుతుందో.. అభివృద్ధి కొనసాగుతుందో.. వారికి సపోర్టుగా నిలిస్తేనే.. ఊరు ముందుకు సాగుతుంది. గతంలో ఊరు కోసం వారు చేసిన పనులు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి మంజూరు చేయించిన నిధుల గురించి కూడా చర్చించండి.

గ్రామంలో మౌలిక సదుపాయాల కొరతపై చర్చించండి!
ఇప్పటికిప్పుడు ఎవరిని ఎన్నుకోవాలనే దానికంటే ముందు.. గ్రామంలో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరత గురించి మాట్లాడండి. సాధారణంగా సర్పంచ్ ఎన్నికల్లో.. డబ్బు, మద్యం, బహుమతులు.. ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయ్. గ్రామీణ రాజకీయాల్లో.. ఇదొక చేదు వాస్తవం. అందువల్ల.. ఈసారైనా సర్పంచ్‌గా బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి వ్యక్తిగతంగా చేకూరే ప్రయోజనాలని పక్కనపెట్టి.. ఊరుకు ఎవరైతే మంచి చేస్తారో, గ్రామాభివృద్ధికి ఎవరైతే పాటు పడతారో వారిపై ఫోకస్ పెట్టండి. వ్యక్తిగతంగా చేకూరే ప్రయోజనాలు తాత్కాలికం. కానీ.. అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుంది. ఊరు బాగుపడుతుంది. అప్పుడే.. నాయకులపై, వారి నాయకత్వంపై ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడుతుంది.

ఆగిన అభివృద్ధిని పట్టాలెక్కించే పట్టుదల ఉన్న లీడర్ కావాలి!
ఇప్పటికే.. ఎన్నికలు ఆలస్యమవడం వల్ల.. అభివృద్ధి పనులు నిలిచిపోయాయనే చర్చ ఉంది. ఎన్నో సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయ్. అందువల్ల.. ఎన్నికలు అయిపోగానే ఖర్చుల లెక్కలు మాట్లాడే నాయకుడు కాదు.. ఆగిపోయిన అభివృద్ధిని పట్టాలెక్కించే పట్టుదల ఉన్న లీడర్ కావాలి. ఇప్పటికే.. రిజర్వేషన్ల మార్పుల వల్ల కొత్త అభ్యర్థులు బరిలో దిగేందుకు సిద్ధమైపోయారు. దాంతో.. పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. అందువల్ల.. ఎవరైతే ఊరు మొత్తాన్ని తన ఇంటిలా భావిస్తారో.. ఎవరైతే గ్రామ ప్రజల్ని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారో.. వారికి మద్దతుగా నిలిస్తేనే.. ఊరు బాగుంటుంది. బాగుపడుతుంది. అనే సూచనలు వినిపిస్తున్నాయ్.

ఎన్నికలనేవి.. మన బాగును మాత్రమే కాదు.. మనం నివసించే ప్రాంత భవిష్యత్‌ని కూడా నిర్ణయిస్తాయ్. అందులోనూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలు.. ఊరు దిశనే మార్చేస్తాయ్. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, పొరపాటుగా ఆలోచించినా.. ఊరు స్వరూపమే మారిపోతుంది. భావి తరానికి భవిష్యత్ లేకుండా పోతుంది. అందువల్ల.. సర్పంచ్‌లుగా గెలిచి లూటీ చేసే వాళ్లు కావాలా? ఊరు కోసం, మీకోసం డ్యూటీ చేసే వాళ్లు గెలవాలా? అనేది.. నిర్ణయించాల్సింది మీరే! ఊరు రాతని మార్చాల్సింది మీరే! అలాంటప్పుడు.. మీ నిర్ణయం ఎలా ఉండాలి?

