E-Paper
Advertisement

Rain Alert: బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. 16 జిల్లాలను ముంచెత్తిన వరదలు..

Rain Alert: బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. 16 జిల్లాలను ముంచెత్తిన వరదలు..
Advertisement

Rain Alert: ఈ సంవత్సరం వర్షాలు పగబట్టినట్టుగా ఉంది. చలికాలం వచ్చిన వర్షాలు మాత్రం ఆగడం లేదు.. పలు ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా చాలా మంది వరదల్లో కొట్టుకుపోతున్నారు కూడా.. అయితే ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు కురవడంతో అక్కడి ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది.

దక్షిణ థాయ్‌లాండ్, మలేషియాలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు..
దక్షిణ థాయ్‌లాండ్, మలేషియాలో బీభత్సమైన వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ థాయ్‌లాండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రస్తుతం 9 ప్రావిన్సుల పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటివరకు 13 మంది మృతి చెందారు. మొత్తం 16 జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఊర్లకు ఊర్లు, ఇళ్లకు ఇళ్లు, రోడ్లు, భవనాలు, వంతెనలు, వాహనాలు కొట్టుకుపోయాయి. వరద బీభత్సంతో దాదాపు 4 లక్షల 65 వేల మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు.

Advertisement

సొంగ్‌ఖ్లా ప్రావిన్స్‌లో 335 మిల్లీమీటర్ల మేర వర్షం..
గత వారంలో సొంగ్‌ఖ్లా ప్రావిన్స్‌లో 335 మిల్లీమీటర్ల మేర అత్యధిక వర్షం కురిసింది. హాట్ యాయ్ మున్సిపాలిటీ అల్లకల్లోలం అయ్యింది. భారీగా వరద నీరు చేరడంతో.. అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అక్కడ ఉన్న మొత్తం 103 కమ్యూనిటీలకు రెడ్ ఫ్లాగ్ తరలింపు ఉత్తర్వులు జారీ చేశారు.

90 మంది రోగులను హెలికాఫ్టర్ ద్వారా తరలింపు
వరద ముట్టడి కారణంగా ఓ హాస్టిటల్ ఆవరణలో ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 90 మంది రోగులను.. హెలికాప్టర్ ద్వారా తరలించారు. ప్రిన్స్ ఆఫ్ సాంగ్‌క్లా యూనివర్సిటీలో రిలీఫ్ స్టేషన్‌లు.. ప్రతిరోజూ ఆహారం, నీటిని అందిస్తున్నాయి.

Advertisement

ఈనెల 29 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
అయితే థాయ్ రెడ్‌క్రాస్.. నివాసితులకు, 1,000 మంది పర్యాటకులకు సహాయం చేస్తుంది. ఈనెల 29వరకు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరద నీటి తీవ్రత కొంచెం తగ్గుతుందని భావిస్తున్నారు.

వరద నీటిలో చిక్కుకున్న పసిబిడ్డ ప్రాణాలు కాపాడిన రెస్క్యూ బృందం..
వరద నీటిలో ఓ పసిబిడ్డ చిక్కుకోగా.. సురక్షితంగా తీసుకువచ్చారు అక్కడి సిబ్బంది. గ్రామాలను ముంచెత్తడంతో స్థానికులు కరెంట్ వైర్లు పట్టుకొని వేలాడతున్నారు. అలా చాలా మంది ప్రాణాలు కాపాడుకున్నారు. వరద బాధితులకు నీరు, ఆహారం లాంటి వసతులను అక్కడి సిబ్బంది కల్పిస్తుంది.

Also Read: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతో తెలిస్తే షాక్..! 

బీభత్సమైన వరదల కారణంగా దాదాపు రెండు మిలియన్ల ప్రజలు ప్రభావితులయ్యారు. వరద తీవ్రతకు రోడ్లు, ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×