E-Paper
Advertisement

Gummadi Sandhya Rani: సెక్రటరీ వివాదం.. సంధ్యారాణి సీన్ రివర్స్?

Gummadi Sandhya Rani: సెక్రటరీ వివాదం.. సంధ్యారాణి  సీన్ రివర్స్?

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి… ప్రతిపక్ష విమర్శలు తిప్పికొట్టడంలో తనదైన దూకుడు ప్రదర్శిస్తూ టీడీపీలో బ్రాండ్ ఇమేజ్ పెంచుకున్న లీడర్,,, అవతల ఉన్నది పుష్ఫ శ్రీవాణి వంటి మాజీ మంత్రులైనా, మాజీ సీఎం జగన్ అయినా తగ్గేదేలే అన్నట్లు ఉండేది ఆమె స్పీడ్.. ఎవరైతే నాకేంటి అన్నట్లు వ్యవహరించే ఆమె దూకుడుకు గత కొంత కాలంగా వరుస వివాదాలు బ్రేకులు వేస్తున్నాయి.. ఆమె పీఏ చేస్తున్ననిర్వాకాల దగ్గరనుంచి.. స్వయంగా ఆమె చేస్తున్న తప్పిదాలతో పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయినట్లు కనిపిస్తున్నారామె… అసలింతకీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరు సెగ్మెంట్లో నడుస్తున్న రాజకీయం ఏంటి?

గుమ్మడి సంధ్యారాణి ఫైర్ బ్రాండ్ ఇమేజ్

గుమ్మడి సంధ్యారాణి… రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖల మంత్రి. రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్ . ప్రతిపక్షం విమర్శిస్తే ఎదురుదాడికి ముందుంటారు. అది జగన్ అయినా , మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి అయినా. తగ్గేదేలె అన్నట్లుంటుంటుంది ఆమె దూకుడు. ఎదురులేని మనిషి. ఎవడైతే నాకేంటి…అనే సినిమా టైటిల్స్ నావే అన్నట్లుంటుంటుంది ఆమె రాజసం. ఎలాంటి బూతులు లేకుండా సటైరికల్ గా సాగే ఆమె ప్రసంగం అధికార పక్షానికి ఫుల్ మజా అయితే …ప్రతిపక్షానికి మాత్రం బేజారు. 11 రెడ్డి అంటూ జగన్ ని తిట్టినా , విజనరీ అంటూ చంద్రబాబుని పొగిడినా ఆమె వాగ్ధాటికి తిరుగులేదు. పొలిటికల్ గా ప్రతిపక్షంపై ఆమె చేసే కౌంటర్ ఎన్‌కౌంటర్యకన్నా దారుణంగా ఉంటుందని టాక్.

గుక్క తిప్పుకోకుండా చేస్తున్న వరుస వివాదాలు

విపక్షాలను ఏకి పారేయడంలో పేరుకి తగ్గట్లే ఉమ్మడి విజయనగరంలో ఆమె రాణి. తొణుకు బెనుకు లేకుండా సాగే ప్రసంగాలతో ప్రత్యర్ధులకి వణుకు పుట్టిస్తారనేది పొలిటికల్ సర్కిల్స్‌ నడిచే చర్చ. అయితే ఇదంతా నిన్న మొన్నటివరకు. ప్రస్తుతం సీన్ రివర్స్ … పెరుగుట విరుగుట కొరకే…ఓడలు బండ్లవుతాయి … బండ్లు ఓడలవుతాయి… రోజులన్నీ ఒకేలా ఉండవు… అట్టేసినమ్మ తిరగేయక తప్పదు… ప్రస్తుతం గుమ్మడి సంధ్యారాణి పరిస్థితి అలా తయారైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుస వివాదాలు ఆమెను గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయనే చర్చ నడుస్తుంది.

ఆధారాలతో సహా ఆరోపణలు

బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ప్రత్యర్ధులు ఆధారాలతో సహా చేస్తున్న ఆరోపణలు ఆమెను అదిరేలా చేస్తున్నాయనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో చెక్కర్లు కొడుతోంది. అవును గుమ్మడి సంధ్యారాణి గురించి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రస్తుతం వినిపిస్తున్న డైలాగ్‌లు ఇవే అంటున్నారు. పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ఏ ఒక్కరిని కదిపినా గతం చెప్పిన అభిప్రాయానికి ఉల్టా చెబుతున్నారట. అదేంటి మొన్ననే కదా మేడం టాలెంట్ ని పొగిడారు అని అడిగితే అబ్బే ..అంటూ నాలుక మడతేస్తున్నారట.

తలనొప్పిగా మారిన పర్సనల్ సెక్రటరీ వివాదం

పర్సనల్ సెక్రటరీ వివాదం సంధ్యారాణికి తలనొప్పిగా మారిందట. ఈ వివాదంపై సీఎం కూడా సీరియస్‌గానే ఉన్నారని టీడీపీ శ్రేణులే అంటున్నాయి. దీనికి తార్కాణం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సంధ్యారాణి కనబడకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిందట. చంద్రబాబు, లోకేష్ లు సైతం పాల్గొన్న కార్యక్రమానికి లోకల్ మంత్రి… అదీ గిరిజన నియోజకవర్గం అయి ఉండి … గిరిజన సంక్షేమ శాఖ మంత్రీ ఎందుకు కనబడలేదు అనే చర్చ జిల్లాలో నడుస్తోందట. కూటమి ప్రభుత్వానికి గిరిజనులంటే ప్రేమ ఉంది కాబట్టే గిరిజన ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కూడా స్వయంగా సంధ్యారానే ప్రకటించారు.