అభివృద్ధికి బాటలు పరిచే నాయకత్వం గెలవాలి!
తరం మారేకొద్దీ.. స్వరం మారాలి. ఈ రోజుల్లో ఊరు బాగు గురించి ఆలోచించే నాయకులు కావాలి. అభివృద్ధికి బాటలు పరిచే నాయకత్వం గెలవాలి. తమ ఊరిని.. మిగతా ఊళ్లకు ఆదర్శంగా మార్చే ఆలోచనలున్న లీడర్లు రావాలి. అధికారం చేతికి అందగానే.. ఊరు మీద పడి బతికేటోళ్లు కాదు. ఊరుని బాగు చేసే వాళ్లు కావాలి. బాగుపడదామని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లకు కాదు.. బాగు చేద్దామని బలంగా నిలబడినోళ్ల వైపు నిలవాలి! అప్పుడే.. ఎన్నికలకు ఓ అర్థం ఉంటుంది. సర్పంచ్‌గా గెలిచినోళ్లకు బాధ్యత తెలుస్తుంది. సమాజంలో ఎలాంటి ఎన్నికలైనా ముఖ్యమే. అవి మన రాష్ట్ర, దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తాయ్. కానీ.. వాటన్నింటికంటే ముఖ్యంగా.. మన నిత్య జీవితాన్ని, మనం నివసించే ప్రాంతాన్ని నేరుగా ప్రభావితం చేసేవి పంచాయతీ ఎన్నికలే. సర్పంచ్ పదవి అనేది కేవలం ఓ రాజకీయ హోదా కాదు. గ్రామానికి ప్రథమ పౌరుడి స్థానం, గ్రామాభివృద్ధికి తొలి మెట్టు. అందువల్ల.. రాబోయే ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు తీసుకునే నిర్ణయం ఎంతో ఆలోచనాత్మకంగా ఉండాలి.

ప్రతి ఇంటినీ, వ్యక్తిని ప్రభావితం చేసే పంచాయతీ ఎన్నికలు..
స్థానిక సంస్థల పరిపాలనా వ్యవస్థలో గ్రామ పంచాయతీ అత్యంత కీలకమైనది. పంచాయతీ పాలకవర్గం తీసుకునే నిర్ణయాలు.. నేరుగా ప్రతి ఇంటినీ, ప్రతి వ్యక్తిని ప్రభావితం చేస్తాయి. తాగునీరు, వీధి లైట్లు, పారిశుద్ధ్యం, మురుగు కాల్వల నిర్మాణం, రోడ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల నిర్మాణ పథకాలు.. ఇలా ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయ్. గ్రామంలో భూముల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెరుగుదలకు చేయాల్సి కృషి కూడా ముఖ్యమే. ఈ పనులన్నింటికీ.. నేరుగా సర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యత వహిస్తారు. అందువల్ల.. మనం ఎన్నుకునే నాయకుడు సమర్థుడైతేనే.. గ్రామం రూపురేఖలు మారతాయ్. అసమర్ధుడిని ఎన్నుకుంటే.. ఊరుతో పాటు మనం కూడా వెనుకబడిపోతాం. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లలో.. రెండు రకాల నాయకులు ఉంటారు. అధికారం చిక్కగానే.. ఏ రకంగా నిధుల్ని లూటీ చేయాలని ఆలోచించేవాళ్లు కొందరైతే.. తమకు దక్కిన అధికారాన్ని సక్రమంగా వినియోగిస్తూ.. ఊరు కోసం డ్యూటీ చేసే వాళ్లు ఇంకొందరు. స్వార్థపరులైన నేతలు.. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బుని నీళ్లలా ఖర్చు చేస్తారు. వారి లక్ష్యం ఒకటే. పదవిని అడ్డు పెట్టుకొని వ్యక్తిగతంగా లబ్ధిపొందడం.

