E-Paper
Advertisement

Viral Video: కాళీమాతపై మేరిమాత దుస్తులు… వీడియో వైరల్, పూజారి అరెస్ట్

Viral Video: కాళీమాతపై మేరిమాత దుస్తులు… వీడియో వైరల్, పూజారి అరెస్ట్
Advertisement

Viral Video: ముంబైలో కాళిమాత ఆలయంలో చోటుచేసుకున్న ఒక ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెంబూర్ ప్రాంతంలోని ఆలయానికి ఆదివారం వచ్చిన భక్తులు, కాళిమాత విగ్రహం మదర్ మేరీ వేషధారణలో ఉన్నట్లు చూసి ఆశ్చర్యపోయారు. సాధారణంగా శక్తి స్వరూపిణి కాళిమాతకు చేసే అలంకరణకు పూర్తిగా విరుద్ధంగా, క్రైస్తవ సంప్రదాయంలో చూపే మదర్ మేరీ వస్త్రధారణలో విగ్రహం కనిపించడంతో భక్తులు ఆగ్రహంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు విచారణలో సంచన విషయాలు

Advertisement

ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో ఆలయ పూజారి రమేష్, రాత్రి కలలో దేవి ప్రత్యక్షమవుతూ “మదర్ మేరీ రూపంలో నన్ను అలంకరించు” అని చెప్పిందని పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ వివరణతో భక్తుల ఆందోళన మరింత పెరిగింది. సమాజంలో విభేదాలు రేకెత్తించే అవకాశం ఉన్న చర్యగా భావించిన పోలీసులు, మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో వ్యవహరించారనే ఆరోపణలపై, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పూజారిని అరెస్టు చేశారు. స్థానిక న్యాయస్థానంలో హాజరు పరచగా, రెండు రోజుల పోలీసు కస్టడీకి రిమాండ్ మంజూరైంది.

Also Read: IRCTC Shri Jagannath Yatra: ఐఆర్‌సిటిసి ప్రత్యేక శ్రీ జగన్నాథ యాత్ర .. కేవలం రూ.20,210తో భక్తి ప్రయాణం ప్రారంభం

Advertisement

వీడియో వైరల్

ఈ ఘటనపై వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశంలో మత వివాదాలపై మరోసారి చర్చ మొదలైంది. ఇది నిజంగా భక్తి నేపథ్యంతో చేసిన చర్యా? లేక దీని వెనుక మరే ఉద్దేశ్యం ఉందా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలో కూడా విచారణ సాగుతోంది.

గతంలో కూడా ఇలాంటి ఘటనే..

గతంలో జార్ఖండ్‌లోని రాంచీలో దుర్గా పూజ పండల్ ‘వాటికన్ సిటీ’ రూపంలో ఏర్పాటు చేయడంతో కూడా పెద్ద చర్చ ఏర్పడింది. ఆ వేళ విశ్వహిందూ పరిషత్ నాయకులు, హిందూ సంప్రదాయాలను అవమానించే విధంగా ఆ థీమ్ రూపొందించారని వ్యాఖ్యానించారు. అయితే, పండల్ నిర్వాహకులు మాత్రం తమ లక్ష్యం మత ఐక్యతను చూపడం మాత్రమేనని చెప్పినా, పరిస్థితి శాంతించలేదు. అప్పట్లో పెద్ద వివాదానికే దారితీశాయి.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×