ముఖ్యమంత్రి పర్యటనపై సమీక్ష

తీరా చూస్తే ఆమె కార్యక్రమంలో కానరాలేదు. పోనీ అలా అని లోకల్ లో లేరా అంటే అదీ కాదు. ముందు రోజు ముఖ్యమంత్రి పర్యటనపై సమీక్ష చేశారు. ఏర్పాట్లు పరిశీలించారు. ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అంతెందుకు అదే రోజు సాలూరులో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్ కి కూడా హాజరయ్యారు. సరిగ్గా భామినిలో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కి బయలుదేరే సమయంలో… ఆమె తిప్పండ్రా కార్లు అన్నట్లు విజయవాడ వెళ్లిపోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయట. ఇక్కడే ఈ అంశమే ప్రతిపక్షాలకు పాశుపతాస్త్రం దొరికిందట. ఏంటి మంత్రి గారు కనిపించలేదు. రావొద్దన్నారా లేక ఆహన్వం లేదా… ఓ క్షమించాలి ఈమె జిల్లాలో ఈమెకి ఆహ్వానం లేకలోవడమేంటి…. అంటూ చమత్కారంగా ప్రశ్నలు సంధిస్తున్నారట ఫ్యాన్ పార్టీ నేతలు. నీ స్థాయి ఇదా.. మరి నువ్వేంటి ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడతావ్.. స్థాయి చూసుకోవాలి కదా అంటూ చురకలంటిస్తున్నారట.

సీనియర్లను పట్టించుకోని సంధ్యారాణి

అలా అని ఇదొక్కటే కాదు..వివాదాల సుడిగుండాలు ఆమెను చుట్టుముడుతూనే ఉన్నాయనే చర్చ జిల్లాలో జోరుగా నడుస్తుందట. పార్టీలో సీనియర్లకు విలువివ్వకుండా… వైసీపీ నుండి వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈలోపే ముగ్గురు గురుకుల వసతి గృహాల బాలికలు జాండిస్ తో చనిపోయినా..హుటాహుటిన బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం .. హాస్టల్స్ ను పరిశీలించకపోవడం ఇవన్నీ ఒకదానికొకటి ఊపిరి సలపకుండా చేశాయి. సరేలే అనుకునేలోపు ..జనాలకి జ్వరం వస్తే నానేటి సేసేది అని పుసుక్కున నోరు జారేశారు అమాత్యులు. ఇక్కడే ఎరక్క వచ్చి ఇరుక్కుపోయాను అనేలా అప్పటికే కాసుకుని కూర్చున్న వైసీపీకి అడ్డంగా బుక్కయ్యారు. పోనీ జరిగిందేదో జరిగింది.. విమర్శలు, ప్రతి విమర్శలు అన్ని రాజకీయాలలో కామన్ అనుకున్నారు.

పర్సనల్ సెక్రటరీ పై మహిళ కంప్లైంట్

కానీ ఈ వివాదం జరిగి నాలుగు జాములు కూడా కాకముందు… ఆమె పర్సనల్ సెక్రటరీ వేధిస్తున్నాడు అంటూ ఓ మహిళ కంప్లైంట్ చేసింది…ఉద్యోగం పేరుతో ఆర్ధికంగా మోసం చేశాడని, శారీరకంగా వేధింపులకు గురి చేశాడంటూ రోడ్డెక్కింది. నోటి మాట కాదు ప్రూఫ్ లుగా వాట్సాప్ చాట్ లు కూడా ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మహిళ కంప్లైంట్ చేసి రచ్చ చేయకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో .. సుఖాంతం కావాల్సిన సినిమా ..సస్పెన్స్ థ్రిల్లర్ లా రోజుకో మలుపు తిరిగింది… తిరిగి తిరిగి సీయం చంద్రబాబు దగ్గరకు చేరింది. క్రమ శిక్షణకి ప్రాధాన్యత ఇచ్చే పెద్దాయన వెంటనే సీఎంఓ అధికారులను రంగంలోకి దింపి మంత్రి సెక్రటరీ పై సస్పెన్షన్ వేటు వేసేలా చర్యలు తీసుకున్నారు.

మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అంశాలు

ఇదే పని అమాత్యులు వారు చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న మాట. కానీ సంధ్యారాణి మాత్రం లైట్ తీసుకున్నారు. అందుకే తనయుడు వాట్సాప్ చాట్ అంటూ మరో ఆధారాన్ని బయట పెట్టింది మహిళ. ఇందులో నిజమెంత అబద్ధమెంత అనేది కోర్టులు తెలుస్తాయి. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టడం మినిమమ్ పొలిటికల్ సెన్స్. ఇలాంటి కేసులు సివిల్ కోర్టుల్లో ల్యాగ్ అవ్వొచ్చేమో కానీ పొలిటికల్ కోర్టులో కాదుగా.. అందుకే మంత్రి డిఫెన్స్ చేసుకొనేలోపే మాజీ మంత్రులిద్దరూ ఆమోను ఓ ఆటాడుకుంటున్నారు అనే టాక్ నడుస్తుందట. దొరికిందే తడవుగా మంత్రిని ఇరకాటంలో పెట్టేశారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఇలా ఒకదాని వెనుక ఒకటి వెలుగు చూస్తున్న అంశాలు మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంట. చూడాలీ మరి మంత్రి సంధ్యారాణి పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ లో ఎలాంటి రిజల్ట్‌తో గట్టెక్కుతారో.

Story by Ajay, Big Tv 

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×