ప్రభుత్వ పథకాలకు వచ్చే నిధులను, పంచాయతీ ఆదాయాన్ని తమ జేబుల్లోకి మళ్లించుకోవడం మీదే దృష్టి పెడతారు. గ్రామంలో జరిగే ప్రతి పనిలో నాణ్యత పాటించకుండా.. ఎక్కువ బిల్లులు వేయించి కమీషన్లు నొక్కడం మీదే ఫోకస్ ఉంటుంది. అధికార దుర్వినియోగానికి పాల్పడి.. అక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్. తమని గెలిపించిన ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఎన్నికల తర్వాత సమస్యలపై దృష్టి పెట్టని వాళ్లు, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయేవాళ్లు చాలామందే ఉంటారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పటికే ఇలాంటి వాళ్లని.. చాలా మందిని చూసుంటారు. ఫలితంగా.. గ్రామంలో నాసిరకం పనులతో.. అభివృద్ధి కుంటుపడుతుంది. భావి తరాలకు.. కనీస వసతులు కరువవుతాయ్.

సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వారిలో నిజమైన సేవా దృక్పథం ఉన్నవారిని, పదవిని బాధ్యతగా భావించే వారికే మద్దతు తెలపాలి. ప్రభుత్వ నిధులను పారదర్శకంగా, సమర్థవంతంగా వినియోగిస్తూ.. ప్రతి పైసా గ్రామాభివృద్ధి కోసమే ఖర్చు చేసే నాయకుడు కావాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండే వారు, ప్రజల భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకునేవారిని ఎన్నుకోవాలి. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. చిన్న సమస్య అయినా వెంటనే పరిష్కరించడానికి కృషి చేసేది ఎవరో తేల్చుకోవాలి. గ్రామంలో మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, పారదర్శక పాలనని అందించేవారిని ఎన్నుకుంటేనే.. ఊరు బాగుపడుతుంది. ఊరు రాత మారాలంటే.. చైతన్యవంతంగా ఆలోచించాలి. సర్పంచ్‌గా పోటీ చేసే వారి చరిత్రని పరిశీలించాలి. గ్రామ సమస్యలపై వారికి అవగాహన ఉందా? ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించే సామర్థ్యం ఉందా? అనేది కూడా కీలకమే. అందువల్ల.. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే డబ్బు, మద్యం కోసం లొంగిపోతే.. దాని ఎఫెక్ట్ ఊరిపై పడుతుంది. అవన్నీ.. తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే ఇస్తాయి. ఆ తర్వాత ఐదేళ్లు ఊరు భవిష్యత్ ప్రశ్నార్థకంగా తయారవుతుంది.

Also Read: బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. 16 జిల్లాలను ముంచెత్తిన వరదలు.. 

మీ ఒక్క ఓటు విలువ.. మీ కుటుంబం ఐదేళ్ల భవిష్యత్తుతో సమానం. మీ ఓటుని అమ్ముకుంటే.. మీ ఊరి భవిష్యత్తుని మీరే అమ్మేసినట్లవుతుంది. పంచాయతీ ఎన్నికలు కేవలం పదవుల కోసం జరిగే యుద్ధాలు కావు. అవి.. ఊరి భవిష్యత్తుని, ప్రజల జీవితాలని పదిలంగా ఉంచడానికి జరిగే ధర్మపోరాటం. మీ ఓటుతో.. లూటీ చేసే వారిని పక్కన పెట్టి, డ్యూటీ చేసే వారికి అవకాశం ఇవ్వండి. కులం, బలం, వ్యక్తిగత విద్వేషాలను పక్కనపెట్టి.. కేవలం గ్రామాభివృద్ధి ఏకైక ఎజెండానే ముఖ్యమని ఆలోచించండి. ఏ అభ్యర్థి అయితే.. గ్రామానికి నిజాయితీగా సేవ చేస్తారో.. వారినే ఎన్నుకోండి. ఊరు స్వరూపాన్ని మార్చే శక్తి మీ చేతిలోనే ఉంది. మీ ఓటుతో.. ఊరు రాతను మార్చండి.

Story By Anup, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×